వాట్సాప్ వెబ్ వర్షన్ ప్రత్యేకతలేంటి..?

వాట్సప్ తన వెబ్‌వర్షన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. వెబ్ బ్రౌజర్‌లో వాట్సాప్‌ను వినియోగించుకునే యూజర్లు చాట్స్ ఇంకా గ్రూప్ సంభాషణలను నిర్వహించుకోవచ్చు.

వాట్సాప్ వెబ్ వర్షన్ ప్రత్యేకతలేంటి..?

Read More: Windows 7కు ముగింపు పలికిన మైక్రోసాఫ్ట్

వాట్సాప్ మొబైల్ వర్షన్‌కు ఎక్స్‌టెన్సన్‌గా పనిచేస్తున్న వాట్సాప్ వెబ్ వర్షన్‌ ద్వారా ఫోన్‌కు వచ్చిన వాట్స్‌యాప్ సంభాషణలు ఇంకా సందేశాలను కంప్యూటర్‌ ఇంకా ల్యాప్‌టాప్‌లో మేనేజ్ చేసుకునేందుకు వీలుంటుంది. తాజా సవరణల నేపథ్యంలో వెబ్ వర్షన్ ఇంటర్ ఫేస్ పై వినియోగదారులు తన ప్రొఫైల్ పిక్‌తో పాటు స్టేటస్ మెసేజ్‌లను కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా సెట్టింగ్స్ ఐకాన్ ఇన్-గోయింగ్ చాట్‌లను డిలీట్ ఇంకా ఆర్చివ్ చేసేందుకు యాక్సెస్‌ను కల్పిస్తుంది. మీ ఫోన్‌లోని వాట్సాప్ అకౌంట్‌ను డెస్క్‌టాప్ పై నిర్వహించుకునేందుకు సూచనలు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించుకోవాలంటే..?

వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించుకోవాలంటే మీ ఫోన్ లేదా టాబ్లెట్‌లో వాట్సాప్ అకౌంట్ యాక్టివ్‌గా ఉండాలి. అలానే మీ ఫోన్‌‍కు రేర్ ఫేసింగ్ కెమెరా పనిచేసే స్థితిలో ఉండాలి.

కంప్యూటర్ తప్పనిసరి..

వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించుకోవాలంటే కంప్యూటర్ తప్పనిసరి. అది డెస్క్‌టాప్ , ల్యాప్‌టాప్, విండోస్, మాక్, క్రోమ్ ఏదైనా కావొచ్చు.

బ్రౌజర్‌ లేటెస్ట్ వర్షన్‌దై ఉండాలి..

మీ కంప్యూటర్‌లో వినియోగించే క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఓపెరా లేదా సఫారీ బ్రౌజర్‌ లేటెస్ట్ వర్షన్‌దై ఉండాలి. మీరు ఉపయోగించే రెండు డివైస్‌లకు యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి.

బ్రౌజర్‌ను ఓపెన్ చేయండి...

ముందుగా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉన్న మీ కంప్యూటర్‌లోని  బ్రౌజర్‌ను ఓపెన్ చేసి http://web.whatsapp.comలోకి వెళ్లండి. ఇప్పుడు మీకు క్యూఆర్ కోడ్ తో కూడిన పేజీ ఓపెన్ అవుతుంది. ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకునట్లయితే డెస్క్‌టాప్ సర్వీస్ యాక్సెస్ అవుతుంది.

ఆండ్రాయిడ్ యూజర్లు..

ఆండ్రాయిడ్ యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్‌లోని మెనూ‌లోకి వెళ్లి "WhatsApp Web" ఆప్సన్ టాప్ చేయటం ద్వారా క్యూఆర్ కోడ్‌ స్కాన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఐఓఎస్ యూజర్లు ...

ఐఓఎస్ యూజర్లు వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి "WhatsApp Web" ఆప్సన్ పై టాప్ చేయటం ద్వారా క్యూఆర్ కోడ్‌ స్కాన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

విండోస్ ఫోన్ యూజర్లు...

విండోస్ ఫోన్ యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్ మెనూలోకి వెళ్లి "WhatsApp Web" ఆప్సన్ పై టాప్ చేయటం ద్వారా క్యూఆర్ కోడ్‌ స్కాన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

కోడ్‌ స్కాన్ అయిన తరువాత..

క్యూఆర్ కోడ్‌ స్కాన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత డెస్క్‌టాప్ సర్వీస్ యాక్సెస్ అవుతుంది.

ఎక్స్‌టెన్సన్ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి..

వాట్సాప్ వెబ్ ఎక్స్‌పీరియన్స్, ఫోన్ ఎక్స్‌పీరియన్స్ తరహాలోనే ఉంటుంది. వాట్స్‌యాప్ వెబ్ వర్షన్‌ మొబైల్ వర్షన్‌కు ఎక్స్‌టెన్సన్ మాత్రమే. యాజర్ తన ఫోన్‌కు వచ్చిన వాట్సాప్ సందేశాలను కంప్యూటర్‌లో చూసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp on the Web, Things you need to know. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting