WhatsApp లో OTP స్కామ్! ఎలాచేస్తారో తెలుసుకొని...జాగ్రత్త పడండి.

By Maheswara
|

వాట్సాప్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన మల్టీప్లాట్‌ఫార్మ్ మెసేజింగ్ అనువర్తనంలో ఒకటి. ఈ ప్రాచుర్యాన్ని కొంతమంది హక్కెర్లు వారికి అనుకూలంగా మార్చుకునే ప్రణాళికలు ,టెక్నిక్ లు ప్రయోగిస్తుంటారు. వాట్సాప్ ఈ రీతిలో ప్రసిద్ధి చెందడం వల్ల ఇది అనువర్తనం యొక్క వివిధ వినియోగదారులను లక్ష్యంగా చేసుకునే లక్ష్యంతో వివిధ రకాల అవకతవకలకు గురవుతుంది.ఇప్పుడు వాట్సాప్ లో కొత్త రకం స్కామ్ లు జరుగుతున్నాయి. ఈ క్రొత్త రూపం హ్యాకర్ మీ స్నేహితుడి ఖాతాలను హ్యాక్ చేసి, మీ ఖాతాను యాక్సెస్ చేయడానికి మీకు వ్యక్తిగతమైన సందేశాలను పంపుతుంది.

 

ఈ స్కామ్ ఎలా పనిచేస్తుంది?

ఈ స్కామ్ ఎలా పనిచేస్తుంది?

కష్టాల్లో ఉన్న స్నేహితునికి సహాయం చేయడం లో ఎవరు వెనకడుగు వేయరు కాబట్టి,అదే హ్యాకర్ లకు అవకాలను కల్పిస్తుంది.ఈ వాట్సాప్ ఓటిపి కుంభకోణంలో, హ్యాకర్ మీ స్నేహితుడని చెప్పుకుంటూ మీకు సందేశం పంపుతాడు.మీ దృష్టిని ఆకర్షించడానికి ఒకరకమైన అత్యవసర పరిస్థితిని వివరిస్తాడు.

Also Read: WhatsApp లో కొత్త డిసప్పెరింగ్ మెసేజ్ ఫీచర్ ను ప్రారంభించడం ఎలా??Also Read: WhatsApp లో కొత్త డిసప్పెరింగ్ మెసేజ్ ఫీచర్ ను ప్రారంభించడం ఎలా??

OTP ని ఫార్వార్డ్ చేయడానికి
 

OTP ని ఫార్వార్డ్ చేయడానికి

మీ స్నేహితుడ ని నమ్మకం కలిగించేందుకు కొన్ని విషయాలు వివరిస్తాడు.మీ పూర్తిగా నమ్మిన తర్వాత, హ్యాకర్ ఒక OTP ని అడుగుతాడు. OTP ని ఫార్వార్డ్ చేయడానికి మిమ్మల్ని ఆకర్షించడానికి స్కామర్లు చాల మెసెజ్ లను పంపుతారు.

ఈ OTP ధ్రువీకరణ ద్వారా మీ వాట్సాప్ ఖాతాను హ్యాకర్ యాక్సెస్ చేయాలనుకుంటున్నారు. ప్రమాదవశాత్తు మీరు OTP ను మోసగాడితో పంచుకుంటే! ఇక తర్వాత  మీరు మీ వాట్సాప్ ఖాతా నుండి లాక్ చేయబడతారు. మీ వ్యక్తిగత సమాచారం ,మెసేజ్ లు , పరిచయాలు మరియు వాట్సాప్ గ్రూప్ లో మీ ఐడెంటిటీ తో హ్యాకర్‌కు పూర్తి  యాక్సిస్ ఉంటుంది

మీ స్నేహితులకు మెసేజ్ లు పంపి

మీ స్నేహితులకు మెసేజ్ లు పంపి

ఇలా హ్యాకింగ్ చేసిన వాట్సాప్ ఖాతాల ద్వారా హ్యాకర్ లు మీ స్నేహితులకు మెసేజ్ లు పంపి  వారిని ఆర్థిక హయం కోరవచ్చు. అంతేకాక వారిని కూడా ఈ OTP ద్వారా ఈ ఉచ్చులోకి లాగి వారి ఖాతాలు కూడా హ్యాక్ చేయవచ్చు.అలాగే వాట్సప్ గ్రూప్ లలో మెసెజ్ ల ద్వారా మీ గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించవచ్చు.

వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు

వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు

ఈ రకమైన మోసాలకు బలైపోకుండా నిరోధించాలనుకునే వినియోగదారులకు వాట్సాప్‌లో రెండు-కారకాల ప్రామాణీకరణ ఉపయోగపడుతుంది. ఈ రకమైన మోసాలను నిరోధించడానికి నియమం ఏమిటంటే, మీ OTP లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు.మీ స్నేహితులు,సన్నిహితులు లాగా ఎవరైనా ఎవరైన మీ వ్యక్తిగత సమాచారం లేదా OTP వంటి విషయాలు కనుక్కోవాలని చూస్తే, ముందుగా వారి గుర్తింపును ఫోన్ చేయడం లేదా మరి ఏ ఇతర రూపాలలో నిర్దారించుకొని తర్వాత మీ చేయవలసిన పనిని ఆలోచించుకోండి.

Best Mobiles in India

English summary
Whatsapp OTP Scam Alert: Avoid Sharing OTP On Whatsapp

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X