పేటీఎంకి దిమ్మతిరిగే షాకివ్వబోతున్న వాట్సప్ పే,తొలి అవకాశం ఇండియాకే..

Written By:

వాట్సప్ వాడే యూజర్లకు అతి త్వరలోనే వాట్సప్ ఓ శుభవార్తను అందించనుంది. అతి త్వరలోనే వాట్సప్ పేమెంట్ ఆప్సన్ రానుంది. చాలా రోజులుగా ఈ ఫీచర్‌పైనే పనిచేస్తున్న వాట్సప్.. అతి త్వరలోనే దీనిని ఇంట్రడ్యూస్ చేయనుంది. అయితే ఈ కొత్త ఫీచర్‌ను తొలిసారి ఇండియాలోనే ప్రారంభించనున్నట్లు వాట్సప్ ప్రకటించింది. దీనిని వాట్సాప్ పేగా పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.

గూగుల్ సీఈఓని ముప్పతిప్పలు పెడుతున్న ప్రశ్న !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫండ్ ట్రాన్స్‌ఫర్స్..

ఈ యాప్ ద్వారా యూజర్లు ఫండ్ ట్రాన్స్‌ఫర్స్ చేసుకోవచ్చు. ఈ యూపీఐ ఆధారిత పేమెంట్ ఫీచర్ కోసం వాట్సప్ ఇప్పటికే ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులతో చేతులు కలిపినట్లు సమాచారం.

ఫైనల్ టెస్టింగ్‌లో..

ప్రస్తుతం ఈ ఫీచర్ ఫైనల్ టెస్టింగ్‌లో ఉంది. బీటా వర్సన్ వచ్చే నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఇప్పటికే వాట్సప్‌కు పోటీగా ఉన్న వీచాట్‌లో పేమెంట్ ఆప్షన్ లాంచ్ అయింది.

అటాచ్‌మెంట్ ఆప్షన్ కింద రూపీ సింబల్‌తో..

వాట్సప్ చాట్‌లో అటాచ్‌మెంట్ ఆప్షన్ కింద రూపీ సింబల్‌తో ఈ ఫీచర్ రానున్నది. దీని ద్వారా ఒకే స్టెప్‌లో ఫ్రెండ్స్‌కు ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అమౌంట్, యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే చాలు.

అటాచ్‌మెంట్ ఆప్షన్ కిందే ..

చాట్ స్క్రీన్ నుంచి బయటకు వచ్చి పేమెంట్స్ చేయాల్సిన అవసరం లేకుండా అటాచ్‌మెంట్ ఆప్షన్ కిందే రూపీ సింబల్ ఉంచుతున్నట్లు వాట్సప్ వెల్లడించింది.

ఇప్పటికే లైవ్ లొకేషన్..

అన్నీ కుదిరితే ఈ ఫీచర్ డిసెంబర్ లో ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే లైవ్ లొకేషన్ , అలాగే delete for everyoneలాంటి ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది

పేటీఎం, మొబిక్విక్‌లాంటి పోటీదారులకు

వాట్సప్ ఈ పేమెంట్స్ ఆప్షన్‌ను విజయవంతంగా లాంచ్ చేయగలిగితే.. పేటీఎం, మొబిక్విక్‌లాంటి పోటీదారులకు కష్టకాలమే.

యాక్టివేట్ చేసుకోవడం చాలా సింపుల్‌

వాట్సప్‌లోకి మరో కొత్త ఫీచర్, యాక్టివేట్ చేసుకోవడం చాలా సింపుల్‌ మరింత సమాచారం కోస చదవండి 

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp payment feature in testing stage, Indian users may get it in December more news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot