వాట్సప్ నుంచి పేమెంట్లు చేసేయండి, ఎలా చేయాలంటే..

By Hazarath
|

వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్ మార్కెట్లోకి దూసుకొస్తోంది. ఇన్‌స్టంట్ మేజేసింగ్ రంగంలో దూసుకుపోతున్న వాట్సప్ ఈ ఫీచర్ కేవలం బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా అతి త్వరలో ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానుంది. వాట్సప్‌కు చెందిన బీటా వెర్ష‌న్ యాప్‌ను ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫాంల‌పై వాడే యూజ‌ర్ల‌కు ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. ఈ క్రమంలోనే స‌ద‌రు యూజ‌ర్లు చాట్‌ విండోలోనే ఈ ఫీచర్‌ను యాక్సస్‌ చేసుకోవచ్చు.

 

లీకయిన Xiaomi కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, 8జిబి ర్యామ్‌, ఇంకా అదిరే ఫీచర్లతో..లీకయిన Xiaomi కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, 8జిబి ర్యామ్‌, ఇంకా అదిరే ఫీచర్లతో..

 యూపీఐతో కనెక్ట్‌ అయిన బ్యాంకు అకౌంట్‌ను..

యూపీఐతో కనెక్ట్‌ అయిన బ్యాంకు అకౌంట్‌ను..

గ్యాలరీ, వీడియో, డాక్యుమెంట్లు వంటి ఇతర ఆప్షన్లతో పాటు ఈ ఆప్షన్‌ కూడా ఇక అందుబాటులో ఉంటుంది. పేమెంట్స్‌ను క్లిక్‌ చేస్తే.. ఓ డిస్‌క్లెయిమర్ విండో ఓపెన్‌ అవుతుంది. దీంట్లో బ్యాంకుల జాబితా కూడా ఉంటుంది. ఈ క్రమంలో యూపీఐతో కనెక్ట్‌ అయిన బ్యాంకు అకౌంట్‌ను యూజర్లు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో స‌ద‌రు అకౌంట్ నుంచి నేరుగా న‌గ‌దును ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు.

 

ముందుగా పిన్‌ను క్రియేట్‌ చేసుకోవాలి.

ముందుగా పిన్‌ను క్రియేట్‌ చేసుకోవాలి.

ఒకవేళ ఇప్పటి వరకు యూపీఐ పేమెంట్స్‌ ప్లాట్‌ఫామ్‌ను యూజ‌ర్లు వాడి ఉండకపోతే, ముందుగా పిన్‌ను క్రియేట్‌ చేసుకోవాలి. అదనంగా యూపీఐ యాప్‌ ద్వారా లేదా సంబంధిత బ్యాంకు వెబ్‌సైట్‌ ద్వారా యూపీఐ అకౌంట్‌ను క్రియేట్‌ చేసుకోవాలి. దీంతో వాట్సప్‌లో పేమెంట్స్ ఫీచ‌ర్‌ను వాడుకునేందుకు వీలుంటుంది.

ఇద్దరికీ కచ్చితంగా..
 

ఇద్దరికీ కచ్చితంగా..

ఇక లావాదేవీని విజయవంతంగా పూర్తిచేసుకోవాలంటే నగదు పంపేవారికి, స్వీకరించే వారికి ఇద్దరికీ కచ్చితంగా వాట్సప్‌ ఆఫర్‌ చేసే పేమెంట్స్‌ ఫీచర్‌ ఉండాలి.

2.18.21 వాట్సప్ బీటా వెర్షన్‌కు..

2.18.21 వాట్సప్ బీటా వెర్షన్‌కు..

వాట్సప్ అందుబాటులోకి తీసుకువ‌చ్చిన ఈ పేమెంట్స్ ఫీచ‌ర్ ఐఓఎస్‌లోని 2.18.21 వాట్సప్ బీటా వెర్షన్‌కు, ఆండ్రాయిడ్‌ 2.18.41 బీటా వెర్షన్‌ వారికి అందుబాటులో ఉంది. త్వ‌ర‌లో పూర్తి స్థాయిలో ఈ ఫీచ‌ర్ యూజ‌ర్లంద‌రికీ అందుబాటులోకి రానుంది.

భారత్‌లో డిజిటల్‌ పేమెంట్లు..

భారత్‌లో డిజిటల్‌ పేమెంట్లు..

ఇటీవల భారత్‌లో డిజిటల్‌ పేమెంట్లు ఎక్కువగా పెరగడంతో, పేమెంట్స్‌ ప్లాట్‌ఫామ్‌ను ఆఫర్‌చేసి మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవాలని వాట్సాప్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

గిజ్మో టైమ్స్‌లో..

గిజ్మో టైమ్స్‌లో..

కాగా గిజ్మో టైమ్స్‌లో ఈ వాట్సప్‌ పేమెంట్స్‌ ఫీచర్‌ తొలుత స్పాట్‌ అయింది. చాట్‌ విండోలోనే ఈ ఫీచర్‌ను యూజర్లు యాక్సస్‌ చేసుకోవచ్చు. గ్యాలరీ, వీడియో, డాక్యుమెంట్లు వంటి ఇతర ఆప్షన్లతో పాటు ఈ ఆప్షన్‌ కూడా ఇక అందుబాటులో ఉంటుంది.

Best Mobiles in India

English summary
WhatsApp Payments UPI-Based Feature Arrives in India on Android Phones,iPhone more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X