Whatsapp లో కొత్త ఫీచర్ ! ఎందుకు ,ఎలా వాడాలో తెలుసుకోండి ?

By Maheswara
|

మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ప్రపంచంలోనే అత్యధిక యాక్టివ్ యూజర్లను కలిగిన ప్రముఖ మెసెజ్ యాప్. ఇందులో దీని ప్రత్యేక ఫీచర్ల కారణంగా ఇది వినియోగదారులకు ఇష్టమైన మెసేజింగ్ అప్లికేషన్‌గా మారింది. వినియోగదారుల సౌకర్యార్థం వాట్సాప్ లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంటారు. ప్రస్తుతం, ఈ ప్లాట్‌ఫారమ్‌లో మరొక కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. ఈ కొత్త ఫీచర్లు Disappearing మెసేజ్‌ల ను వాడుతున్న వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటాయని తెలిపింది.

WhatsApp ప్రస్తుతం కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది.

WhatsApp ప్రస్తుతం కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది.

అవును, WhatsApp ప్రస్తుతం కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. దీనికి Kept మెసేజెస్ అని పేరు పెట్టారు. Disappearing Message ల ఫీచర్ ను ఉపయోగించే వారికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు. ఈ ఫీచర్‌తో మీరు Disappearing మెసేజ్‌లను అలాగే ఉంచుకోవచ్చని తెలుస్తోంది. కాబట్టి WhatsApp యొక్క కొత్త Kept Messages ఫీచర్ యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇది ఎలా పని చేస్తుందో తెలుసుకోవడానికి పూర్తి కథనాన్ని చదవండి.

Disappearing మెసేజ్‌ల ఫీచర్‌

Disappearing మెసేజ్‌ల ఫీచర్‌

వాట్సాప్‌లో Disappearing మెసేజ్‌ల ఫీచర్‌ను ప్రవేశపెట్టి చాలా కాలం అయ్యింది. ఒకసారి ఇది ప్రారంభించబడి, టైమర్ 24 గంటలకు సెట్ చేస్తే, సెట్ చేసిన సమయం ముగిసిన తర్వాత అన్ని మెసేజిలు  అదృశ్యమవుతాయి. ఈ ఫీచర్ పనిచేసేటప్పుడు కూడా మీరు కొన్ని ముఖ్యమైన మెసేజి లను సేవ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు మీరు ఏమి చేయాలి? ఈ సమస్యను పరిష్కరించడానికి WhatsApp Kept Messages ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

Kept Messages ఫీచర్

Kept Messages ఫీచర్

Disappearing మెసేజ్‌ల ను ఆక్టివేట్ చేసినప్పటికీ, Kept Messages ఫీచర్ అన్ని చాట్‌లను సేవ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. నివేదిక ప్రకారం, పంపినవారు మరియు స్వీకరించేవారు ఇద్దరూ చాట్‌లను సేవ్ చేసుకునే అవకాశాన్ని కూడా పొందుతారు. అలాగే వినియోగదారులు తమ చాట్‌లను కొన్ని కారణాల వల్ల తొలగించాలనుకుంటే, అదే చాట్‌లను తీసివేయడం ద్వారా సాధ్యమవుతుంది.

వాట్సాప్ చాట్ బాక్స్

వాట్సాప్ చాట్ బాక్స్

ఇప్పుడు ఈ కొత్త ఐకాన్ వాట్సాప్ చాట్ బాక్స్ ఎగువన అందుబాటులో ఉంటుంది. మీరు ఏదేని మెసేజి ని ఎక్కువసేపు నొక్కితే మాత్రమే ఈ ఎంపిక కనిపిస్తుంది. అప్పుడు ఈ ఎంపికను ఉపయోగించి ఒకరు చాట్‌లను సేవ్ చేయవచ్చు లేదా తీసివేయవచ్చు. అయితే Disappearing చాట్‌లను సేవ్ చేసుకునేందుకు యూజర్లకు ఒక్క అవకాశం మాత్రమే లభిస్తుందని చెబుతున్నారు.

ఈ కొత్త ఫీచర్

ఈ కొత్త ఫీచర్

ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్ 2.22.20.3 వెర్షన్ వాట్సాప్ బీటా అప్‌డేట్‌లో కనిపించింది. ఇది ఎప్పటిలోగా సామాన్య  వినియోగ దారులకు అందుబాటులోకి వస్తుందనే విషయం పై ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం ఇది ఇంకా అభివృద్ధిలోనే ఉంది. దీనిని పరీక్షించడానికి మొదట బీటా టెస్టర్‌లకు విడుదల చేయబడింది. ఒకసారి పరీక్ష విజయవంతంగా పూర్తయితే ఈ ఫీచర్ యాప్ స్టేబుల్ వెర్షన్‌లో వస్తుందని చెబుతున్నారు.

సర్వే ఫీచర్

సర్వే ఫీచర్

అంతేకాదు, ఇంకా వాట్సాప్ అనేక కొత్త ఫీచర్లపై పనిచేస్తోంది. దీని ప్రకారం, వాట్సాప్ తన ప్లాట్‌ఫారమ్‌లో ఇటీవల కొత్త సర్వే ఫీచర్‌లను ప్రవేశపెట్టింది. ఈ సర్వే ఫీచర్ ప్రాథమికంగా చాట్ మోడ్‌లో కనిపిస్తుంది. వాట్సాప్ వినియోగదారులు ఇందులో తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. ఈ సర్వే ద్వారా మీరు యూజర్ అనుభవాన్ని తెలుసుకునే అవకాశం లభిస్తుంది.

మీ అభిప్రాయాన్ని గోప్యంగా ఉంచుతామని WhatsApp చెబుతోంది

మీ అభిప్రాయాన్ని గోప్యంగా ఉంచుతామని WhatsApp చెబుతోంది

వినియోగదారులు ఈ సర్వేలో పాల్గొనాల్సిన పరిస్థితి లేదు. మీరు సర్వేలో పాల్గొనకూడదనే అవకాశం కూడా ఉంది. మీరు సర్వేలో పాల్గొనే ముందు వాట్సాప్ వినియోగదారుల నుండి అనుమతి కోరుతుందని చెప్పబడింది. మీ అభిప్రాయాన్ని గోప్యంగా ఉంచుతామని WhatsApp చెబుతోంది. అదనంగా, వినియోగదారులు భవిష్యత్తులో మీకు కొత్త సర్వేలను పంపకుండా WhatsAppని నిషేధించే అవకాశం కూడా ఉంది. వెరిఫై చేయబడిన వాట్సాప్ ఖాతా ద్వారా సర్వే పంపబడుతుంది. ఇది గ్రీన్ టిక్‌ మార్క్ తో వస్తుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Whatsapp Planning To Introduce New Feature Called Kept Messages. Know How It Works?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X