నిన్న ఫేస్‌బుక్, నేడు వాట్సప్.. డేంజర్ జోన్‌లో యూజర్లు..

Written By:

సోషల్ మీడియాల ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకుంది. నిన్న ఫేస్‌బుక్ ప్రైవసీ ప్రమాదపు మంటలు ఆరకముందే ఇప్పుడు వాట్సప్ డేంజర్ జోన్ లోకి వెళ్లిందనే వార్తలు కలవరం పుట్టిస్తున్నాయి. ఫేస్‌బుక్ డేటా లీకయిన దుమారం సోషల్ మీడియాలో ఎంతగా ఆందోళన రేపిందంటే ఫేస్‌బుక్ అధినేత దీనిపై బహిరంగ క్షమాపణ చెప్పే దాకా వెళ్లింది. అయినప్పటికీ దాని ప్రకంపనలు ఇంకా ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దానిబాటలో వాట్సప్ పయనిస్తోంది. వాట్సప్ యూజర్లను టార్గెట్ చేస్తూ కొత్త యాప్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వాట్సప్ యూజర్ల సమస్త సమాచారం ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జియో ప్రైమ్‌ ఉచిత రెన్యువల్ కనిపించడం లేదా, అయితే ఇలా చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టార్గెట్‌ చేసిన కొత్త యాప్‌

వాట్సప్‌ యూజర్లను టార్గెట్‌ చేసిన ఒక కొత్త యాప్‌, యూజర్లు ఎప్పుడు ఆన్‌లైన్‌లో ఉంటున్నారు, ఎవరితో ఛాటింగ్‌ చేస్తున్నారు వంటి వివరాలను బహిర్గతం చేస్తుంది. ఈ యాప్‌ పేరు ఛాట్‌వాచ్‌గా తెలుస్తోంది. అయితే ఇది ఛాట్‌డబ్ల్యూగా అందుబాటులో ఉందని తెలుస్తోంది.

వాట్సప్‌ కాంటాక్ట్‌లో ఉన్నవారు..

ఈ యాప్‌ ద్వారా మీ వాట్సప్‌ కాంటాక్ట్‌లో ఉన్నవారు ఎప్పుడు ఆన్‌లైన్‌లో ఉంటున్నారు? ఎప్పుడు ఇద్దరు వ్యక్తులు ఛాటింగ్‌ చేసుకుంటున్నారు? వంటివి రాబట్టవచ్చని తెలుస్తోంది. ‘లాస్ట్‌ సీన్‌' మీరు తీసేసినప్పటికీ, వాట్సప్‌ కాంటాక్ట్‌ల యాక్టివిటీని ఇది కనిపెట్టేస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

వారానికి రూ.140 చెల్లించి..

అయితే ఈ యాప్‌ ఉచితంగా కాకుండా వారానికి రూ.140 చెల్లించి వాడుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. కాగా గత కొన్ని రోజుల వరకు గూగుల్‌ ప్లే స్టోర్‌, ఐఫోన్‌ ఐఓఎస్‌ యాప్‌ స్టోర్లలో అందుబాటులో ఉన్న ఈ ఛాట్‌డబ్ల్యూ యాప్‌, ఒక్కసారిగా రిపోర్టులు వాట్సప్‌ యూజర్లను అలర్ట్‌ చేయడంతో డిలీట్‌ చేసినట్టు తెలుస్తోంది.

డిలీట్ అయినప్పటికీ ..

డిలీట్ అయినప్పటికీ పలు వెబ్‌సైట్లలో దీని ఏపీకే అందుబాటులో ఉందని, దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకోవడానికి వీలుంటుందని, వాట్సప్‌ యూజర్లు జాగ్రత్తగా ఉండాలని రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. వాట్సప్‌లో ఛాట్‌లో ఉన్నప్పుడు మీ గురించి ఎవరైనా అన్ని వివరాలు తెలిసినట్టు చెబితే, అనుమానించాల్సి ఉందని, మీరు ఛాట్‌వాచ్‌లో బారిని పడినట్టు గుర్తించాలని రిపోర్టులు వార్నింగ్‌ ఇస్తున్నాయి.

ఏ సమయంలో..

ఏ సమయంలో మీ వాట్సప్‌ స్నేహితులు నిద్రపోతున్నారు, ఏ సమయంలో లేస్తున్నారు, ఏ సమయంలో ఛాటింగ్‌ చేస్తున్నారు, ఎవరితో ఎక్కువగా ఛాట్‌ చేస్తున్నారు వంటి వివరాలను ఈ యాప్‌ బహిర్గతం చేస్తోందని తెలుస్తోంది.

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ యాక్టివిటీ..

ఈ యాప్‌తో మీ స్నేహితుల, కుటుంబ సభ్యుల, ఉద్యోగుల వాట్సప్‌ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ యాక్టివిటీ ఇట్టే పట్టేయొచ్చట. అయితే వాట్సప్‌ యాప్‌ ఫుల్‌ ఎండ్‌టూఎండ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉందని, మూడో వ్యక్తులు వాట్సప్‌ యూజర్ల గోప్యతను దొంగలించడానికి కుదరదని ఓ వైపు కంపెనీ చెబుతోంది.

ఇలాంటి యాప్‌ల ద్వారా..

అయినప్పటికీ ఇలాంటి యాప్‌ల ద్వారా వాట్సప్‌ యూజర్ల వివరాలు బయటికి వస్తుండటం ఆందోళన కలిగిస్తోందని టెక్‌ వర్గాలంటున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp privacy at risk: Users chat activity can be tracked More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot