వాట్సప్ గ్రూపులోకి మరో కొత్త ఫీచర్ !

Written By:

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన యూజర్ల కోసం మరో అదిరిపోయే ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురానుంది. కాగా ఈ ఫీచర్ లీకయిట్లే లీకయి మళ్లీ మాయమైంది. గ్రూప్‌లలో ఉన్న యూజర్లు వ్యక్తిగతంగా చాటింగ్ చేసుకునేందుకు ఉపయోగపడే 'ప్రైవేట్ రిప్లై' ఫీచర్ ఇప్పటికే వాట్సప్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉండగా ఇకపై ఈ ఫీచర్ యూజర్లందరికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

Moto G5S Plus ధర తగ్గింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్సప్‌లో ఏదైనా గ్రూప్‌లో ఉన్న మరో యూజర్‌తో..

ఈ ఫీచర్ ద్వారా యూజర్లు వాట్సప్‌లో ఏదైనా గ్రూప్‌లో ఉన్న మరో యూజర్‌తో ప్రైవేట్‌గా చాటింగ్ చేయవచ్చు. అందుకు గ్రూప్‌ను వదిలి వెనక్కి రావల్సిన పనిలేదు.

యూజర్ పెట్టే మెసేజ్‌లపై హోల్డ్ చేసి..

గ్రూప్‌లో ఉండగానే యూజర్ పెట్టే మెసేజ్‌లపై హోల్డ్ చేసి పట్టుకుంటే వచ్చే మెనూలో ఉండే 'రిప్లై ఇన్ ప్రైవేట్' అనే ఆప్షన్‌ను ఎంచుకుంటే చాలు, గ్రూప్‌తో సంబంధం లేకుండా ఆ యూజర్‌తో ప్రైవేట్‌గా చాటింగ్ చేయవచ్చు.

వాట్సప్‌ బీటా ఆప్‌డేట్‌లో

అయితే వాట్సప్‌ బీటా ఆప్‌డేట్‌లో ఈ సదుపాయం కనిపించిన కాసేపటికే మాయమైందని బ్రిటన్‌ మీడియా తెలిపింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ అభివృద్ధి దశలోనే ఉందని, ఇతర ఫీచర్లతో కలిపి రిప్లై ప్రైవేట్లీని విడుదల చేస్తారని వెల్లడించింది.

డెవలపర్లు పొరపాటున

డెవలపర్లు పొరపాటున దీనిని యాక్టివేట్‌ చేసి ఉంటారని ఆ మీడియా అభిప్రాయపడింది. కాగా, మరికొన్ని రోజుల్లో ఈ కొత్త ఫీచర్‌ను తమ యూజర్లకు తెచ్చే పనిలో యాజమాన్యం బిజీగా ఉండగా ఓ యూజర్ మొబైల్‌లో పొరపాటున ఈ ఫీచర్ కనిపించడం గమనార్హం.

విండోస్ ఫోన్ 2.17.348 బీటా వెర్ష‌న్‌లో..

కాగా ఈ ఫీచర్ విండోస్ ఫోన్ 2.17.348 బీటా వెర్ష‌న్‌లో తాజాగా దర్శనమిచ్చిందని పలువురు యూజర్లు తెలియజేస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp Private Reply Feature for Groups Enabled by Mistake, Expected Soon: Report More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot