Home
Apps

Whatsapp Accounts Banned ఏప్రిల్‌ నెలలో 71 లక్షల వాట్సాప్‌ అకౌంట్లపై నిషేధం... ఎందుకో తెలుసా?

వాట్సాప్‌ తన వినియోగదారుల భద్రత, సౌకర్యం కోసం అనేక కొత్త ఫీచర్‌లను తీసుకొస్తోంది. ముఖ్యంగా భద్రత విషయంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా వాట్సా్ప్‌ కీలక నివేదికను విడుదల చేసింది. ఏప్రిల్‌ 2024 లో ఏకంగా 71 లక్షల అకౌంట్లపై నిషేధం విధించినట్లు తెలిపింది. భారత్‌ ఐటీ చట్టం 2021 నిబంధలను ఉల్లంఘించిన ఖాతాలపై చర్యలు తీసుకున్నట్లు తన నెలవారీ నివేదికలో వెల్లడించింది.

వాట్సాప్‌ యూజర్లు (Whatsapp) తన ఫిర్యాదులను మెయిల్‌ ద్వారా పంపవచ్చని పేర్కొంది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 30 వరకు గ్రీవెన్స్‌ విభాగానికి వివిధ అంశాలపై 10,554 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది. దీంతోపాటు రిపోర్టు ఫీచర్‌ ద్వారా వచ్చిన నివేదికలు సహా ఇతర పర్యవేక్షణ విభాగాల నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవాలని కోరింది.

whatsapp banned 71 lakh accounts in april 2024

ఏప్రిల్‌ నెలలో 7,182,000 భారతీయ వాట్సాప్‌ ఖాతాలను బ్యాన్‌ చేసినట్లు తెలిపింది. ఇందులో 1,302,000 ఖాతాలను యూజర్ల నుంచి ఎటువంటి ఫిర్యాదు లేకుండా ముందస్తుగా నిషేధం విధించినట్లు పేర్కొంది. ఆన్‌లైన్‌ భద్రత పర్యవేక్షణకు వాట్సాప్‌కు నిపుణులతో ప్రత్యేక వ్యవస్థ ఉంది.

యాప్‌లోనే యూజర్లు.. ఇతరుల ఖాతాలను బ్లాక్‌ చేయడం మరియు వాటిపై రిపోర్టు చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. వాట్సాప్‌ వినియోగదారుల ఫిర్యాదులు సహా ఇతర ఫీడ్‌బ్యాక్‌పై వెంటనే సాయం చేసేలా ప్రత్యక వ్యవస్థ ఉంటుంది. దీంతోపాటు సైబర్‌ సెక్యూరిటీ సహా నకిలీ వార్తల నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థలకు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

** దీంతోపాటు వాట్సాప్‌ యూజర్లకు మెరుగైన ఫీచర్‌లు, సౌకర్యాలు అందించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇటీవల వాట్సాప్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌లో మార్పులు చేసింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం వాట్సాప్‌ కాలింగ్ ఇంటర్‌ఫేస్‌లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌లో ఈ కొత్త అప్‌డేట్‌ అందుబాటులో ఉంది.

గతంలో కాలింగ్ సమయంలో బ్యాక్‌ బటన్‌ స్థానంలో మినిమైజ్‌ బటన్‌ను తీసుకొచ్చింది. అయితే తాజాగా తీసుకొస్తున్న అప్‌డేట్‌లో కాలింగ్‌ ఇంటర్‌ఫేస్‌లో మార్పులు చేశారు. కిందనున్న కాలింగ్ బార్‌లో మార్పులు చేశారు. ఈ అప్‌డేట్‌ ప్రస్తుతం కొంత మంది బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్‌ బీటా 2.24.12.14 వెర్షన్‌ ఈ అప్‌డేట్‌ను పొందవచ్చు.

వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ Wabetainfo ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్‌ చేసింది. దీని ఆధారంగా వాట్సాప్‌ కాలింగ్‌ బార్‌లో కింద భాగంలో కొన్ని మార్పులు చేశారు. గతం కంటే ప్రొఫైల్‌ ఫోటో పెద్దగా కనిపించనుంది. ప్రస్తుతం కొంత మంది బీటా టెస్టర్‌లకే ఈ అప్‌డేట్‌ అందుబాటులో ఉండగా.. త్వరలో మరింత మందికి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
whatsapp released april month report that banned more than 71 lakh indian accounts
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X