వాట్సాప్‌ వినియోగం పట్ల ఊరూరూ తిరుగుతూ ప్రచారం..

జియో ఫోన్‌లలో వాట్సాప్‌ను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే‌దాని పై ప్రజలకు అవగాహన కలిగించే ఉద్దేశ్యంతో వాట్సాప్ ఇంకా రిలయన్స్ జియోలు సంయుక్తంగా దేశవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టాయి.

|

జియో ఫోన్‌లలో వాట్సాప్‌ను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే‌దాని పై ప్రజలకు అవగాహన కలిగించే ఉద్దేశ్యంతో వాట్సాప్ ఇంకా రిలయన్స్ జియోలు సంయుక్తంగా దేశవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. అక్టోబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోన్న ఈ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్‌లో భాగంగా ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన సంచార రథాలు ఊరూరూ తిరుగుతూ జియో ఫోన్‌లలో వాట్సాప్‌ వినియోగం పట్ల అవగహన సదస్సులను నిర్వహిస్తాయి.

సిద్థంగా వీడియో ట్యుటోరియల్స్‌..

సిద్థంగా వీడియో ట్యుటోరియల్స్‌..

ఈ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా జియో ఫోన్‌లలోని వాట్సాప్ అప్లికేషన్‌ను ఉపయోగించుకుని ఆప్తులతో ఏ విధంగా కనెక్ట్ అవ్వొచ్చు. ఇదే సమయంలో నకిలీ వార్తలకు ఏ విధంగా దూరంగా ఉండాలి అనేదాని పై ఎక్స్‌పర్ట్స్ అవగాహన కలిగిస్తారు. ఇదే సమయంలో వాట్సాప్ పై అవగాహన కల్పించే విషయం పై, ఈ రెండు కంపెనీలు ప్రత్యేకమైన వీడియో ట్యుటోరియల్స్‌ను అభివృద్థి చేసాయి.

 

 

అన్‌లైన్ ఇంకా ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌లో లభ్యం..

అన్‌లైన్ ఇంకా ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌లో లభ్యం..

తెలుగు సహా 11 స్థానిక భాషల్లో అందుబాటులో ఉండే ఈ ట్యుటోరియల్స్ అన్‌లైన్ ఇంకా ఆఫ్‌లైన్‌ స్టోర్స్ ద్వారా యూజర్లు పొందవచ్చు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 2.5 కోట్ల జియో ఫోన్‌లను విక్రయించగలిగిన రిలయన్స్ జియో, వాట్సాప్ ఫీచర్‌ను యాడ్ చేయటం ద్వారా అమ్మకాల సంఖ్యను 2018 చివరి నాటికి 10 కోట్లకు పెంచాలని భావిస్తోంది.

 

 

అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉంటాయి..

అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉంటాయి..

జియో ఫోన్‌లలో వాట్సాప్ సేవలను పొందాలనుకునే యూజర్లు ముందుగా జియోఫోన్ యాప్‌స్టోర్‌లోకి వెళ్లటం ద్వారా వాట్సాప్ మెసెంజర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. జియోఫోన్స్ కోసం బిల్ట్ చేసిన వాట్సాప్ మెసెంజర్ అప్లికేషన్‌లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్స్ మాదిరిగానే అన్ని రకాల ఫీచర్లు అందుబాటులో ఉంటాయని వాట్సాప్ వైస్-ప్రెసిడెంట్ క్రిస్ డేనియల్స్ తెలిపారు.

 

 

కీప్యాడ్ ఆధారంగా..

కీప్యాడ్ ఆధారంగా..

ఈ యాప్ ద్వారా జియో ఫోన్ యూజర్లు టెక్స్ట్ మెసేజెస్, వీడియోస్ ఇంకా ఫోటోస్‌ను సెండ్ చేసుకోవటంతో పాటు రిసీవ్ చేసుకునే వీలుకూడా ఉంటుంది. కీప్యాడ్ పై కొన్ని సార్లు టాప్ చేయటం ద్వారా వాయిస్ మెసేజ్‌లను రికార్డ్ చేసుకుని వాటిని షేర్ చేసకునే వీలుంటుంది. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత జియోఫోన్ యూజర్లు తమ ఫోన్ నెంబర్‌ను వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ పూర్తయిన తరువాతనే వారు ఇతరు సభ్యులతో చాట్ చేసుకోగలుగుతారు.

Best Mobiles in India

English summary
WhatsApp and Reliance Jio launch campaign on how to use WhatsApp on Jio Phone.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X