వాట్సప్‌లో కొత్తగా రెండు ఫీచర్లు

మెసేజింగ్‌ మాధ్యమంలో విపరీతంగా దూసుకుపోతున్న వాట్సాప్‌, ఎప్పడికప్పుడు సరికొత్త ఫీచర్లతో అలరిస్తూ ఉంది.

|

మెసేజింగ్‌ మాధ్యమంలో విపరీతంగా దూసుకుపోతున్న వాట్సాప్‌, ఎప్పడికప్పుడు సరికొత్త ఫీచర్లతో అలరిస్తూ ఉంది. ఇప్పుడు మరో రెండు ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో ఒకటి వాట్సప్ గ్రూప్‌లో 'రిప్లై ప్రైవేట్‌లీ' కాగా మరొకటి స్టిక్కర్ ఫీచర్.

ఇండియన్లకు పిచ్చి పిచ్చిగా నచ్చిన మొబైల్ ఇదే !ఇండియన్లకు పిచ్చి పిచ్చిగా నచ్చిన మొబైల్ ఇదే !

గ్రూప్‌లో ఏ ఒక మెంబర్‌కైనా...

గ్రూప్‌లో ఏ ఒక మెంబర్‌కైనా...

గ్రూప్‌లో ఏ ఒక మెంబర్‌కైనా మీరు ప్రైవేట్‌గా రిప్లై ఇవ్వాలనుకుంటే ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. మీరు ఇచ్చే రిప్లై ఆ మెంబర్‌కు తప్ప ఇంకెవరికీ కనిపించదు.

'రిప్లై ప్రైవేట్‌లీ' ఫీచర్ ఉపయోగించాలంటే....

'రిప్లై ప్రైవేట్‌లీ' ఫీచర్ ఉపయోగించాలంటే....

'రిప్లై ప్రైవేట్‌లీ' ఫీచర్ ఉపయోగించాలంటే ముందు మీరు మీ వాట్సప్‌ని అప్‌డేట్ చేయాలి. గ్రూప్‌లో మీరు ఎవరికి రిప్లై ఇవ్వాలనుకుంటున్నారో ఆ మెసేజ్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత త్రీ డాట్స్ క్లిక్ చేస్తే అందులో ప్రైవేట్ రిప్లై ఆప్షన్ కనిపిస్తుంది. దాంట్లో మీరు రిప్లై ఇవ్వొచ్చు. 'రిప్లై ప్రైవేట్‌లీ' ఫీచర్ వాట్సప్ వర్షన్ 2.18.335 లోనే అందుబాటులో ఉంది.

స్టిక్కర్ ఫీచర్....

స్టిక్కర్ ఫీచర్....

వాట్సప్‌లో స్టిక్కర్ ఫీచర్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇకపై ఎమోజీలకు బదులు స్టిక్కర్లను మెసేజ్ రూపంలో పంపొచ్చు. వాట్సప్ అప్‌డేట్ చేసిన తర్వాత డిఫార్ట్‌గా కొన్ని స్టిక్కర్స్ కనిపిస్తాయి. అవి కాకుండా స్టిక్కర్ ప్యాక్స్ కూడా ఉంటాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

థర్డ్ పార్టీ స్టిక్కర్ ప్యాక్‌లను క్రియేట్ చేయవచ్చు..

థర్డ్ పార్టీ స్టిక్కర్ ప్యాక్‌లను క్రియేట్ చేయవచ్చు..

వాట్సాప్‌లో కొత్త యాడ్ అయిన స్టిక్కర్స్‌లో చాలా వరకు స్టిక్కర్స్ ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ఉన్నవే కావటం విశేషం. వాట్సాప్‌ను ఉద్దేశించి ఎవరైనా సరే థర్డ్ పార్టీ స్టిక్కర్ ప్యాక్‌లను క్రియేట్ చేయవచ్చని, వీటిని ఆయా యాప్ స్టోర్‌లలో ఉంచటం ద్వారా వాట్సాప్‌తో ఇంటిగ్రేట్ చేస్తామని సంస్థ తెలిపింది.

యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి...

యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి...

వాట్సాప్ స్టిక్కర్ ప్యాక్‌ను ఉపయోగించుకోవాలనుకునే యూజర్లు ముందుగా తమ డివైస్‌లోని యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి. యాప్ అప్‌డేట్ అయిన వెంటనే చాట్ విండోలో స్టిక్కర్ బటన్ కనిపిస్తుంది. ఈ బటన్ పై టాప్ చేసినట్లయితే అందుబాటులో ఉన్న అనేక స్టిక్కర్స్ మీకు కనిపిస్తాయి. వాటిలో నచ్చిన ప్యాక్‌లను డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.

స్టేటస్‌లో యాడ్స్..

స్టేటస్‌లో యాడ్స్..

ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ తన ప్లాట్‌ఫామ్‌ను కొత్తకొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేస్తోన్న విషయం తెలిసిందే. వాట్సాప్ లాంచ్ చేస్తోన్న కొత్త ఫీచర్లలో కొన్ని ఆకట్టుకునే విధంగా ఉంటుంటే మరికొన్ని మాత్రం నిరుత్సహా పరిచే విధంగా ఉంటున్నాయి. తాజాగా రివీల్ అయిన మరో రిపోర్ట్ ప్రకారం, వాట్సాప్ తన యూజర్లకు సంబంధించిన Statusలలో యాడ్‌లను ప్రదర్శించటం మొదలుపెట్టింది.

 

 

తొలత iOS వెర్షన్‌లో...

తొలత iOS వెర్షన్‌లో...

మొదటి నుంచి వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉన్న వాట్సాప్ తాజాగా ఇటువంటి నిర్ణయం తీసుకోవటం పట్ల విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. @WABetaInfo రివీల్ చేసి వివరాల ప్రకారం వాట్సాప్ తన iOS వెర్షన్‌లో యాడ్స్‌ను ఇంప్లిమెంట్ చేయబోతోంది. వాట్సాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన తరువాత నుంచి పరిణమాలు శరవేగంగా మారిపోతున్నాయి.

వాట్సాప్‌ను కొనుగోలు చేయకముందే..

వాట్సాప్‌ను కొనుగోలు చేయకముందే..

వాట్సాప్‌లో యాడ్స్‌ను ఇంప్లిమెంట్ చేసే విషయాన్ని సంస్థ సహ-వ్యవస్థాపకులైన జాన్ కౌమ్ ఇంకా బ్రెయిన్ ఆక్టన్‌లు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల కారణంగానే బ్రెయిన్ ఆక్టన్‌ వాట్సాప్ నుంచి బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా బ్రెయిన్ ఆక్టన్ స్పందిస్తూ వాట్సాప్‌ను కొనుగోలు చేయకముందు నుంచే ఈ మెసేజింగ్ యాప్‌లో యాడ్స్‌ను ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచన ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్‌కు ఉందని అన్నారు.

Best Mobiles in India

English summary
WhatsApp ‘reply private’ feature now available for Android beta.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X