Home
Apps

వాట్సాప్‌ అకౌంట్‌ లేకుండానే.. వాట్సాప్‌ యూజర్లతో చాటింగ్‌ చేయవచ్చు..!

Whatsapp Guest Chats : వాట్సాప్‌ అకౌంట్‌ లేకుండా కూడా వాట్సాప్‌ లో చాటింగ్‌ చేసే ఫీచర్‌ గురించి గతంలో ఫీచర్‌ ట్రాకర్‌ WABetainfo కీలక వివరాలను వెల్లడించింది. గెస్ట్‌ చాట్స్‌ పేరుతో ఈ ఫీచర్ విడుదల కానుందని తెలిపింది. అయితే తాజాగా ఈ ఫీచర్‌ గురించి మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి.

వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్ వివరాల ఆధారంగా Guest Chats ఫీచర్‌ ను వాట్సాప్‌ టెస్టింగ్‌ చేస్తోంది. ప్రస్తుతం కొంత మంది ఆండ్రాయిడ్, iOS బీటా టెస్టర్‌లకు ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. వాట్సాప్‌ అకౌంట్‌ లేకుండానే, లింక్‌ ద్వారా వాట్సాప్‌లో చాటింగ్‌ చేసేందుకు ఈ ఫీచర్‌ అనుమతిస్తుంది.

whatsapp testing guest chats feature

ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుంది :
వాట్సాప్ అకౌంట్‌ లేని వారికి లింక్‌ ద్వారా లింక్‌ పంపి, వారితో చాట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. Invite a Friend ఆప్షన్ ద్వారా లింక్‌ షేర్‌ చేయవచ్చు లేదా కాంటాక్ట్ లిస్ట్‌ నుంచి కూడా షేర్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. SMS లేదా ఇమెయిల్‌, ఇతర మెసేజింగ్ యాప్స్‌ ద్వారా లింక్‌ షేర్‌ చేయవచ్చు.

ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ :
వాట్సాప్‌ ఖాతాలు లేని వ్యక్తులు ఈ లింక్‌ పైన క్లిక్ చేసి ఫోన్ లేదా డెస్క్‌టాప్‌ ద్వారా చాటింగ్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ కూడా ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ను కలిగి ఉంటుంది. ఫలితంగా అన్ని చాట్స్‌ సురక్షితంగా ఉండనున్నాయి.

వాట్సా్ప్‌ లో గెస్ట్‌ చాట్స్‌ టాప్‌లోనే కనిపించనున్నాయి. అయితే ఈ ఫీచర్‌ ద్వారా కేవలం చాట్‌ చేసేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. గ్రూప్‌ చాట్‌, వీడియో కాల్స్‌, మీడియా షేరింగ్‌ వంటి ఆప్షన్‌లు ఉండవని తెలుస్తోంది. కేవలం 10 రోజుల వరకు మాత్రమే ఈ చాట్స్‌ ఉంటాయి. అనంతరం లింక్‌ ఇన్‌యాక్టివ్‌గా మారుతుంది.

ప్రస్తుతం వాట్సాప్‌ ఈ ఫీచర్‌ను టెస్టింగ్‌ చేస్తోంది. త్వరలో ఆండ్రాయిడ్‌, iOS యూజర్లకు అందుబాటులోకి రానుంది. అయితే కచ్చితంగా ఎప్పుడు విడుదల కానుందనే వివరాలు వెల్లడి కాలేదు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మెటాకు చెందిన మరో ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌ ఇటీవలే కీలక ప్రకటన చేసింది. యూజర్ల ప్రైవసీ కోసం తీసుకొచ్చిన ఎండ్ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సపోర్టును నిలిపివేస్తామని తెలిపింది. మే 8 వ తేదీ నుంచి కొత్త నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే ఇందుకు గల కారణాలను అధికారికంగా వెల్లడంచలేదు.

ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సపోర్టును నిలిపేసిన అనంతరం ఇన్‌స్టా యూజర్ల చాట్‌ను విశ్లేషించేందుకు మెటాకు అవకాశం లభిస్తుంది. ఈ ఫీచర్‌ తొలగింపుతో ప్రభావితమయ్యే యూజర్లు తమ డేటాను డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపింది.

అసభ్యకర కంటెంట్‌పై నిఘా పెట్టేందుకు ఈ ఫీచర్‌ను తొలగిస్తున్నట్లు తెలిస్తోంది. యూరోపియన్‌ యూనియన్‌ ప్రతిపాదించిన చాట్‌ కంట్రోల్‌ రెగ్యులేషన్‌, బ్రిటన్‌ తీసుకొచ్చిన ఆన్‌లైన్‌ సేఫ్టీ యాక్ట్ 2023 వంటి బిల్లులు చట్టాలుగా మారితే.. యూజర్ల ప్రైవేట్ చాట్‌పై నిఘా పెట్టేలా ఆదేశాలు చేసేందుకు ప్రభుత్వాలకు అధికారం ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
whatsapp reportedly testing guest chats feature for android and iOS beta users
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X