వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. వీడియో కాల్ సమయంలో మీరు ఎక్కడున్నారో గుర్తించే అవకాశం ఉండదు..!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం అనేక ఫీచర్ లను అందుబాటులోకి తీసుకొస్తోంది. దీంతోపాటు తన యూజర్ల భద్రత కోసం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంది. తాజాగా వాట్సాప్ వీడియో కాల్ (Whatsapp Filters Background) అనుభూతిని మరింత మెరుగుపరిచేందుకు కొత్త ఫీచర్ ను విడుదల చేసింది. వీడియో కాల్ సమయంలో ఫిల్టర్ లు, బ్యాగ్రౌండ్ లో మార్పులు చేసుకొనేందుకు అవకాశం కల్పించింది.
వాట్సాప్ ఈ ఫీచర్ ను ఎప్పటి నుంచే టెస్టింగ్ చేస్తోంది. తాజాగా యూజర్ల కోసం విడుదల చేసింది. మెటా వివరాల ఆధారంగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఫిల్టర్‌ల ద్వారా వీడియో కాల్ సమయంలో ఉల్లాసభరితమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. మరియు మెరుగైన అనుభూతిని పొందవచ్చు.

ప్రస్తుతం వాట్సాప్‌లో కూల్, వార్మ్, వైట్ మరియు బ్లాక్, ప్రిజం లైట్, వింటేజ్ టీవీ, లైట్, డ్రీమీ, ప్రొస్టెడ్ గ్లాస్, డ్యూయో టోన్ వంటి 10 ఫిల్టర్‌లు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు బ్యాగ్రౌండ్ థీమ్‌ను మార్చుకొనేందుకు అవకాశం ఉంది. ఈ ఆప్షన్‌తో మీ వ్యక్తిగత భద్రతను మెరుగుపరుచుకోవచ్చు.
వీడియో కాల్ సమయంలో కూడా యూజర్లు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారో ఇతరులకు తెలిసే అవకాశం లేకుండా జాగ్రతలు వహించవచ్చు. లివింగ్ రూం, ఆఫీస్, సన్‌సెట్, బీచ్, కేఫ్ వంటి సుమారు 10 బ్యాగ్రౌండ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. Low Light, టచ్ ఆఫ్ వంటి ఫీల్టర్ లను కలిగి ఉన్నాయి.
వాట్సాప్‌లో ఫిల్టర్, బ్యాగ్రౌండ్ ఫీచర్లు ప్రస్తుతం వినియోగించుకొనేందుకు అందుబాటులో ఉన్నాయి. వీడియో కాల్ సమయంలో.. స్క్రీన్‌లో Top Right లో ఈ ఆప్షన్‌ను గుర్తించవచ్చు. అందులో నుంచి మీకు కావాల్సిన ఫీచర్‌ను ఎంచుకోవచ్చు. అయితే ఈ ఫీచర్‌లు ప్రస్తుతం కొద్దిమందికి అందుబాటులో ఉన్నాయి. త్వరలో వినియోగదారులు అందరికీ అందుబాటులోకి రానున్నాయి.
ఇటీవల వచ్చిన నివేదిక ఆధారంగా వాట్సాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ తరహా ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ స్టేటస్‌లో ఇతరులను ట్యాగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఫలితంగా అవతలి వ్యక్తులకు కూడా నోటిఫికేషన్ వెళ్తుంది. దీంతో ట్యాగ్ చేసిన వ్యక్తులకు నేరుగా సమాచారం అందుతుంది. ఈ ఫీచర్ బీటా టెస్టర్ కోసం ఇటీవల విడుదల అయింది.
వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్‌లో ఫోటోలు, వీడియోలు అప్‌డేట్ చేస్తున్న సమయంలో క్యాప్చర్ బార్‌లో ఈ బటన్‌ను గుర్తించవచ్చు. స్టేటస్‌ను పోస్ట్ చేసే ముందు ఇతరులకు ట్యాగ్ చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ట్యాగ్ చేసిన యూజర్‌కు మాత్రమే మీ స్టేటస్ అప్‌డేట్ కనిపిస్తుంది.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








