Whatsapp లో కీలక భద్రతా ఫీచర్.. మీ వ్యక్తిగత చాట్‌లు ఇక మరింత భద్రం!
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక శాతం మంది వినియోగదారులను కలిగి ఉన్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ( Whatsapp ) గత కొన్ని నెలలుగా యూజర్ల భద్రత, సౌకర్యం కోసం కీలక ఫీచర్లను విడుదల చేస్తోంది. వినియోగదారుల సీక్రెట్ చాట్‌ల భద్రత కోసం చాట్ లాక్ ఫీచర్‌ను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ తాజాగా కీలక ఫీచర్‌ను విడుదల చేసింది.
భద్రత కోణంలో ఇదో కీలక ఫీచర్‌గా నిలవనుంది. వాట్సాప్ తాజాగా సీక్రెట్ కోడ్ ( Whatsapp Secreat Code Feature ) ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యక్తిగత చాట్‌లను ఇతరుల కంట పడకుండా ఉండేందుకు ఇప్పటికే చాట్ లాక్ ఫీచర్‌ను విడుదల చేసింది. అయితే వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి కింద డ్రాగ్ చేయడంతో చాట్ లాక్ చేసిన కాంట్రాక్టులు కనిపిస్తాయి.

అయితే తాజాగా వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చిన ఫీచర్ ద్వారా చాట్ లాక్‌కు సీక్రెట్ కోడ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఫలితంగా వ్యక్తిగత చాట్‌లు ఇతరులు యాక్సెస్ చేసే అవకాశం ఉండదు. సెర్చ్ బార్‌లో సీక్రెట్ కోడ్ నమోదుచేయడం ద్వారా సీక్రెట్ చాట్‌లను యాక్సెస్ చేయవచ్చు.
చాట్ లాక్ చేసిన చాట్‌లను యాక్సెస్ చేయాలంటే సెర్చ్ బార్‌లో సీక్రెట్ కోడ్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే చాట్ లాక్ చేసిన కాంటాక్ట్‌లు కనిపిస్తాయి. ఇతరులు ఎవరూ వాటిని యాక్సెస్ చేసే అవకాశం ఉండదు. వ్యక్తిగత చాట్‌లకు మెరుగైన భద్రతను కల్పిస్తుందని మెటా తెలిపింది.
వాట్సాప్ చాట్‌ను లాక్ చేయడానికి వ్యక్తిగత చాట్ సెట్టింగ్‌ల్లో మార్పులు చేయాల్సిన అవసరం లేదని సంస్థ తెలిపింది. చాట్‌ను లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా వ్యక్తిగత చాట్‌లను లాక్ చేయవచ్చని వాట్సాప్ తెలిపింది. సీక్రెట్ కోడ్ ఫీచర్ ప్రస్తుతం కొద్ది మందికే అందుబాటులో ఉందని, త్వరలోనే వినియోగదారులు అందరికీ చేరుతుందని తెలుస్తోంది.
వాట్సాప్ సీక్రెట్ కోడ్ ఫీచర్‌ను యాక్సెస్ చేసుకోవడం ఎలా..: చాట్ లాక్ చేసిన కాంటాక్ట్‌లను ప్రైవేటుగా ఉంచేందుకు వాట్సాప్ చాట్ జాబితాను తెరవాలి. ఎగువన ఉన్న మూడు చుక్కలపైన క్లిక్ చేయాలి. దీని తర్వాత చాట్ లాక్ సెట్టింగ్‌లకు వెళ్లి " Hide Locked Chats " ఆప్షన్‌ను ఆన్ చేయాల్సి ఉంటుంది. అనంతరం సీక్రెట్ కోడ్‌ను ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుంది.
లాక్ చేసిన చాట్‌లను ఓపెన్ చేసేందుకు సెర్చ్ బార్‌లో సీక్రెట్ కోడ్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే లాక్ చేసిన కాంటాక్ట్‌లు ఓపెన్ అవుతాయి. యాప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాటిని యాక్సెస్ చేసేందుకు మరోసారి సీక్రెట్ కోడ్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








