వాట్సాప్ డిజైన్‌లో కీలక మార్పులు.. అయితే వీరికి మాత్రమే..!
మెటాకు చెందిన పాపులర్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ (Whatsapp) తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు అనేక ఫీచర్లను తీసుకొస్తోంది. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. దీని ఆధారంగా వెబ్ వెర్షన్ నుంచి వాయిస్, వీడియో కాల్స్ చేసుకొనే విధంగా కొత్త అప్‌డేట్ ను త్వరలో తీసుకురానున్నారని తెలుస్తోంది.
దీంతోపాటు స్టేటస్ కోసం కస్టమ్ లిస్ట్ ను అందుబాటులోకి రానుందని వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ తెలిపింది. వాట్సా్ప్ సబ్‌స్క్రిప్షన్ వెర్షన్ కూడా త్వరలో అందుబాటులోకి వస్తుందని లీక్స్ వచ్చాయి. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉందని తెలుస్తోంది. ప్రస్తుత ఫ్రీ వెర్షన్ తో పోలిస్తే అనేక ప్రీమియం ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

లిక్విడ్ గ్లాస్ డిజైన్ :
వాట్సాప్ లిక్విడ్ గ్లాస్ డిజైన్ తో కూడిన కొత్త వెర్షన్ ను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. iOS 26 ప్రైవేశపెట్టిన ఈ డిజైన్.. ఆలస్యంగా బిజినెస్ యాప్ యూజర్లకు అందుబాటులోకి వస్తోంది. ప్రస్తుతం కొంత మంది వాట్సాప్ బిజినెస్ యాప్ యూజర్లకు ఈ కొత్త డిజైన్ అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేసింది. యాప్ లోని బటన్ లు లిక్విడ్ గ్లాస్ స్టైల్ కు అనుగుణంగా మార్చారు. హాఫ్ ట్రాన్స్‌పరెంట్ గ్లాస్ మాదిరిగా కనిపిస్తాయి. దీంతోపాటు ట్యా్బ్ బార్ లోనూ మార్పులు చేశారు.
దీంతోపాటు యాప్ లోని కాంటాక్ట్ మెనూ కూడా పారదర్శకంగా ఉంటుంది. ఇప్పటికే ఈ కొత్త ఇంటర్‌ఫేస్ గురించి అనేక మంది సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ డిజైన్ కొంత మందికే అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది, మిగిలిన యూజర్లకు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.
వాయిస్, వీడియో కాల్స్ :
వాట్సాప్ వెబ్ విండోస్, mac os వెర్షన్‌లలోనే వాయిస్, వీడియో కాల్స్ చేసేందుకు అవకాశం ఉంది. త్వరలో వెబ్ (బ్రౌజర్) వెర్షన్ లోనూ ఈ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయని ఇటీవలే వార్తలు వచ్చాయి. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి.
అయితే తొలి దశలో ఈ ఫీచర్ వ్యక్తిగత కాల్స్ కు మాత్రమే సపోర్టు చేస్తందని తెలుస్తోంది. గ్రూప్ కాలింగ్ కు సపోర్టుపై త్వరలో మరింత సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. ఈ కాల్స్ కు కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ (E2E) సౌకర్యం, స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ కూడా ఉంటుందని తెలుస్తోంది.
స్టేటస్ లో కస్టమ్ లిస్ట్ :
వాట్సాప్ స్టేటస్ ఫీచర్ లో త్వరలో కస్టమ్ లిస్ట్ క్రియేట్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. మీకు నచ్చిన పేర్లతో ఈ లిస్ట్ ను క్రియేట్ చేసుకోవచ్చని సమాచారం. అనంతరం మీకు కావాల్సినప్పుడు మార్చుకొనే వీలు కూడా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








