Whatsapp కొత్త ఫీచర్.. ఒకే యాప్‌లో వేర్వేరు అకౌంట్లు వినియోగించుకోవచ్చు..!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యలో యూజర్లు ఉన్నారు. వినియోగదారులు భద్రత, సౌకర్యం కోసం గత కొన్ని నెలలుగా అనేక రకాల ఫీచర్లను విడుదల చేస్తోంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను లాంచ్ చేస్తుంది. అయితే తాజాగా వాట్సాప్ యూజర్ల కోసం మల్టీ అకౌంట్ ఫీచర్‌ను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ఒకే వాట్సాప్ యాప్ ద్వారా వేర్వేరు వాట్సాప్ అకౌంట్లను వినియోగించుకోవచ్చు. ఈ ఫీచర్‌ను త్వరలో వినియోగదారులు అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని వాట్సాప్ సంస్థ వెల్లడించింది.

ప్రస్తుతం మల్టీ అకౌంట్ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందని వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo తెలిపింది. దీని ద్వారా ఒకే అప్లికేషన్ ద్వారా వేర్వేరు ఖాతాలను అనుసంధానం చేసుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఫోన్‌లో రెండు వాట్సాప్ ఖాతాలను వినియోగించాలంటే కచ్చితంగా క్లోన్ వాట్సాప్‌ను మాత్రమే వినియోగించాలి. అయితే ఆ విధానం కారణంగా కొన్ని భద్రతా సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు.
అయితే మల్టీ అకౌంట్ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే.. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత QR స్కాన్ ఫీచర్ పక్కనున్న యారో (బాణం) గుర్తుపై క్లిక్ చేయాలి. అనంతరం తమ అకౌంట్‌ను యాడ్ చేసుకోవచ్చు. అకౌంట్ యాడ్ చేసుకున్న తర్వాత సులభంగా వేర్వేరు ఖాతాలకు మారవచ్చు. ఈ విధానం ద్వారా ప్రైవేటు చాట్, ఇతర టాస్క్‌లను ఒకే యాప్ ద్వారా వినియోగించుకోవచ్చు.
ఈ ఫీచర్ ద్వారా రెండు ఫోన్లు లేదా, ఇతర యాప్‌ల అవసరం లేకుండా వేర్వేరు వాట్సాప్ ఖాతాలను అనుసంధానం చేసుకోవచ్చు. మరియు వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం అతికొద్ది ఆండ్రాయిడ్ బీటా టెస్టర్‌లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో అందరికీ అందుబాటులో వస్తుందని వాట్సాప్ సంస్థ తెలిపింది.
* వాట్సాప్ ద్వారా బస్ టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. రెడ్ బస్ చాట్‌బాట్ ద్వారా నేరుగా బస్ టికెట్లను బుక్ చేసుకొవచ్చు. వాట్సాప్‌లో నేరుగా ఇంటరాక్ట్ కావడం ద్వారా కస్టమర్ తమ బస్ టికెట్లను బుక్ చేసుకొనేలా చాట్‌బాట్ రూపొందించింది.
ఈ వాట్సాప్ చాట్‌బాట్.. బుకింగ్ ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా భవిష్యత్‌లో రియల్‌టైమ్ సహాయం కోసం కూడా ఈ ఫీచర్ పనిచేస్తుంది. ప్రస్తుతం రెడ్‌బస్ ఫీచర్ వాట్సాప్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మరో యాప్ లేదా వెబ్‌సైట్‌ను వినియోగించకుండానే నేరుగా వాట్సాప్ ద్వారానే టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చని రెడ్‌బస్ తెలిపింది.
వాట్సాప్ వినియోగదారులు నేరుగా రియల్‌టైమ్ బుకింగ్ నిర్దారణ, ఇ-టికెట్‌లను కూడా పొందుతారు. మరియు 24/7 కస్టమర్ సపోర్టును కూడా యాక్సెస్ చేయవచ్చు. ఇది సున్నితమైన, సంతోషకరమైన అనుభవాన్ని అందిస్తుందని రెడ్‌బస్ చెబుతోంది. ఇటీవల వాట్సాప్ వివిధ రకాల ఫీచర్లను విడుదల చేస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








