Home
Apps

Whatsapp మరో కీలక ఫీచర్‌.. సులభంగా గుర్తించేలా కొత్త ఐకాన్‌..!

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన వినియోగదారుల కోసం వాట్సాప్‌ అనేక ఫీచర్లను విడుదల చేస్తోంది. వినియోగదారుల భద్రత, సౌకర్యం కోసం ఇటీవల కాలంలో వరుసగా అప్‌డేట్లను విడుదల చేస్తోంది. వాట్సాప్‌ ఛానల్‌ ఫీచర్‌ను ఇప్పటికే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తుండగా.. వాట్సాప్‌ ఇంటర్‌చేంజ్‌లోనూ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ WABetainfo నివేదిక ప్రకారం.. వాట్సాప్‌ కమ్యూనిటీ గ్రూప్‌ చాట్‌ను సలభంగా గుర్తించే విధంగా కొత్త ఐకాన్‌ సహా నావిగేషన్‌ను మెరుగుపరుస్తున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఆండ్రాయిడ్‌ బీటా టెస్టర్‌ల కోసం ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది.

Whatsapp rolling out new icon for community group cha

వాట్సాప్‌లో నావిగేషన్‌, కమ్యూనిటీ గ్రూప్‌ చాట్‌ను సులభంగా నిర్వహించడం సహా ఉపయోగించే అవకాశం బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంది. ఈ కొత్త ఐకాన్‌తో గ్రూప్‌ చాట్‌లను సులభంగా గుర్తించవచ్చని వాట్సాప్‌ పీచర్‌ ట్రాకర్‌ చెబుతోంది. అయితే ఈ ఫీచర్‌ ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది. వినియోగదారులు అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వెల్లడి కాలేదు.

* వాట్సాప్‌ ఇటీవలే వాట్సాప్‌ ఛానల్‌ ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ తరహా ఫీచర్‌ ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్‌లు కలిగి ఉన్నాయి. ఈ ఫీచర్‌ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది. ఇప్పటికే చాలా మంది వినియోగదారులకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్‌ ఛానల్‌లో జాయిన్‌ అయ్యే వినియోగదారుల భద్రత కోసం వాట్సాప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వారి ఫోన్‌ నంబర్ల ఇతరులకు కనిపించకుండా చర్యలు తీసుకుంది.

భారత్ సహా 150 దేశాల్లో వాట్సాప్‌ ఛానల్‌ ఫీచర్‌ను అందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ ఫీచర్‌ ద్వారా డైరెక్టరీ నుంచి నచ్చిన ఛానల్‌ కోసం ఎంచుకోవచ్చని తెలిపింది. బిజినెస్‌, సెలబ్రిటీ, మెంబర్లు క్రియేట్‌ చేసిన ఛానల్‌లో చేరవచ్చని పేర్కొంది. ఇప్పటికే ఈ ఫీచర్‌ చాలా మందికి అందుబాటులోకి రాగా.. రానున్న కొన్ని రోజుల్లో ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి రానుంది.

మరిన్ని కొత్త ఫీచర్లు సహా ఇతర సమాచారం కోసం వాట్సాప్‌ వినియోగదారులు సంస్థ అధికారిక ఛానల్‌లో చేరవచ్చని తెలిపింది. వాట్సాప్‌ ఛానల్‌లో జాయిన్‌ అయ్యేందుకు సరైన లింక్‌ కలిగి ఉండాలని సంస్థ చెబుతోంది. వాట్సాప్‌ ఛానల్‌ ద్వారా పంపిన మెసెజ్‌లు కేవలం 30 రోజుల వరకు మాత్రమే ఉంటాయని సంస్థ తెలిపింది. అయితే ఈ మెసెజ్‌లు ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్క్రిప్షన్‌ను కలిగి ఉండవని తెలిపింది.

వాట్సాప్‌ ఛానల్‌ ఫీచర్‌ను మరింత ప్రాముఖ్యంలోకి తీసుకొచ్చేందుకు సంస్థ కీలక చర్యలు తీసుకుంటోంది. భారత క్రికెట్‌ జట్టు, దిల్జిత్‌ దోసాంజ్‌, నేహా కక్కర్, కత్రినా కైఫ్‌ వంటి ప్రముఖులతో ఇప్పటికే భాగస్వామ్యం కుదుర్చుకుంది. వాట్సాప్‌లో వినియోగదారులను అధిక సమయం ఎంగేజ్‌మెంట్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Whatsapp rolling out new icon for community group chat and navigation
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X