మీ జియోఫోన్‌లో WhatsApp అప్‌డేట్ పొందాలంటే..?

జియోఫోన్ యూజర్లకు మరో తీపి కబురును ఆ సంస్థ అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న య్యూట్యూబ్ అలానే వాట్సాప్ సర్వీసులు జియోఫోన్‌లలో యాడ్ కాబోతున్నాయి.

By GizBot Bureau
|

జియోఫోన్ యూజర్లకు మరో తీపి కబురును ఆ సంస్థ అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న య్యూట్యూబ్ అలానే వాట్సాప్ సర్వీసులు జియోఫోన్‌లలో యాడ్ కాబోతున్నాయి. ఇప్పటికే యూట్యూబ్ సేవలు జియోఫోన్‌లో యాడ్ అయ్యాయి. జియో యాప్ స్టోర్‌లోకి వెళ్లటం ద్వారా యూట్యూబ్ యాప్‌ను జియోఫోన్ యూజర్లు సొంతం చేసుకోవచ్చు.

బ్యాచెస్ క్రింద ఈ అప్‌డేట్ అందుబాటులో ఉంటుంది..

బ్యాచెస్ క్రింద ఈ అప్‌డేట్ అందుబాటులో ఉంటుంది..

ఇక వాట్సాప్ విషయానికి వచ్చేసరికి బ్యాచులు క్రింద ఈ అప్‌డేట్‌ను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఈ ప్రాసెస్ కూడా ఆగష్టు 15 నుంచే ప్రారంభమయ్యింది. కాబట్టి వాట్సాప్ సపోర్ట్ మీదాక రావాటానికి కొంత సమయం పట్టొచ్చు. ఈ కొత్త అప్‌డేట్‌లతో పాటు జియో ఫోన్ 2ను కూడా సంస్థ మార్కెట్లోకి తీసుకువచ్చింది. మొదటి జనరేషన్ జియో‌ఫోన్‌కు అప్‌డేటెడ్ వెర్షన్‌గా ఈ డివైస్ అందుబాటులో ఉంటుంది.

యూట్యూబ్ సర్వీసును పొందాలనుకునే యూజర్లు...

యూట్యూబ్ సర్వీసును పొందాలనుకునే యూజర్లు...

KaiOS పై రన్ అవుతోన్న జియోఫోన్స్ కోసం సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ ప్రత్యేకమైన గూగుల్ మ్యాప్స్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇదే సమయంలో ఫేస్‌బుక్ సేవలు కూడా జియో ఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చేసాయి. జియో ఫోన్‌లలో యూట్యూబ్ సర్వీసును పొందాలనుకునే యూజర్లు ముందుగా తమ డివైస్‌లోని జియో స్టోర్‌లోకి వెళ్లి సంబంధిత యాప్‌ను సెలక్ట్ చేుసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇదే విధంగా వాట్సాప్‌ను కూడా ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది.

 

 

వాయిస్ కమాండ్స్ ఆధారంగా ఆఫరేట్ చేసుకునే అవకాశం..
 

వాయిస్ కమాండ్స్ ఆధారంగా ఆఫరేట్ చేసుకునే అవకాశం..

ఈ రెండు యాప్‌లను వాయిస్ కమాండ్స్ ఆధారంగా కూడా ఆపరేట్ చేసుకునే వీలుంటుందని జియో చెబుతోంది. జియో ఫోన్ యూజర్లు వాట్సాప్ మెసేజ్‌లను టైప్ చేసే క్రమంలో టీ9 కీప్యాడ్‌ను వినియోగించుకోవల్సి ఉంటుంది. జియో ఫోన్ 2 మొదటి ఫ్లాష్ సేల్ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో రెండవ ఫ్లాష్ సేల్‌ను సంస్థ అనౌన్స్ చేసింది. ఆగష్టు 30న ఈ రెండవ సేల్ జరుగుతుంది. Jio.com వేదికగా మధ్యాహ్నం 12 గంటలకు ఈ సేల్ ప్రారంభమవుతుంది.

 

 

జియోఫోన్ 2 స్పెసిఫికేషన్స్..

జియోఫోన్ 2 స్పెసిఫికేషన్స్..

2.4 ఇంచ్ హారిజెంటల్ స్ర్కీన్ డిస్‌ప్లే, ఫుల్ క్వెర్టీ కీప్యాడ్ అండ్ ఫోర్-వే నేవిగేషన్ ప్యాడ్, kia మొబైల్ ఆపరేటింగ్ సిస్టం, స్నాప్‌డ్రాగన్ 205 లేదా స్ప్రెడ్‌ట్రమ్ SC9820 ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కేమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 

 

Best Mobiles in India

English summary
WhatsApp Rollout for Jio Phone to Start in Batches.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X