Home
Apps

వాట్సప్ వీడియో కాలింగ్ ఫీచర్‌లో భారీ మార్పులు, అప్‌డేట్ పొందడం ఎలా ?

దిగ్గజ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్లకు మరో తీపికబురును అందించింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వాట్సప్‌ గ్రూప్‌ వీడియో కాలింగ్‌ సౌలభ్యాన్ని అందుబాటులోకి వచ్చింది.

By Hazarath Aiah

దిగ్గజ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్లకు మరో తీపికబురును అందించింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వాట్సప్‌ గ్రూప్‌ వీడియో కాలింగ్‌ సౌలభ్యాన్ని అందుబాటులోకి వచ్చింది. కొత్తగా వచ్చిన ఈ ఈఫచర్ ద్వారా వాట్సప్‌లో ఒకరికంటే ఎక్కువమంది గ్రూప్‌ కాల్స్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ రెండు వెర్షన్లలోనూ ఈ ఫీచర్‌ను విడుదల చేసింది. ఇటీవల జరిగిన ఫేస్బుక్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో వాట్సాప్‌ వీడియో కాలింగ్‌ సదుపాయం ప్రవేశపెట్టబోతున్నట్లు ఫేస్‌బుక్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అది లైవ్ లోకి రావడంతో యూజర్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఒక గ్రూపులోని పలువురు సభ్యులు ..

ఒక గ్రూపులోని పలువురు సభ్యులు ..

కొత్తగా వచ్చిన ఫీచర్ ద్వారా ఒక గ్రూపులోని పలువురు సభ్యులు లేదా, ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు లేదా అంతకుమించి సభ్యులు ఈ ఫీచర్‌ ద్వారా వీడియో ద్వారా సంభాషించుకోవచ్చు.

వాట్సప్‌ బేటా 2.18.155

వాట్సప్‌ బేటా 2.18.155

ఆండ్రాయిడ్‌ ఆధారిత స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్‌ బేటా 2.18.155 వెర్షన్ వాడుతున్న ఎంపిక చేయబడిన కొంతమంది వినియోగదారులు వీడియో కాల్‌ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు.

వీడియో కాల్స్‌ ఆప్షన్‌ను ఎంచుకుని

వీడియో కాల్స్‌ ఆప్షన్‌ను ఎంచుకుని

ఐవోఎస్‌ ఆధారిత స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్‌ 2.18.52 వెర్షన్లో ఈ గ్రూప్ వీడియో కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు వాట్సప్‌ వెల్లడించింది. ఇందుకోసం యూజర్లు వీడియో కాల్స్‌ ఆప్షన్‌ను ఎంచుకుని, మాట్లాడాలనుకున్న వారితో హ్యాపీగా మాట్లాడుకోవచ్చు.

ఎంపిక చేసిన కొంతమంది యూజర్లకు మాత్రమే

ఎంపిక చేసిన కొంతమంది యూజర్లకు మాత్రమే

ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ ఎంపిక చేసిన కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుందని వాట్సప్‌ ఫ్యావరెట్‌ సైట్ WaBetaInfo నివేదించింది. అయితే త్వరలోనే ప్రతి వినియోగదారుడికి ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస‍్తుందని పేర్కొంది.

రిపోర్టులను పరిశీలించిన వాట్సప్

రిపోర్టులను పరిశీలించిన వాట్సప్

దీనికనుగుణంగానే చాలామంది వాట్సప్‌ యూజర్లు ఈ కొత్త గ్రూప్‌ వీడియో కాలింగ్‌ ఫీచర్‌ ఇంకా తమకు అందుబాటులోకి రాలేదని రిపోర్టు చేస్తున్నారు. ఈ రిపోర్టులను పరిశీలించిన వాట్సప్ కంపెనీ అందరికీ ఈ ఫీచర్ ను త్వరలో అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపినట్లు సమాచారం.

 

 

Best Mobiles in India

English summary
WhatsApp rolls out group calling feature for both Android and iOS users More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X