ఇండియాలో వాట్సప్ కొత్త రూల్స్ తెలుసుకోండి

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్‌ ఇండియాలోని యూజర్ల కోసం సరికొత్త రూల్స్ ని ప్రవేశపెట్టింది.

|

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్‌ ఇండియాలోని యూజర్ల కోసం సరికొత్త రూల్స్ ని ప్రవేశపెట్టింది.నకిలీ వార్తలను అరికట్టే ఉద్దేశంలో భాగంగా ఇండియన్ యూజర్స్‌పై కొత్తగా కొన్ని పరిమితులు విధించింది. నేటి నుంచి ఈ పరిమితులు అమలు చేస్తున్నట్లు వాట్సప్ వెల్లడించింది. దేశంలోని 20 కోట్ల మంది యూజర్లకు ఇవే పరిమితులు వర్తిస్తాయి. ఈ రూల్స్ ప్రకారం ఇక నుంచి ఫార్వర్డ్ మెసేజ్‌ను ఐదుగురి కంటే ఎక్కువ మందికి పంపించే అవకాశం ఉండదని స్పష్టంచేసింది.

రైల్వేలో లక్ష ఉద్యోగాలు,ఆన్‌లైన్ ద్వారా పరీక్ష, దేశంలోనే తొలిసారి !రైల్వేలో లక్ష ఉద్యోగాలు,ఆన్‌లైన్ ద్వారా పరీక్ష, దేశంలోనే తొలిసారి !

ఐదు చాట్ల పరిమితిని..

ఐదు చాట్ల పరిమితిని..

గత నెలలోనే ఈ ఐదు చాట్ల పరిమితిని ప్రారంభించబోతున్నట్లు వాట్సప్ ప్రకటించిన విషయం తెలిసిందే. వాట్సప్ లేటెస్ట్ వర్షన్ వాడే యూజర్లకు ఈ వారం నుంచే కొత్త పరిమితులు ప్రారంభమైనట్లు ఓ ప్రకటనలో కంపెనీ తెలిపింది.

నకిలీ వార్తలను ఎలా గుర్తించాలి..

నకిలీ వార్తలను ఎలా గుర్తించాలి..

నకిలీ వార్తలను ఎలా గుర్తించాలి, వాటిని ఎలా నియంత్రించాలన్నదానిపై యూజర్లకు అవగాహన కలిగించేందుకు ఓ కొత్త వీడియోను కూడా పబ్లిష్ చేసింది.

 

మెసేజ్‌లకు ఫార్వర్డ్ లేబుల్..

మెసేజ్‌లకు ఫార్వర్డ్ లేబుల్..

మెసేజ్‌లకు ఫార్వర్డ్ లేబుల్ ఉండటంతోపాటు ఒరిజినల్ మెసేజ్‌ను ఎవరు సృష్టించారో తెలియని సందర్భాల్లో ఒకటికి రెండుసార్లు నిజానిజాలను చెక్ చేసుకోవాలని చెప్పేలా ఓ సందేశాత్మక వీడియోను విడుదల చేసినట్లు కూడా సంస్థ చెప్పింది.

ప్రపంచవ్యాప్తంగా గరిష్ఠంగా 20 మందికి

ప్రపంచవ్యాప్తంగా గరిష్ఠంగా 20 మందికి

ప్రపంచవ్యాప్తంగా ఫార్వర్డ్ మెసేజ్‌లను గరిష్ఠంగా 20 మందికి పంపించుకునేలా వాట్సప్ అవకాశం కల్పించింది. దీనిని ఇండియాలో మాత్రం ఐదుగురికే పరిమితం చేసింది.

ప్రైవేట్ మెసేజింగ్ యాప్‌

ప్రైవేట్ మెసేజింగ్ యాప్‌

వాట్సప్ ప్రైవేట్ మెసేజింగ్ యాప్‌గా ప్రజల ముందుకు వచ్చిందని, ఈ మార్పులు ద్వారా దానిని అలాగే ఉంచాలన్నదే తమ ఉద్దేశమని కంపెనీ స్పష్టంచేసింది.

పిక్చర్ ఇన్ పిక్చర్ వీడియో

పిక్చర్ ఇన్ పిక్చర్ వీడియో

దీంతో పాటు మరో కొత్త ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. పిక్చర్ ఇన్ పిక్చర్ వీడియో పేరిట తొలుత ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై ఈ ఫీచర్ లభ్యం కానుంది.

వాట్సప్‌లో వచ్చే ఇన్‌స్టాగ్రాం,యూట్యూబ్ వీడియోలను..

వాట్సప్‌లో వచ్చే ఇన్‌స్టాగ్రాం,యూట్యూబ్ వీడియోలను..

ఈ ఫీచర్ వల్ల యూజర్లు తమకు వాట్సప్‌లో వచ్చే ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్ వీడియోలను వాట్సప్ యాప్ క్లోజ్ చేయకుండానే అదే స్క్రీన్‌లో చిన్న విండోలో ఆ వీడియోలను చూడవచ్చు.

ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై

ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై

కాగా ఇప్పటికే ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై వాట్సప్ బీటా వెర్షన్‌ను వాడుతున్న యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలోనే పూర్తి స్థాయిలో ఇతర యూజర్లకు ఈ ఫీచర్ లభిస్తుంది.

Best Mobiles in India

English summary
WhatsApp Rolls Out Message Forwarding Restrictions For Users In India more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X