వాట్సాప్ అదిరిపోయే అప్‌డేట్.. ఇకపై నంబర్ సేవ్ చేయకుండానే కాల్ చేయొచ్చు..
WhatsApp Call Dialer: వాట్సాప్ పేరు తెలియని మొబైల్ యూజర్ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునే వాట్సాప్, ఇప్పుడు మరో అదిరిపోయే అప్‌డేట్‌తో మీ ముందుకు వచ్చింది. iOS యూజర్ల కోసం వాట్సాప్ కొత్తగా ఫోన్ కాల్ డయలర్ ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ అప్‌డేట్ ద్వారా ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లు మరింత సులభంగా కాల్స్ చేయవచ్చు. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఫోన్ కాంటాక్ట్స్‌లో లేని నంబర్లకు కూడా ఈజీగా కాల్ చేయొచ్చు.
* కాల్స్ ట్యాబ్‌లో కొత్త డయలర్.. మూడు ఆప్షన్స్
వాట్సాప్ కొత్త అప్‌డేట్‌లో భాగంగా కాల్స్ ట్యాబ్‌లో సెకండరీ వ్యూను యాడ్ చేసింది. ఇందులో మూడు ముఖ్యమైన షార్ట్‌కట్స్ ఉన్నాయి. మొదటిది కొత్త కాల్ చేయడానికి, రెండవది కాల్ లింక్ క్రియేట్ చేయడానికి, మూడవది ఫోన్ నంబర్‌ను మాన్యువల్‌గా ఎంటర్ చేయడానికి. ఈ మూడో ఆప్షనే ఈ అప్‌డేట్‌కు హైలైట్.

దీని ద్వారా మీరు కాంటాక్ట్స్‌లో సేవ్ చేయని నంబర్‌కు కూడా డైరెక్ట్‌గా కాల్ చేయవచ్చు. కొత్తగా ఎవరికైనా కాల్ చేయాలంటే, వారి నంబర్ మీ కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాల్స్ ట్యాబ్‌లో ఉన్న "కాల్ ఏ నంబర్" ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీరు కాల్ చేయాలనుకుంటున్న నంబర్‌ను ఎంటర్ చేయాలి.
మీరు నంబర్ ఎంటర్ చేసిన తర్వాత, వాట్సాప్ ఆ నంబర్ వాట్సాప్‌లో ఉందో లేదో చెక్ చేస్తుంది. ఆ నంబర్ వాట్సాప్‌లో ఉంటే, వెంటనే మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఒకవేళ అది వెరిఫైడ్ బిజినెస్ అకౌంట్ అయితే, వెరిఫికేషన్ బ్యాడ్జ్ కూడా కనిపిస్తుంది.
* సేవ్ చేయకుండానే కాల్.. ఇంకా చాలా ఆప్షన్స్
ఈ ఫీచర్ ద్వారా మీరు నంబర్ సేవ్ చేయకుండానే వాట్సాప్ కాల్ చేయొచ్చు. అంతేకాదు, మీరు కాల్ చేయాలనుకున్న నంబర్ వాట్సాప్‌లో ఉంటే, ఆ నంబర్‌ను కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్‌గా చాట్ చేయడం కూడా స్టార్ట్ చేయొచ్చు. ఈ ఫీచర్ వాట్సాప్ యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
* ఎలా వాడాలి
వాట్సాప్ iOS యూజర్లు కాల్స్ ట్యాబ్‌లో '+’ గుర్తుపై నొక్కితే, 'డయల్ నంబర్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని ద్వారా నేరుగా ఫోన్ నంబర్ ఎంటర్ చేసి, వాట్సాప్‌లో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ నంబర్ వాట్సాప్‌లో ఉంటే, కాల్ చేయొచ్చు లేదా చాట్ స్టార్ట్ చేయొచ్చు.
అంతేకాదు, ఆ నంబర్ వెరిఫైడ్ బిజినెస్ అకౌంట్ అయితే, అది కూడా చూపిస్తుంది. ఈ ఫీచర్ వాడాలంటే, వాట్సాప్ యాప్ లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవడం మర్చిపోవద్దు.
* త్వరలో అందరికీ అందుబాటులోకి
వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను దశలవారీగా విడుదల చేస్తోంది. ఒకవేళ మీకు ఇంకా ఈ ఫీచర్ కనిపించకపోతే, కొన్ని వారాల్లో మీ వాట్సాప్‌లో కూడా అందుబాటులోకి వస్తుంది. ఈ ఫీచర్ మీకు వెంటనే రావాలంటే, మీ వాట్సాప్‌ను యాప్ స్టోర్ లేదా టెస్ట్‌ఫ్లైట్ ద్వారా అప్‌డేట్ చేసుకోండి.
* వాట్సాప్ యూజర్ల కోసం మరింత ఈజీ కమ్యూనికేషన్
వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తూ, యూజర్లకు మరింత ఈజీగా కమ్యూనికేట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కొత్త డయలర్ ఫీచర్ ద్వారా, మీ ఫోన్ కాంటాక్ట్స్‌లో ఉన్నవాళ్లకైనా, లేనివాళ్లకైనా సులభంగా కాల్ చేయొచ్చు. ఇకపై వాట్సాప్ కాలింగ్ మరింత సులువు కానుంది.
ప్రముఖ వాట్సాప్ ట్రాకర్ వాట్సాప్ బీటా ఇన్ఫో (Wabetainfo) ఈ కొత్త డయలర్ ఎలా పని చేస్తుందో చూపించే ఒక స్క్రీన్ షాట్ షేర్ చేసి చెసింది, వాట్సాప్ నుంచి వచ్చే మరిన్ని అప్‌డేట్స్ గురించి తెలుసుకోవడానికి గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ తరచూ చెక్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications








