Home
Apps

వాట్సప్‌లో కొత్తగా వచ్చిన 'PiP' ఫీచర్ ఎలా పని చేస్తుందంటే...?

మెసేజింగ్‌ మాధ్యమంలో విపరీతంగా దూసుకుపోతున్న వాట్సాప్‌, ఎప్పడికప్పుడు సరికొత్త ఫీచర్లతో అలరిస్తూ ఉంది.

మెసేజింగ్‌ మాధ్యమంలో విపరీతంగా దూసుకుపోతున్న వాట్సాప్‌, ఎప్పడికప్పుడు సరికొత్త ఫీచర్లతో అలరిస్తూ ఉంది.తాజాగా వాట్సాప్ PiP అనే కొత్ ఫీచర్ ను ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది.అక్టోబర్‌లోనే ఆండ్రాయిడ్ బీటా వర్షన్ విడుదల చేసింది వాట్సప్ . గూగుల్ ప్లేస్టోర్‌లో 2.18.280 వాట్సాప్ అప్‌డేట్ చేసుకున్నవాళ్లు ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు.ఈ PiP ఫీచర్ ఇప్పటికే iOS లో అందుబాటులో ఉంది ఇప్పుడు లేటెస్ట్ గా ఆండ్రాయిడ్ యూజర్ల కోసం విడుదల చేసింది.

 PiP ఫీచర్ అంటే  ఏంటి ?

PiP ఫీచర్ అంటే ఏంటి ?

ఇప్పటివరకు మీకు వాట్సప్‌లో వచ్చిన వీడియో లింక్స్ క్లిక్ చేస్తే వేరే విండోలో ప్లే అయ్యేవి. ఇకపై మరో యాప్‌కి రీడైరెక్ట్ కాకుండా వాట్సప్‌లోనే ఆ వీడియోలు ప్లే అవుతాయి. థర్డ్ పార్టీ యాప్స్ అయిన యూట్యూబ్, ఫేస్‌బుక్, టంబ్లర్ లాంటి వీడియో లింక్స్ అన్నీ ఇక వాట్సప్‌లో ప్లే చేసుకోవచ్చు. మొదట హాఫ్ విండోలో ఓపెన్ అయ్యే వీడియోను ఫుల్ స్క్రీన్‌లోనూ చూడొచ్చు.

ఈ PiP ఫీచర్ ఎలా పని చేస్తుందంటే..?

ఈ PiP ఫీచర్ ఎలా పని చేస్తుందంటే..?

- ఒక్కసారి వాట్సాప్ అప్ డేట్ చేశాక యూట్యూబ్ లేదా ఇన్‌స్టా‌గ్రామ్‌ యొక్క వీడియో లింక్ ను మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి

- పంపిన వీడియో లింక్ యొక్క ప్లే బటన్ ను నొక్కండి ,ఆ వీడియో యాప్ లోనే ప్లే అవుతుంది. 1

- వీడియో ప్లే చేయబడుతున్నప్పుడు మెసేజెస్ ద్వారా చాటింగ్ మరియు స్క్రోలింగ్ కొనసాగించవచ్చు.

- మీరు చాట్ బాక్స్ చుట్టూ వీడియో స్క్రీన్ కూడా మూవ్ చేయవచ్చు ,మరియు వీడియోను పూర్తి స్క్రీన్ లో చూడటానికి మ్యాక్సీమైజ్ చేసుకోవచ్చు .
- PiP చాట్ బాక్స్ లోపల మాత్రమే ఉంటుంది మరియు మీరు వేరొక మెనూకు వెళ్ళినప్పుడు అదృశ్యం అవుతుంది.

 

వీడియో కాల్స్ కోసం..

వీడియో కాల్స్ కోసం..

వీడియో కాల్స్ కోసం వాట్సాప్ PiP మోడ్ ను కలిగి ఉంది. ఇక్కడ, వినియోగదారులు వాట్సాప్ పై వీడియో కాల్ స్క్రీన్ ను షింక్ చేయవచ్చు .వినియోగదారులు వీడియో కాల్ లో ఉండగా వాట్సాప్ మరియు ఇతర యాప్లను ఉపయోగించడం కొనసాగించవచ్చు. ఈ ఫీచర్ Android మరియు iOS వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
WhatsApp rolls out Picture-in-Picture for Android: Here’s how it works.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X