వాట్సప్ నుంచి “రిస్ట్రిక్ట్ గ్రూప్” ఫీచర్

వాట్సప్ లో అనేక గ్రూప్స్ ఉన్నా, గ్రూప్ అడ్మిన్స్ కు ప్రత్యేకమైన ఫీచర్లు కలిగిలేని కారణంగా, ఎన్నో సమస్యలను చూడవలసిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి.

|

వాట్సప్ లో అనేక గ్రూప్స్ ఉన్నా, గ్రూప్ అడ్మిన్స్ కు ప్రత్యేకమైన ఫీచర్లు కలిగిలేని కారణంగా, ఎన్నో సమస్యలను చూడవలసిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. తద్వారా గ్రూప్ లోని సభ్యులలో ఏ ఒక్కరు అనైతిక చర్యలకు పాల్పడినా అడ్మిన్లు సమస్యలను ఎదుర్కోవడం సర్వసాధారణమైపోయింది. తద్వారా గ్రూప్ విలువలు దెబ్బతినడమే కాకుండా, కొన్ని పోస్టులు గ్రూప్ నడుపడానికి కారణమైన ఆలోచన కూడా పక్కదారి పట్టిస్తున్నాయి. ఫేస్బుక్ స్వాధీనంలో ఉన్న వాట్సాప్ ఇప్పుడు సరికొత్తగా IOS, ఆండ్రాయిడ్ మరియు విండోస్ ఫోన్ వినియోగదారులకు "రిస్ట్రిక్ట్ గ్రూప్" ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. తద్వారా గ్రూప్ అడ్మిన్స్ కు, గ్రూప్ మెంబర్స్ పోస్ట్ చేసే పిక్చర్స్, వీడియోస్, GIFs, డాక్యుమెంట్స్, వాయిస్ మెసేజెస్ మొదలైన మీడియాను అవసరమైతే అడ్డుకునే వీలును కల్పించింది.

 
Restrict Group feature

వాట్సాప్ ఫీచర్లను ఎప్పటికప్పుడు అన్నిటికన్నా ముందుగా టెస్ట్ చేసే ప్రముఖ వెబ్సైట్ WABetaInfo ప్రకారం, 2.18.132 అప్డేట్ లేదా ఆపైన వర్షన్ కలిగిన వాట్సాప్ అప్డేట్ కలిగిన వారికి ఈ ఫీచర్ను రిమోట్లీగా నేరుగా అందివ్వబడుతుంది. అనగా మీకు మొదట్లో ఈ ఫీచర్ కనపడకపోయినా, ఈ వర్షన్ కలిగి ఉన్నవారు ఎదో ఒక సమయంలో ఈ ఫీచర్ను చూడగలరు. నిజానికి ఈ "రిస్ట్రిక్ట్ గ్రూప్" ఫీచర్ మొదట్లో గత డిసెంబర్ లో గ్రూప్ "ప్రైవసీ సెట్టింగ్స్" లో కనపడింది. కానీ తర్వాతి కాలంలో కనుమరుగై, ఇప్పుడు మళ్ళీ దర్శనమిచ్చింది.

 

జియో మరో అద్భుతం, ప్రపంచపు తొలి ఏఐ ఫీచర్, స్టార్ట్స్‌తో వీడియో కాల్ !జియో మరో అద్భుతం, ప్రపంచపు తొలి ఏఐ ఫీచర్, స్టార్ట్స్‌తో వీడియో కాల్ !

గ్రూప్ లో ఉన్న అందరు సభ్యులకు గ్రూప్ వివరణను, ఐకాన్ ను మార్చుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు కేవలం అడ్మినిస్ట్రేటర్ మాత్రమే అధికారాన్ని కలిగి ఉండేలా కూడా అమర్పులు చేసే వీలు కల్పించింది. ఒకరకంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. తద్వారా గ్రూప్ లో అడ్మిన్స్ కాకుండా ఇతర సభ్యులు, గ్రూప్ ఐకాన్ మరియు వివరణను మార్చుటకు సాధ్యపడదు.

గ్రూప్ అడ్మిన్ సెట్టింగ్స్ లో ఈ అమర్పులను చూడవచ్చు. మరియు ఈ సెట్టింగ్స్ కూడా అడ్మిన్స్ కు మాత్రమే కనపడుతుంది. ఈ అడ్మిన్ సెట్టింగ్స్ లో, అడ్మినిస్ట్రేటర్ కు గ్రూప్ వివరణను ఎవరెవరు మార్పులు చేయవచ్చో నిర్ణయించే వెసులుబాటు ఉంటుంది. అడ్మిన్స్ కు ప్రత్యేకంగా ఈ అధికారాలు మాత్రమే కాకుండా, గ్రూప్ సభ్యుల పోస్టులను అనివార్య పరిస్థితుల్లో నియంత్రించే వెసులుబాటు కూడా కల్పించబడుతుంది.

వివరణ మార్పులు చేయకుండా మీరు రిస్ట్రిక్ట్ చేసిన నేపద్యంలో, గ్రూప్ సభ్యులందరికీ ఆ విషయం కూడా తెలియజేయబడుతుంది. ఏదేని కారణం చేత వేరే సభ్యుడికి వివరణ అమర్పులు చేసే సౌకర్యం కలిగించాలంటే, ఖచ్చితంగా అడ్మిన్ రైట్స్ ఇవ్వవలసి ఉంటుంది. త్వరలో గ్రూప్ లోని ఇతర సభ్యులకు కూడా మీడియా పరమైన పరిమితులను విధించే వెసులుబాటు అడ్మిన్స్ కు రానుందని తెలుస్తుంది.తద్వారా గ్రూప్ సభ్యులు "మెసేజ్ అడ్మిన్" బట్టన్ పై క్లిక్ చేసి పోస్ట్ చేయడం జరుగుతుంది, మరియు గ్రూప్ కి షేర్ చేసే మీడియా అడ్మిన్ చేత అనుమతి పొందిన తర్వాతనే పోస్ట్ చేయబడుతుంది.

Restrict Group feature

క్వాలిటీ దెబ్బతినకుండా PDF Filesను కంప్రెస్ చేయటం ఎలా..?క్వాలిటీ దెబ్బతినకుండా PDF Filesను కంప్రెస్ చేయటం ఎలా..?

ఈ ఫీచర్స్ లేని కారణంగా గ్రూప్ లోని ఒకరిద్దరు చేసే కొన్ని అనాలోచిత చర్యలకు అడ్మిన్స్ బలవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా ఈ ఫీచర్లు కల్పించి వాట్సాప్ మంచి నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. గత అక్టోబర్ లో వచ్చిన కొన్ని నివేదికల ప్రకారం, గ్రూప్ వివరణలు, ఐకాన్ మార్పులను గ్రూప్ సభ్యుల నుండి తొలగించే అవకాశo గ్రూప్ అడ్మిన్ లకు లభించనుందని పేర్కొన్నాయి. ఆ వెసులుబాటు ఇన్నిరోజులకు అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ 50 పైన భాషలలో, 1.5 బిలియన్ క్రియాశీల వినియోగదారులను కలిగి ఉంది. మరియు 10 కి పైన భారతీయ భాషలను కూడా సపోర్ట్ చేస్తుంది.

Best Mobiles in India

English summary
WhatsApp rolls out "Restrict Group" feature, gives admins extra power in group chats More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X