ఫేక్ న్యూస్‌ పై వాట్సాప్‌కు ఫిర్యాదు చేయటం ఎలా..?

వాట్సాప్‌లో వైరల్ అవుతోన్న ఫేక్ న్యూస్‌ను అరికట్టే క్రమంలో ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్, కేంద్ర ప్రభుత్వంతో కలిసి ముందుకు నడుస్తోంది.

|

వాట్సాప్‌లో వైరల్ అవుతోన్న ఫేక్ న్యూస్‌ను అరికట్టే క్రమంలో ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్, కేంద్ర ప్రభుత్వంతో కలిసి ముందుకు నడుస్తోంది. ఈ వ్యవహారం పై ఇటీవల చోటుచేసకున్న వాడివేడి పరిణామాల నేపథ్యంలో ఫేస్‌బుక్ నేతృత్వంలోని ఫేస్‌బుక్, భారత్‌లో ఫీర్యాదులు స్వీకరించేందుకుగాను ఓ స్పెషల్ గ్రీవియన్స్ అధికారిని నియమించింది.

 

కోమల్ లాహిరికి గ్రివియన్స్ సెల్ బాధ్యతలు.

కోమల్ లాహిరికి గ్రివియన్స్ సెల్ బాధ్యతలు.

వాట్సాప్ ఇంక్ గ్లోబల్ కస్టమర్ ఆపరేషన్స్ అండ్ లోకలైజేషన్ విభాగానికి సీనియర్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్న కోమల్ లాహిరికి గ్రీవియన్స్ సెల్ బాధ్యతలను వాట్సాప్ అప్పగించింది. వాట్సాప్ ఏర్పాటు చేసిన రస్పెషల్ గ్రివియన్స్ సెల్ ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

ఫిర్యాదు పత్రం పై ఆ వివరాలు తప్పనిసరి..

ఫిర్యాదు పత్రం పై ఆ వివరాలు తప్పనిసరి..

ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేస్తోన్న వాట్సాప్ అకౌంట్ గురించి వాట్సాప్‌కు ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్లయితే యాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా గ్రివియన్స్ ఆఫీసుకు కాంటాక్ట్ చేయవచ్చని వాట్సాప్ చెబుతోంది. వాట్సాప్ FAQ పేజీలో పోస్ట్ చేసిన వివరాల ప్రకారం వాట్సాప్ గ్రీవియన్స్ అధికారికి ఫిర్యాదు చేసే క్రమంలో ఫిర్యాదు పత్రం పై కంప్లెయిట్ చేస్తున్న వారి డిజిటల్ సంతకం, ఫోన్ నెంబర్ (ఇంటర్నెషనల్ ఫార్మాట్‌లో), కంట్రీ కోడ్ తప్పనిసరిగా ఉండాలి.

యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు..
 

యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు..

వాట్సాప్ యూజర్లు ఫేక్ న్యూస్‌కు సంబంధించిన కంప్లెయింట్‌లను యాప్ ద్వారా చేయవచ్చు. ఇలా చేసేందుకు యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Help ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. తరువాత ఓపెన్ అయ్యే మెనూలో Contact Usను సెలక్ట్ చేసుకుని ఫిర్యాదును టెక్స్ట్ ఇంకా స్ర్ర్కీన్ షాట్స్ రూపంలో పంపవచ్చు.వాట్సాప్ గ్రివియన్స్ అధికారికి పంపాలనుకుంటోన్న ఫిర్యాదులను లిఖితపూర్వకంగా కూడా రాసి పంపొచ్చు. వీటిని కాలిఫోర్నియా, మెన్లో పార్కులోని వాట్సాప్ ప్రధాన కార్యాలయ అడ్రస్‌కు పంపాల్సి ఉంటుంది.

మెన్లో పార్క్ ఆఫీసు నుంచే స్పందిస్తారు..

మెన్లో పార్క్ ఆఫీసు నుంచే స్పందిస్తారు..

భారత్ నుంచి వచ్చే ఫిర్యాదులను కోమల్ లాహిరి మెన్లో పార్క్ ఆఫీసు నుంచే చూసుకుంటారని వాట్సాప్ స్పష్టం చేసింది. కోమల్ లాహిరి లింకిడిన ప్రొఫైల్ ప్రకారం ఆమె గతంలో ఫేస్‌బుక్, పేపాల్ వంటి దిగ్గజ కంపెనీల్లో పని చేసారు. వాట్సాప్‌లో గడిచిన ఏడు నెలల నుంచి ఆమె విధులు నిర్వహిస్తున్నారు.

మరింత సిరీయస్‌గా తీసుకున్న ప్రభుత్వం..

మరింత సిరీయస్‌గా తీసుకున్న ప్రభుత్వం..

వాట్సాప్ మాద్యమం ద్వారా పెరిగిపోతున్న నకిలీ వార్తల వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం మరింత సిరీయస్‌గా తీసుకుంది. ఈ రకమైన వదంతులు ఎవరి నుంచి పుట్టుకొస్తున్నాయో ట్రాక్ చేయలంటూ ఐటీశాఖా మంత్రి రవిశంకర్ వాట్సాప్ పై ఒత్తిడి పెంచారు. దీని పై ఇప్పటికే రెండు నోటీసులు కూడా వాట్సాప్‌కు అందాయి. అయినప్పటికి వాట్సాప్ నుంచి స్పష్టమైన వివరణ అందకపోవటంతో మూడవ నోటీస్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చే ఫీర్యాదుల కోసం ఓ స్పెషల్ గ్రీవియన్స్ అధికారిని వాట్సాప్ నియమించింది.

 

 

ప్రతిపాదను తిరస్కరించిన వాట్సాప్..

ప్రతిపాదను తిరస్కరించిన వాట్సాప్..

ఇదే సమయంలో నోటీసుల పై స్పందిస్తూ ఫేక్ న్యూస్ సందేశాలు ఎవరి అకౌంట్ నుంచి వచ్చాయో కనిపెట్టగలిగే సాంకేతికతను అభివృద్థి చేస్తే యూజుర్ల వ్యక్తిగత ప్రైవసీతో పాటు ఎండ్ టు ఎండ్ సబ్‌స్ర్కిప్షన్ ఉద్దేశ్యం దెబ్బతింటుందని వాట్సాప్ వివరణ ఇచ్చుకుంది.

 

 

Best Mobiles in India

English summary
WhatsApp's latest big announcement: What it means for you and more.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X