Home
Apps

వాట్సాప్‌లో మరో సూపర్‌ ఫీచర్‌.. యూజర్లకు ఎలా ఉపయోగపడుతుందంటే..?

ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్‌ ఇటీవల అనేక ప్రత్యేక ఫీచర్లను తీసుకొస్తోంది. భారీగా ఉన్న యూజర్ల కోసం స్టేటస్‌లో కస్టమ్ లిస్ట్‌, సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్ సహా అనేక ఫీచర్లను అభివృద్ధి చేస్తోందని ఇటీవలే వార్తలు వచ్చాయి. ఇటీవలే కొత్త యూజర్లకు వాట్సాప్‌ గ్రూప్ హిస్టరీ ఫీచర్‌ కూడా అందుబాటులోకి వస్తుందని తెలిసింది. వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ WABetainfo ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి.

గూగుల్ మెసేజ్ తరహాలో :
అయితే తాజాగా అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా గూగుల్ మెసేజ్ తరహాలో సూపర్‌ ఫీచర్‌ను వాట్సాప్‌లోనూ త్వరలో తీసుకొస్తారని తెలుస్తోంది. ఈ ఫీచర్‌ ద్వారా వాట్సాప్‌లో మెసేజ్‌లను షెడ్యూల్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. వాట్సాప్‌ షెడ్యూల్‌ మెసేజ్‌ పేరుతో (Whatsapp Schedule Message Feature) ఈ ఫీచర్‌ లాంచ్ కానుంది.

Whatsapp Schedule message feature

ముఖ్యమైన మెసేజ్‌లను షెడ్యూల్‌ చేసుకోవచ్చు :
వాట్సాప్ షెడ్యూల్ మెసేజ్‌ ఫీచర్‌ తొలుత iOS యూజర్లను అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. iOS బీటా టెస్టర్‌లకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్‌ ద్వారా రోజువారీ మెసేజ్‌లను కూడా షెడ్యూల్‌ చేసేందుకు అవకాశం ఉంది. దీంతోపాటు మీటింగ్స్‌ సహా పుట్టిన రోజు, పెళ్లి రోజుకు సంబంధించిన మెసేజ్‌లను షెడ్యూల్‌ చేసేందుకు అవకాశం ఉంది.

ఈ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది :
వాట్సాప్‌ షెడ్యూల్‌ మెసేజ్‌ ఫీచర్‌ ప్రస్తుతం iOS బీటా 26.7.10.72 వెర్షన్‌లో టెస్టర్‌లకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ టెస్టింగ్‌ చేస్తోంది. వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. అయితే ఈ ఫీచర్‌ యూజర్లకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే వివరాలను మాత్రం వెల్లడించలేదు.

క్యాన్సిల్ చేసుకొనే అవకాశం :
ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చాక.. వాట్సాప్‌లో మెసేజ్‌ టైప్‌ చేసి, అనంతరం మీకు కావాల్సిన తేదీ, సమయాన్ని ఎంచుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేక సెక్షన్‌ కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే షెడ్యూల్‌ చేసిన మెసేజ్‌ డెలివరీ అయ్యే ముందే క్యాన్సిల్‌ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. క్యాన్సిల్‌ చేసిన విషయం అవతలి వ్యక్తికి తెలిసే అవకాశం లేదని సమాచారం.

వాట్సా్ప్‌ గ్రూప్‌ మెసేజ్‌ హిస్టరీ ఫీచర్ :
వాట్సాప్‌ షెడ్యూల్‌ మెసేజ్ ఫీచర్‌ వ్యక్తిగత, గ్రూప్ మెసేజింగ్‌కు కూడా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఇటీవలే వాట్సాప్‌లో గ్రూప్‌ మెసేజ్‌ హిస్టరీ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ ఫీచర్‌ కొంత మందికి అందుబాటులోకి రాగా.. త్వరలో మరింత మందికి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

వాట్సాప్‌ గ్రూప్‌లో కొత్తగా జాయిన్‌ అయిన వాట్సాప్ యూజర్లకు, అప్పటికే గ్రూప్‌లో జరుగుతున్న సంభాషణపై అవగాహన వచ్చేలా ఈ ఫీచర్‌ పనిచేస్తుంది. ఈ ఫీచర్‌ ద్వారా కొత్త యూజర్లకు గ్రూప్‌ అడ్మిన్‌ లేదా సభ్యులు గ్రూప్‌లోని సంభాషణలకు సంబంధించి 25 నుంచి 100 మెసేజ్‌ల వరకు షేర్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.

దీని ద్వారా కొత్త సభ్యులకు గ్రూప్‌లోని చర్చల గురించి ఓ అవగాహన వస్తుంది. వాట్సాప్‌ గ్రూప్‌ మెసేజ్‌ హిస్టరీ ఫీచర్‌ కూడా ఎండ్‌ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ను సపోర్టు చేస్తుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Whatsapp Schedule message feature rolling out to iOS users soon currently under testing
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X