వాట్సాప్ వినియోగిస్తున్నారా.. ఈ ఫీచర్‌ల గురించి తెలుసా.. ఎలా ఉపయోగించాలంటే?
మెటా నేతృత్వంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) అత్యంత వినియోగదారులు కలిగి ఉన్న యాప్‌లలో ఒకటిగా ఉంది. ఈ యాప్ తన వినియోగదారుల సౌకర్యం మరియు భద్రత కోసం అనేక కీలక ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు ప్రతి మెసేజ్ కూడా ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ సపోర్టును కలిగి ఉంది. అయితే మీ వాట్సాప్ ఖాతా మరియు చాట్ ను మరింత భద్రంగా ఉంచేందుకు వాట్సాప్ కీలక భద్రతా ఫీచర్లను కలిగి ఉంది.
2 స్టెప్ వెరిఫికేషన్ : వాట్సాప్ ఇప్పటికే మెరుగైన భద్రత కలిగి ఉందని చెబుతున్న సంస్థ.. ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా అదనపు భద్రత సొంతమవుతుందని చెబుతోంది. మెరుగైన భద్రత కోసం ఈ భద్రతా ఫీచర్‌ను వినియోగించుకోవాలని సూచిస్తోంది. ఇందులో భాగంగా 6 డిజిట్ పిన్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

ఫింగర్ ప్రింట్ లాక్ ఏర్పాటు : మీ వాట్సాప్ చాట్‌ను ఎవరూ చూడకుండా ఉండేందుకు వాట్సాప్ కు ఫింగర్ ప్రింట్ లాక్ లేదా ఫేస్ ఐడీ లాక్ ఫీచర్ ను ఉపయోగించుకోవాలి. ఫలితంగా మీ అనుమతి లేకుండా వాట్సాప్‌ను తెరిచేందుకు అవకాశం ఉండదు. ఫలితంగా మీ వ్యక్తిగత చాట్ భద్రంగా ఉంటుంది.
ఆ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు : మీరు ఆఖరిసారిగా ఎప్పుడు వాట్సాప్‌ను ఉపయోగించారనే సమాచారం అందుబాటులో ఉంటుంది. అయితే వీటిని నియంత్రించే అవకాశం ఉంది. Last seen, ప్రొఫైల్ ఫొటో సహా మీ స్టేటస్‌ను కొంత మందికి మాత్రమే కనిపించేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఫలితంగా మరింత భద్రంగా వాట్సాప్‌ను వినియోగించుకోవచ్చు.
లింక్స్ పైన క్లిక్ చేయవద్దు : ఇటీవల కాలంలో వాట్సాప్ ద్వారా కూడా సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆఫర్లు సహా ఇతర పేర్లతో కొత్త నంబర్ల నుంచి మెసెజ్‌లు వస్తున్నాయి. వాటిలోని లింక్ పైన ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. మీకు తెలిసిన వ్యక్తుల నుంచి వచ్చినా.. పూర్తిగా తనిఖీ చేశాకే క్లిక్ చేయాలి. ఏమాత్రం ఏమరపాటుగా వ్యవహరించినా.. సైబర్ మోసాలకు గురయ్యే అవకాశం ఉంది.
లింక్ చేసిన పరికరాలను తనిఖీ చేసుకోండి : ప్రస్తుతం వాట్సాప్‌ను గరిష్ఠంగా 4 పరికరాల్లో లింక్ చేసి ఉపయోగించుకొనే అవకాశం ఉంది. అయితే కొన్నిసార్లు లింక్ చేసిన డివైజ్ నుంచి లాగ్ అవుట్ చేయడం మర్చిపోతుంటాం. అలాంటి పరిస్థితుల్లో తరచూ మీరు లింక్ చేసిన పరికరాల జాబితాను మీ ప్రైమరీ వాట్సాప్‌లో తనిఖీ చేసేందుకు అవకాశం ఉంటుంది. అవసరం లేకుండా వెంటనే Logout చేయండి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








