వాట్సప్‌లో ప్రమాదకర లోపం, డేంజర్ జోన్‌లో గ్రూపు చాటింగ్‌లు !

By Hazarath
|

వాట్సప్..ఇప్పుడు ఈ పదం గురించి తెలియని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యాప్ ఉపయోగిస్తుంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్‌లో కాలం గడిపేవారు చాలామందే ఉంటారు. ఇలాంటి వాట్సప్‌లో ఇప్పుడు భద్రతా లోపాన్ని కనుగొన్నారు. ఆధార్ డేటా ప్రకంపనలు మరచిపోకముందే ఈ యాప్ లో భద్రతా లోపం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకెళితే..

 

ఆ స్టోరీలను వాట్సాప్ స్టోరీలుగా పెట్టుకోవచ్చట!ఆ స్టోరీలను వాట్సాప్ స్టోరీలుగా పెట్టుకోవచ్చట!

ప్రమాదంలో గ్రూపు చాటింగ్

ప్రమాదంలో గ్రూపు చాటింగ్

వాట్సప్ గ్రూపు చాటింగ్ ప్రమాదంలో పడనుందని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. వైర్డ్ రిపోర్ట్ ప్రకారం వాట్సప్ గ్రూపులోకి ఎవరైనా ప్రవేశించవచ్చట. గ్రూప్‌ చాట్‌లోకి అపరిచితులుఎవరైనా చొరబడవచ్చంటూ జర్మన్‌ పరిశోధకులు షాకింగ్‌ నివేదికను వెల్లడించారు.

వాట్సప్ సర్వర్‌పై కంట్రోల్‌

వాట్సప్ సర్వర్‌పై కంట్రోల్‌

స్విట్జర్లాండ్‌, జ్యూరిచ్‌లోని జరిగిన రియల్ వరల్డ్ క్రైప్టో సెక్యూరిటీ కాన్ఫరెన్‌లో పరిశోధకులు ఈ షాకింగ్‌ నివేదికను సమర్పించారు. వాట్సప్ సర్వర్‌పై కంట్రోల్‌ సాధించడం ద్వారా ప్రయివేటు గ్రూపు చాట్‌లోకి స్వయంగా తాముగానీ, వేరే వ్యక్తి ప్రవేశానికి అనుమతినిస్తుందని తెలిపింది.

గ్రూప్‌ అడ్మిన్‌ అనుమతి లేకుండానే...
 

గ్రూప్‌ అడ్మిన్‌ అనుమతి లేకుండానే...

గ్రూప్‌ అడ్మిన్‌ అనుమతి లేకుండానే... గ్రూప్‌చాట్‌లోకి అనుమతి లభిస్తోందని తెలిపింది. అంతేకాదు ఇది గుర్తించి సదరు వ్యక్తులను తొలగించడానికి అడ్మిన్‌ చేసే ప్రయత్నాన్ని కూడా ఈ బగ్‌ నిరోధిస్తుందని వెల్లడించింది.

 వాట్సప్ దృష్టికి తీసుకెళ్లగా

వాట్సప్ దృష్టికి తీసుకెళ్లగా

ఈ విషయాన్ని వాట్సప్ దృష్టికి తీసుకెళ్లగా కంపెనీ ప్రతినిధులు దీన్ని ధృవీకరించారని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని స్‌బుక్‌ ఛీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ అలెక్స్‌ స్టామస్‌ ఖండిస్తున్నారు. అలాంటి అవకాశమే లేదని కొట్టిపారేస్తున్నారు.

ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌

ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌

ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ద్వారా పూర్తి భద్రత కల్పించామని, అలాంటి అవకాశం లేదని , గ్రూప్‌ అడ్మిన్‌ అనుమతిలేకుండా రహస్యంగా ఎవరూ గ్రూప్‌లో చేరలేరనీ, కొత్త వ్యక్తులు చేరిన వెంటనే గ్రూపు సభ్యులకు నోటిఫికేషన్‌ అందుతుందని ఆయన తెలిపారు.

Best Mobiles in India

English summary
WhatsApp Security Flaw Can Allow Strangers Add Themselves to Group Chats: Researchers in telugu gizbot

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X