Home
Apps

వాట్సాప్‌ లో మరో కొత్త ఫీచర్‌.. మెసేజ్‌లను సులభంగా ట్రాన్స్‌లేట్‌ చేసుకోవచ్చు..!

వాట్సాప్‌ ప్రస్తుతం ప్రపంచం వ్యాప్తంగా ప్రముఖ మెసేజింగ్‌ ప్లాట్‌ఫాంగా ఉంది. కేవలం భారత్‌ లోనే 50 కోట్లకు పైగా వాట్సాప్‌ ను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ సంఖ్యలో ఉన్న యూజర్ల కోసం అనేక ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే తాజాగా వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ WABetainfo కీలక వివరాలు వెల్లడించింది.

ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ :
వాట్సాప్ మెసేజ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఫీచర్‌ (Whatsapp Translate Messages) తీసుకురానుందని గతంలోనే వివరాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ లో అందుబాటులో ఉందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్‌ 2.25.12.25 వెర్షన్‌ లో ట్రాన్సిలేట్ మెసేజెస్‌ ఫీచర్‌ కొంత మంది బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంది.

whatsapp

ఎండ్‌ టు ఎండ్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ :
ఈ ఫీచర్‌ ద్వారా ఆండ్రాయిడ్‌ యూజర్లు తమ వాట్సాప్‌ లోనే మెసేజ్‌లను ట్రాన్సిలేట్‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ ఎండ్‌ టూ ఎండ్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ సపోర్టును కలిగి ఉంటుందని వాట్సాప్ చెబుతోంది. తమ సర్వర్‌ లో కాకుండా యూజర్ల డివైజ్‌ లోనే ట్రాన్సిలేషన్‌ జరుగుతుందని వాట్సాప్‌ చెబుతోంది.

లాంగ్వేజ్‌ ప్యాక్‌ :
అయితే యూజర్లు లాంగ్వేజ్‌ ప్యాక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అయితే ఇందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌లను ఫీచర్‌ ట్రాకర్‌ షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ హిందీ, రష్యన్‌, స్పానీష్‌, అరబిక్‌, పోర్చుగీస్‌ భాషలు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చాక.. Chat lock ఆప్షన్‌ కిందే ఈ ఫీచర్‌ కూడా కనిపిస్తుంది. ఆఫ్‌లైన్‌ లో కూడా ఈ ఫీచర్‌ పనిచేసే అవకాశం ఉంది. ఈ ఫీచర్‌ ఆటోమేటిక్‌గా కూడా పనిచేస్తుంది లేదా కొన్ని ప్రత్యేక చాట్‌లను కూడా ట్రాన్స్‌లేట్‌ చేసుకోవచ్చు.

ఇటీవలే వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్ వాట్సాప్‌ స్టేటస్‌ అప్‌డేట్‌ పై పనిచేస్తుందని తెలిపింది. దీని ఆధారంగా ప్రస్తుతం ఉన్న వాట్సాప్‌ 60 సెకన్ల నుంచి 90 సెకన్ల వరకు పొడిగించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ బీటా వెర్షన్‌లో ఉంది. టెస్టింగ్‌ దశ తర్వాత యూజర్లకు అందుబాటులోకి రానుంది.

ఈ ఫీచర్‌ ముఖ్యంగా వాట్సాప్ వీడియో స్టేటస్‌ ఆప్షన్‌ను ఎక్కువగా ఉపయోగించే వారికి సౌకర్యంగా ఉంటుంది. గతంలో కరోనా సమయంలో 30 సెకన్లకు కుదించిన వాట్సాప్‌.. కరోనా అనంతరం 60 సెకన్లు కు పొడిగించింది. ఈ అప్‌డేట్‌ అందుబాటులోకి వస్తే 90 సెకన్ల వరకు స్టేటస్‌ పెట్టుకొనేందుకు అవకాశం ఉంటుంది.

దీంతోపాటు ఇటీవలే వాట్సాప్‌ స్టేటస్‌లో మ్యూజిక్‌ను యాడ్ చేసుకొనే ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌ ద్వారా యూజర్లు తమకు నచ్చిన ఆడియో ట్రాక్‌ను వారి స్టేటస్‌కు యాడ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం వాట్సాప్‌ స్టేటస్‌ ఫీచర్‌లో ఆడియా లైబ్రరీని అందుబాటులోకి తీసుకొచ్చారు.

వాట్సాప్‌ స్టేటస్‌లో ఆడియో ట్రాక్‌ను యాడ్‌ చేయాలని భావించే యూజర్లు.. లైబ్రరీ నుంచి మ్యూజిక్‌ను ఎంపిక చేసుకోవచ్చు. మీకు అవసరం అయిన ఆడియో ట్రాక్‌ను ఎంచుకొని యాడ్‌ చేసుకోవచ్చు. ఫోటో కోసం 15 సెకన్ల వరకు యాడ్‌ చేసుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
whatsapp set to launch new feature to translate messages under beta testing stage
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X