వాట్సప్ యూజర్ల డేటా చౌర్యం,పేమెంట్ చేస్తే అంతే సంగతులు !

Written By:

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ గత ఫిబ్రవరి నెలలో పేమెంట్స్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఫీచర్‌తో వాట్సప్ యూజర్లు యూపీఐ విధానం ద్వారా నగదు ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు వీలుంటుంది. అయితే ఇప్పుడు దీనిపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఈ పేమెంట్స్ ఫీచ‌ర్ ను వాడుకునే యూజర్ల స‌మాచారం ప‌ట్ల ప్ర‌స్తుతం అనేక సందేహాలు నెల‌కొన్నాయి. కేంబ్రిడ్జి అనాలిటికా స్కాండల్‌ ద్వారా ఫేస్‌బుక్‌ ప్రైవసీపై నీలి నీడలు కమ్ముకున్న నేపథ్యంలో దాని సెగలు ఇప్పుడు వాట్సప్‌కు కూడా పాకాయి. దీనికి ప్రధాన కారణం వాట్సప్‌ యాప్ ఫేస్‌బుక్‌ చేతిలో ఉండటమే. దీన్ని ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసిన సంగతి అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.

స్మార్ట్‌పోన్ వాడేవారు షాకయ్యే న్యూస్ ఏంటో తెలుసా ?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మెంట్స్ ఫీచర్‌తో..

వాట్సప్‌లో పేమెంట్స్ ఫీచర్‌తో నగదు పంపుకునే యూజర్లకు చెందిన వర్చువల్ పేమెంట్ అడ్రస్‌లు, ఈ-మెయిల్ ఐడీలు, బ్యాంక్ అకౌంట్ వివరాలను వాట్సప్ సేకరించి వాటిని ఫేస్‌బుక్‌తో పంచుకుంటున్నదని పలువురు నిర్దారించారు.

వాట్సప్ ప్రైవసీ స్టేట్‌మెంట్‌లో..

ఈ విషయం సాక్షాత్తూ వాట్సప్ ప్రైవసీ స్టేట్‌మెంట్‌లోనే ఉండడం గ‌మనించదగ్గ విషయం. వాట్సప్‌లో యూజర్ల సమాచారాన్ని సురక్షితంగా ఉంచడం కోసం, ఎలాంటి ఫ్రాడ్‌లు జరగకుండా సేఫ్టీ, సెక్యూరిటీని కల్పించడం కోసం యూజర్ల సమాచారాన్ని కలెక్ట్ చేసి థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన ఫేస్‌బుక్‌తో ఆ సమాచారాన్ని పంచుకుంటామని వాట్సాప్ ప్రైవసీ స్టేట్‌మెంట్‌లో స్పష్టంగా ఉంది.

వాట్సప్‌ను వివరణ కోరగా..

దీంతో ఇప్పుడు వాట్సప్‌లో పేమెంట్స్ ఫీచర్‌ను వాడుకుంటున్న యూజర్ల సమాచారం కూడా ఫేస్‌బుక్ వద్ద ఉన్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై మన దేశంలోని ఓ ప్రముఖ న్యూస్ చానల్ వాట్సప్‌ను వివరణ కోరగా వారు స్పందించలేదు.

ఆందోళన అవసరం లేదని..

కాగా తమ యూజర్ల వాట్సప్ సమాచారాన్ని తాము చాలా తక్కువగా కలెక్ట్ చేస్తామని, ఆ విషయంలో ఆందోళన అవసరం లేదని వాట్సప్ ఇటీవలే ఒక ప్రకటనలో తెలియజేసింది.

నగదు ట్రాన్స్‌ఫర్ కోసం..

బ్యాంకులు, ప్రభుత్వానికి చెందిన మనీ ట్రాన్స్‌ఫర్ యాప్‌లు కూడా ఇలా వాట్సప్, ఫోన్ పే, పేటీఎం లాంటి థర్డ్ పార్టీ యాప్‌లను నగదు ట్రాన్స్‌ఫర్ కోసం వాడే ముందు ఎవరైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp Shares Your UPI Payments Data With Facebook More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot