వాట్సాప్‌లో మీరు తప్పక తెలుసుకోవలసిన ఆరు అద్భుతమైన ఫీచర్లు ఇవే...

|

మెటా యాజమాన్యంలోని అతిపెద్ద టెక్స్ట్ మెసేజింగ్ అప్లికేషన్ యాప్ వాట్సాప్ ను ప్రపంచం మొత్తం మీద తమ ప్రియమైన వారికి త్వరగా మెసేజ్లను పంపడం మరియు స్వీకరించడానికి అధికంగా వినియోగిస్తున్నారు. వాట్సాప్ తన యొక్క ప్లాట్‌ఫారమ్‌లో క్రమం తప్పకుండా కొత్త ఫీచర్‌లను విడుదల చేయడంతో అప్‌డేట్ మెరుగ్గా ఉంది. గత సంవత్సరంలో కంపెనీ డబ్బును బదిలీ చేసే నిబంధనతో సహా కొన్ని ముఖ్యమైన ఫీచర్లను జోడించింది. ప్రపంచవ్యాప్తంగా దీనిని ఇప్పటికే అధిక మంది వినియోగిస్తున్నారు. అయితే ఇది ఎలాంటి ఫీచర్లతో వస్తుందో అందరికీ తెలియకపోవచ్చు. మీరు కూడా వాట్సాప్‌ను ఉపయోగిస్తుంటే కనుక ఈ అద్భుతమైన ఫీచర్‌ల గురించి తప్పక తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ల్యాప్‌టాప్ నుండి కాల్‌లకు హాజరు అవ్వడం

ల్యాప్‌టాప్ నుండి కాల్‌లకు హాజరు అవ్వడం

మీరు మీ కంప్యూటర్‌లో విండోస్/మాక్ కోసం WhatsAppని ఇన్‌స్టాల్ చేస్తే కనుక ల్యాప్‌టాప్‌ల నుండి నేరుగా వాయిస్ మరియు వీడియో కాల్‌లకు అటెండ్ అయ్యే ఫీచర్‌ని వాట్సాప్ జోడించింది. ఇది కాల్‌లలో హాజరు కావడానికి ఫోన్‌ని పట్టుకునే అవాంతరం నుండి విముక్తిని అందిస్తుంది.

 

వాట్సాప్ ద్వారా డబ్బును పంపడం మరియు స్వీకరించడం

వాట్సాప్ ద్వారా డబ్బును పంపడం మరియు స్వీకరించడం

వాట్సాప్ యొక్క పేమెంట్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ సిస్టమ్ (UPI) ఆధారంగా డబ్బు పంపడానికి మరియు స్వీకరించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ ఏడాది భారతదేశంలోని ఆండ్రాయిడ్ మరియు iOS వినియోగదారులందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

 

iPhone నుండి Androidకి చాట్‌లను బదిలీ చేయడం
 

iPhone నుండి Androidకి చాట్‌లను బదిలీ చేయడం

2021లో విడుదల చేసిన అత్యంత ఉపయోగకరమైన ఫీచర్‌లలో ఇది ఒకటి. ఈ ఫీచర్‌తో వినియోగదారులు కొత్త ఫోన్ కు మారినప్పుడు తమ యొక్క వాట్సాప్ పూర్తి సంభాషణలు ఐఫోన్ నుండి ఆండ్రాయిడ్ ఫోన్ కి సులభంగా తరలించవచ్చు. అయితే ఈ బదిలీని పూర్తి చేయడానికి మీకు USB-C కేబుల్ అవసరం. ఈ ఫీచర్ 'సెట్టింగ్స్' విభాగం క్రింద అందుబాటులో ఉంది.

అదృశ్యమవుతున్న మీడియా ఫైల్‌లు

అదృశ్యమవుతున్న మీడియా ఫైల్‌లు

వాట్సాప్‌ యొక్క చాటింగ్ లో తమ యొక్క మీడియాను ఎవరికైనా పంపినప్పుడు దానిని రెండుసార్లు చూడకూడదనుకునే వ్యక్తులు మీడియా ఫైల్‌లను 'ఒకసారి మాత్రమే వీక్షించండి' అని పంపవచ్చు. ఇమేజ్‌లు/వీడియోలను 'ఒక్కసారి మాత్రమే వీక్షించండి' అని పంపడానికి, మీడియా ఫైల్‌ను పంపే ముందు '1' చిహ్నంపై నొక్కండి. రిసీవర్ ఒకసారి చూసిన తర్వాత అవి స్వయంచాలకంగా అదృశ్యమవుతాయి.

షేర్ చేస్తున్నప్పుడు వీడియోలను మ్యూట్ చేయడం

షేర్ చేస్తున్నప్పుడు వీడియోలను మ్యూట్ చేయడం

మీరు ఏదైనా ఒక వీడియోను రికార్డ్ చేసినప్పుడు మరియు మీకు నచ్చిన వీడియోను చూసినప్పుడు దానిని ఎవరికైనా పంపదలచినప్పుడు దానికి ఉద్దేశించిన బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ మీకు నచ్చనప్పుడు వాట్సాప్ యొక్క మ్యూట్ వీడియో ఫీచర్ ఉపయోగపడుతుంది. మీరు వాట్సాప్ చాట్‌లలో వీడియోలను షేర్ చేయడానికి ముందు వాటిని మ్యూట్ చేయవచ్చు.

బహుళ-పరికర ఫీచర్‌ని ఉపయోగించండి

బహుళ-పరికర ఫీచర్‌ని ఉపయోగించండి

మీరు మీ ల్యాప్‌టాప్, PC లేదా టాబ్లెట్‌లో ఏకకాలంలో WhatsAppని ఉపయోగించవచ్చు. ఈ బహుళ-పరికర ఫీచర్ అనేక పరికరాలలో WhatsAppను ఉపయోగించడం ఒక బ్రీజీగా చేస్తుంది.

WhatsApp బిజినెస్ లో Facebook లాంటి కవర్ పేజీ

WhatsApp బిజినెస్ లో Facebook లాంటి కవర్ పేజీ

మేము గత సంవత్సరం జోడించిన కొన్ని కీలక ఫీచర్లను పరిశీలించినప్పుడు ఈ మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్‌కు రాబోయే తాజా ఫీచర్‌ను కూడా గమనించండి. వాట్సాప్ డెవలప్‌మెంట్ ట్రాకర్ WABetaInfo ప్రకారం అప్లికేషన్ త్వరలో మీ ప్రొఫైల్ కోసం కొత్త Facebook లాంటి కవర్ ఇమేజ్‌ని జోడించే ఫీచర్ ను తీసుకొనిరానున్నది. ఇది ప్రధానంగా వాట్సాప్ బిజినెస్ అకౌంట్ల కోసం ఉంటుంది. వ్యక్తిగత వాట్సాప్ అకౌంట్ లో ఈ ఫీచర్ లభ్యత గురించి ఇంకా వివరాలు తెలియాలసి ఉంది.

వాట్సాప్ డిలీట్ ఫర్ ఎవ్రీవన్ టైమ్ లిమిట్

వాట్సాప్ డిలీట్ ఫర్ ఎవ్రీవన్ టైమ్ లిమిట్

ప్రముఖ ఫీచర్ లీకర్ WABetaInfo యొక్క ఇటీవలి నివేదిక ప్రకారం ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్ కోసం సుపరిచితమైన WhatsApp చాట్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ మెసేజ్ ను తొలగించడాన్ని ఎంచుకోవడానికి వినియోగదారుని అడుగుతున్న ఒక డైలాగ్ బాక్స్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. ఇందులో గమనించదగ్గ విషయం ఏమిటంటే మెసేజ్ మూడు నెలల క్రితం పంపబడింది మరియు ఇది ఆగస్టు 23 తేదీని చూపుతుంది. ఇది 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' ఫీచర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు WhatsApp విధించిన ప్రస్తుత కాల పరిమితిని మించిపోయింది. ప్రస్తుతానికి Facebook యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వినియోగదారులందరికీ 4096 సెకన్ల వరకు మెసేజ్‌లను తొలగించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇది పంపబడిన ఒక గంట కంటే కొంచెం ఎక్కువ సమయం మాత్రమే. 2017లో ఈ ఫీచర్‌ను విడుదల చేసినప్పుడు ఏడు నిమిషాల విండో నుండి టైమర్ పెంచబడింది. అయితే కంపెనీ భవిష్యత్ అప్ డేట్ లో ఈ టైమర్‌ను పూర్తిగా తీసివేయవచ్చని లీక్ సూచిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
WhatsApp Six Amazing Features You Should know About Every Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X