Home
Apps

వాట్సాప్‌ వీడియో కాల్‌లో కొత్త ఫీచర్.. ఎప్పటి నుంచో ఉన్న సమస్యకు పరిష్కారం దొరికినట్టే..!

వాట్సాప్‌ ప్రస్తుతం అధిక సంఖ్యలో యూజర్లను కలిగి ఉన్న మెసేజింగ్‌ యాప్స్‌ లో ఒకటిగా ఉంది. భారత్‌ లో సుమారు 50 కోట్లకు పైగా యూజర్లు ఉన్నాయి. భారీ స్థాయిలో ఉన్న యూజర్ల కోసం ఈ మెసేజింగ్‌ ప్లాట్‌ఫాం అనేక ప్రత్యేక ఫీచర్‌లను ఇప్పటికే కలిగి ఉంది. దీంతోపాటు యూజర్లకు మరిన్ని సౌకర్యాలను కల్పించేందుకు వీలుగా కొత్త ఫీచర్‌లను అభివృద్ధి చేస్తోంది.

ప్రస్తుతం వాట్సాప్‌ లో (Whatsapp) వాయిస్‌ కాల్స్ ఫీచర్‌తో పాటు వీడియో కాల్‌ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. అయితే వీడియో కాల్స్ సమయంలో కెమెరాను ఆఫ్‌ చేసుకొనే అవకాశం ప్రస్తుతం లేదు. అంటే వీడియో కాల్‌లో జాయిన్‌ అయ్యాక మాత్రమే కెమెరాను ఆఫ్‌ చేసుకొనే అవకాశం ఉంది.

whatsapp soon allow users to turn off camera before joining in video call telugu news

ప్రస్తుతం వాట్సాప్ ఈ ఫీచర్‌ ను అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా వీడియో కాల్‌లో జాయిన్ అయ్యే కంటే ముందే, కెమెరాను ఆఫ్‌ చేసుకొనే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్‌ యూజర్లకు ఈ ఫీచర్‌ ముందుగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ 2.25.7.3 లో ఈ ఫీచర్‌ను గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ యూజర్‌లకు అందుబాటులో లేదు. అయితే వాట్సాప్ వీడియో కాల్‌లో జాయిన్ అయ్యే కంటే కెమెరాను ఆఫ్‌ చేసుకోవచ్చు. మరియు మీకు కావాలంటే కెమెరాను ఆన్‌ చేసుకొనే ఫీచర్‌ ను కలిగి ఉంటుంది.

ఇందుకు సంబంధించి కాల్‌ సమయంలో మీకు ప్రత్యేకమైన ఆప్షన్‌లు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం గూగుల్‌ మీట్‌, మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో మీకు నచ్చిన సమయంలో కెమెరాను ఆఫ్‌ లేదా ఆన్‌ చేసుకొనేలా ఆప్షన్‌లు ఉంటాయి. వాట్సాప్‌ వీడియో కాల్‌లో అప్‌గ్రేడ్‌ ఫీచర్‌ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో సమాచారం వెల్లడి కాలేదు.

వాట్సాప్‌ గత నెల చివర్లో వాట్సాప్‌లో వాయిస్‌ మెసేజ్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ ఫీచర్‌ను విడుదల చేసింది. దీని ద్వారా వాట్సాప్ వాయిస్‌ మెసేజ్‌ను టెక్ట్స్‌ రూపంలో మార్చుకొనేందుకు ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ఏదైనా సమయంలో మీరు వాయిస్‌ మెసేజ్‌ను వినలేని పరిస్థితుల్లో.. దానిని టెక్ట్స్ రూపంలో మార్చుకోవచ్చు.

ఈ ఫీచర్‌తో ఎటువంటి ప్రైవసీ ఇబ్బందులు వచ్చే అవకాశం లేదని వాట్సాప్‌ గతంలోనే స్పష్టతనిచ్చింది. వాయిస్‌ టూ టెక్ట్స్‌ ట్రాన్స్‌లేషన్‌ అంతా మొబైల్‌లోనే జరుగుతుందని, వాట్సాప్ కూడా ఆ మెసేజ్‌లను చూసేందుకు వీలులేదని తెలిపింది. ఫలితంగా ప్రైవసీకి ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం లేదని చెప్పింది.

వాట్సాప్ వాయిస్ మెసేజ్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ ఫీచర్‌ను ఎలా యాక్టివేట్‌ చేయాలి :
- వాట్సాప్ సెట్సింగ్స్‌ మెనూలోకి వెళ్లాలి.
- అక్కడ కనిపించిన Chats ను సెలెక్ట్‌ చేసుకోవాలి.
- అనంతరం Voice Message Transcripts ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలి. అనంతరం మీకు చెందిన భాషను ఎంచుకోవాలి.
- ఫీచర్‌ యాక్టివేట్‌ అయ్యాక మీకు వచ్చిన వాయిస్‌ మెసేజ్‌లపై Long Press చేయాల్సి ఉంటుంది.
- తర్వాత More Options పైన క్లిక్‌ చేసి, Transcribe ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
whatsapp soon allow users to turn off camera before joining in video call
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X