వాట్సాప్ ‘recall’ , కొత్త ఫీచర్ వచ్చేస్తోంది

పొరపాటున పంపిన మెసేజ్‌ను వెనక్కి తీసేసుకోవచ్చు

|

'రీకాల్' మెసెజ్ పేరుతో కొత్త సదుపాయం వాట్సాప్‌లో చేరబోతోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్లయితే పొరపాటున పంపిన మెసేజ్‌లను వెనక్కితీసకునే వీలుంటుంది. అయితే, మెసేజ్ పంపిన 5 నిమిషాల్లోపు మాత్రమే రీకాల్ చేసే వీలుంటుంది.

వాట్సాప్ ‘recall’ , కొత్త ఫీచర్ వచ్చేస్తోంది

WABetaInfo అనే ఫ్యాన్ వెబ్‌సైట్ వాట్సాప్‌లో వచ్చే కొత్త ఫీచర్లను ముందుగానే పరీక్షిస్తుంటుంది. ఈ సైట్ చెబుతోన్న దాని ప్రకారం త్వరలోనే ఈ రీకాల్ మెసేజ్ ఆప్షన్ వాట్సాప్‌లో యాడ్ కాబోతోంది. 'రీకాల్' మెసెజ్ ఫీచర్ ద్వారా ఒక్క టెక్స్ట్‌ను మాత్రమే కాకుండా పొరపాటును పంపించే ఫోటోలు, వీడియోలు, జిఫ్ ఫైల్స్, డాక్యుమెంట్స్, మెసేజ్ కొటేషన్స్, స్టేటస్ రిప్లైస్ ఇలా అన్నింటిని 5 నిమిషాల్లోపు వెనక్కితీసుకునే వీలుంటుంది.

వాట్సాప్ ‘recall’ , కొత్త ఫీచర్ వచ్చేస్తోంది

సెండ్ చేసిన మెసేజ్‌‌ ఎడిట్ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్ బేటా వర్షన్ కల్పిస్తోందని, ఈ ఫీచర్‌ను మరింత అభివృద్ధి చేయవల్సి ఉందని WABetaInfo ఒక ట్వీట్‌లో పేర్కొంది. వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 1.2 బిలియన్ నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. 50 భాషల్లో ఈ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్ లభ్యమవుతోంది. భారత‌కు వచ్చేసరికి 10 ప్రాంతీయ భాషల్లో వాట్సాప్ అందుబాటులో ఉంది. 200 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారు.

Best Mobiles in India

English summary
WhatsApp to soon launch ‘recall’ message feature: Report. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X