ఈ భయంతో వాట్సాప్ DPలుగా మీ ఫొటోలు వినియోగించడం లేదా.... అయితే మీకో గుడ్‌న్యూస్..!
మెటా నేతృత్వంలోని ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ (Whatsapp) తన వినియోగదారుల కోసం ఇటీవల కాలంలో అనేక కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. వాట్సాప్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగదారులు ఉన్న యాప్‌గా గుర్తింపు పొందింది. వినియోగదారుల భద్రత, సౌకర్యాల కోసం ఇప్పటికే అనేక ఫీచర్లను వాట్సాప్ తీసుకొచ్చింది.
తాజాగా వాట్సాప్ కీలక ఫీచర్‌ను టెస్టింగ్ (Whatsapp latest privacy features) చేస్తోంది. ఇప్పటికే వన్ వ్యూ ఫోటో, వీడియో ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు పంపిన ఫోటోలను, వీడియోలను ఒక్కసారి మాత్రమే చూసేందుకు వీలుంటుంది. మరియు వాటిని స్క్రీన్ షాట్ తీసేందుకు అవకాశం ఉండదు. ఫలితంగా యూజర్లకు మెరుగైన భద్రతను ఇస్తోంది.

ఆండ్రాయిడ్ బీటా 2.24.4.25 వెర్షన్‌లో మాత్రమే.. : తాజాగా వాట్సాప్ కొత్త ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్ల ప్రొఫైల్ ఫొటోలను స్క్రీన్ షాట్ తీసే అవకాశం ఉండదు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా 2.24.4.25 వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే మరికొన్ని రోజుల్లో ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యంగా మహిళలు.. : అనేక మంది వాట్సాప్ వినియోగదారులు ముఖ్యంగా మహిళలు తమ ఫొటోలను వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోలుగా పెట్టుకొనేందుకు ఆసక్తి ఉన్నా.. వివిధ భద్రతా కారణాల రీత్యా వెనక్కి తగ్గుతున్నారు. ఆయా ఫోటోలను స్క్రీన్‌షాట్ తీసి చెడు మార్గాల్లో వినియోగిస్తారనే ఆందోళనతో వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోలుగా (DP) తమ ఫొటోలను వినియోగించడం లేదు.
ఈ ఫీచర్ వినియోగదారులు అందరికీ అందుబాటులోకి వచ్చాక.. మీ ప్రొఫైల్ ఫొటోను స్క్రీన్ షాట్ తీసేందుకు ఎవరైనా ప్రయత్నించినప్పుడు.. ఆ అవకాశం లేదని మరియు డీపీని బ్లాక్ చేసినట్లు పాప్‌అప్ రూపంలో చెబుతుంది. మెటా నేతృత్వంలోని ఫేస్‌బుక్ ఇప్పటికే ఇటువంటి ఫీచర్‌ను కలిగి ఉంది.
* దీంతోపాటు వాట్సాప్ మరో కీలక ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. ఫేవరెట్స్ ట్యాబ్‌ను పరిచయం చేయనుంది. ఫలితంగా మీకు ఇష్టమైన వ్యక్తుల చాట్‌ను అందులో చేర్చుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్, వెబ్ యూజర్ల కోసం టెస్టింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో అప్‌డేట్ కానున్న వాట్సాప్ వెబ్‌లో ఆల్, అన్‌రీడ్, ఫేవరెట్స్ ట్యాబ్‌లు వేర్వేరుగా కనిపిస్తాయి. ఫేవరెట్స్ ట్యాబ్‌లో మీకు నచ్చినవారి కాంటాక్ట్‌లను చేర్చుకోవచ్చు.
* వాట్సాప్‌లో ఇటీవల కొన్ని కొత్త టెక్ట్స్ ఫార్మాట్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా మీ మెసెజ్‌లను బుల్లెట్, నంబర్, బ్లాక్ కోట్, ఇన్‌లైన్ కోడ్ ఫార్మాట్ చేయడంలో నాలుగు కొత్త టెక్ట్స్ ఫార్మాట్‌లను తీసుకొచ్చింది. ఇప్పటికే అందుబాటులోకి ఉన్న ఫీచర్లతోపాటు బోల్డ్, స్ట్రైక్ త్రూ, ఇటాలిక్, మోనో స్పేస్ అదనంగా చేర్చబడ్డాయి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications