ఇక వాట్సాప్ వీడియో స్ట్రీమింగ్

నిన్న మొన్నటి వరకు ఏదైనా వాట్సాప్ వీడియోను ఓపెన్ చేయాలంటే, ఆ వీడియోను పూర్తిగా డౌన్లోడ్ చేుసుకుని ఓపెన్ చేయవల్సి వచ్చేది. ఇక పై ఆ పరిస్థితి ఉండబోదు.

ఇక వాట్సాప్ వీడియో స్ట్రీమింగ్

Read More: ఇంటర్నెట్‌లో నోకియా కొత్త ఫోన్ హల్‌చల్

తాజాగా, వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చిన వీడియో స్ట్రీమింగ్ ఫీచర్‌లో భాగంగా, వాట్సాప్ వీడియోలను ఎప్పుడు కావాలంటే అప్పుడు స్ట్రీమ్ చేసుకోవచ్చు. వీడియో ఉపయోగపడుతుందనుకుంటేనే డౌన్‌లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు. దీని వల్ల బోలెడంత డేటా ఆదా అవుతుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక వాట్సాప్ వీడియో స్ట్రీమింగ్

ఇటీవల వీడియో కాలింగ్ ఫీచర్‌ను లాంచ్ చేసి టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిలిచిన ఇన్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ తాజాగా వీడియో స్ట్రీమింగ్ పేరుతో మరో ఫీచర్‌ను పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బేటా వర్షన్ 2.16.365లో ఉన్న వారికి మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ అప్‌డేట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన కొత్త ఇంటర్‌ఫేస్‌లో డౌన్‌లోడ్ ఆప్షన్ స్థానంలో ప్లే ఆప్షన్‌ను యూజర్ చూడొచ్చు.

Read More: 10 లక్షల ఫోన్‌లు అమ్మారు, అయినా క్రేజ్ తగ్గలేదు!

English summary
WhatsApp To Start Video Streaming Feature Soon. Read More in Telugu Gizbot.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot