Home
Apps

వాట్సాప్‌లో కొత్తగా Favorites ఫీచర్‌.. ఎలా పనిచేస్తుంది... పూర్తి వివరాలు..!

వాట్సాప్‌ తన వినియోగదారుల సౌకర్యం కోసం అనేక ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తుంది. గతంలో యూజర్‌ ఇంటర్‌ఫేస్‌లో మార్పులు చేసిన సంస్థ తాజాగా మరింత సులభంగా తమ చాట్‌లను నిర్వహించుకొనేలా కొత్త ఫీచర్‌లను ప్రవేశపెట్టనుంది. Favorites పేరుతో ప్రత్యేక ట్యాబ్‌లో మీకు నచ్చిన కాంటాక్ట్‌లను యాడ్‌ చేసుకోవచ్చు. ఈ వివరాలను తమ బ్లాగ్‌ పోస్ట్‌లో (Whatsapp Favorites Feature) సంస్థ వెల్లడించింది.

వాట్సాప్‌ బ్లాగ్‌ పోస్ట్‌ ఆధారంగా.. ఈ కొత్త ఫీచర్‌తో ముఖ్యమైన చాట్‌, గ్రూప్‌లను ప్రత్యేకంగా నిర్వహించుకొనే అవకాశం ఉంటుంది. కాల్‌ ట్యాబ్‌ వద్ద ముఖ్యమైన చాట్, గ్రూప్‌లను పిన్‌ చేసుకొనే సౌలభ్యం ఉంటుంది. ఈ కొత్త వెర్షన్‌ ద్వారా ముఖ్యమైన చాట్‌లకు త్వరగా స్పందించేందుకు వీలుంటుంది.

whatsapp starts rolling Favorites feature

ప్రస్తుతం ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. చాట్‌ లిస్ట్ నుంచి "Favorites" ట్యాబ్‌కు ముఖ్యమైన కాంటాక్ట్‌, గ్రూప్‌లను యాడ్‌ చేయవచ్చు. ఇందుకోసం కాల్‌ ట్యాబ్‌లో ఇప్పటికే అందుబాటులో "Add Favourites" యాడ్‌ చేయవచ్చు. చాట్‌ లిస్ట్ నుంచి కూడా యాడ్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది.

ఈ ఇవాళ్టి నుంచి ఈ ఫీచర్‌ వాట్సాప్‌ లో అందుబాటులోకి వచ్చింది. మరి కొన్ని వారాల్లో అందరికీ అందుబాటులోకి రానుందని వాట్సాప్‌ వెల్లడించింది. ఈ ఫీచర్‌ ద్వారా మరింత సులభంగా వాట్సాప్‌ ను వినియోగించుకొనేందుకు అవకాశం ఉంటుందని వాట్సా్ప్‌ చెబుతోంది.

*ఇటీవల వాట్సాప్‌లో కంటెక్ట్స్ కార్డు ఫీచర్‌ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ ద్వారా వాట్సాప్‌ గ్రూప్‌లో చేరే ముందు.. అవసరమైన వివరాలు యూజర్లకు తెలియనున్నాయి. కంటెక్ట్స్‌ కార్డు ఫీచర్ ఆధారంగా మీ కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని వ్యక్తులు మిమ్మల్ని ఇతర గ్రూప్‌లలో జాయిన్‌ చేసేందుకు ముందు లేదా జాయిన్‌ చేసిన తర్వాత గ్రూప్‌లో ఉండాలా వద్దా అనే నిర్ణయం తీసుకొనేందుకు కావాల్సిన సమాచారాన్ని ఈ ఫీచర్‌ మీకు అందిస్తుంది.

మీ ఫోన్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని వాట్సాప్‌ యూజర్లు.. మిమ్మల్ని ఇతర వాట్సాప్‌ గ్రూపులో చేర్చినప్పుడు.. సదరు యూజర్ వివరాలను సూచించే Context Card ను ప్రదర్శిస్తుంది. ఆ గ్రూప్‌ ఎప్పుడు క్రియేట్‌ చేశారు మరియు ఎవరు క్రియేట్‌ చేశారు వంటి వివరాలూ కూడా ఉండనున్నాయి. ఈ వివరాల ఆధారంగా ఆ వాట్సాప్‌ గ్రూప్‌లో మీరు ఉండదలచుకున్నారా.. లేదా అని నిర్ణయం తీసుకోవచ్చు.

అయితే ఇప్పటికే ఆ తరహా ఫీచర్‌ వాట్సాప్‌లో అందుబాటులో ఉంది. మీ కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని యూజర్లు మీకు వ్యక్తిగతంగా మెసేజ్‌ చేసిన సమయంలో.. 'మీకు మెసేజ్ చేసిన వ్యక్తి మీ కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేరు' అనే అర్థం వచ్చేలా ఓ సూచన కనిపిస్తుంది. అదే తరహాలో ఈ కొత్త ఫీచర్‌ కూడా పనిచేస్తుంది. అయితే మరికొంత అదనపు భద్రత, సమాచారాన్ని కలిగి ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
whatsapp starts rolling Favorites feature how it works full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X