Home
Apps

Whatsapp యూజర్ల భద్రత కోసం కీలక ఫీచర్‌.. వారికి మాత్రమే..!

ప్రముఖ మెసేజింగ్‌ ప్లాట్‌ఫాం వాట్సాప్‌.. తన వినియోగదారుల భద్రతను మెరుగుపరిచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఫీచర్‌తో లాగిన్‌ ప్రక్రియ సులభం మరియు భద్రతను కలిగి ఉంటుందని భావిస్తోంది. దీంతోపాటు 2 ఫ్యాక్టర్‌ వెరిఫికేషన్ ప్రక్రియకు త్వరలో వీడ్కోలు పలికే అవకాశం ఉంది. వాట్సాప్‌ అధికారిక ట్విట్టర్‌ (X) హ్యాండిల్‌ ద్వారా అధికారిక ప్రకటన చేసింది.

వాట్సాప్‌ను సురక్షితంగా వినియోగించుకొనేందుకు వీలుగా పాస్‌కీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకోస్తుంది. ఈ ఫీచర్‌పై ఇప్పటి వరకు టెస్టింగ్ చేసిన వాట్సాప్‌.. తాజాగా ఆండ్రాయిడ్‌ వినియోగదారుల కోసం విడుదల చేసింది. కొన్ని వారాల్లో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అయితే iOS వినియోగదారులకు ఈ ఫీచర్‌ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే సమాచారం లేదు.

Whatsapp starts rolling out passkey feature

పాస్‌కీ అంటే ఏంటి : వినియోగదారులు సురక్షితంగా తమ వాట్సాప్ ఖాతాల్లోకి లాగిన్ అయ్యేందుకు ఇదొక సురక్షితమైన మార్గం. ఇది వాట్సాప్‌ కోసం మెటా తీసుకొచ్చిన పాస్‌వర్డ్‌ రహిత విధానంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎస్‌ఎంఎస్‌ ఆధారిత 2 ఫ్యాక్టర్‌ వెరిఫికేషన్‌కు వీడ్కోలు పలకనుంది.

ఈ పాస్‌కీ ఫీచర్‌తో వాట్సాప్‌ వినియోగదారులు తమ ముఖం, ఫింగర్‌ ప్రింట్‌, పిన్‌ ఆధారంగా సురక్షితంగా లాగిన్ కావొచ్చు. ప్రస్తుతం చాట్‌ లాక్‌, స్క్రీన్‌ లాక్‌, డివైస్‌ ఫింగర్‌ ప్రింట్‌, ఫేస్ అన్‌లాక్‌, పిన్‌ వంటి అనేక సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి.

అయితే ఈ పాస్‌కీలు ప్రత్యకమైన క్రిప్ట్రోగ్రాఫిక్‌ కీని కలిగి ఉంటాయి. ఇది ఆటోమేటిక్‌గా గూగుల్‌ పాస్‌వర్డ్‌ మేనేజర్‌లో భద్రంగా ఉంటుంది. ఈ పాస్‌కీని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదని వాట్సాప్‌ చెబుతోంది.
ఈ పాస్‌కీ ఫీచర్‌ మీ ఆండ్రాయిడ్ డివైస్‌కు అందుబాటులోకి వచ్చిన తర్వాత సెట్టింగ్‌లను తెరవాలి. అందులో కనిపించిన పాస్‌కీ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.

ఆ సమయంలో గూగుల్‌ పాస్‌వర్డ్ మేనేజర్‌ యాప్‌ అవసరం అవుతుంది. వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకొని, ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అనంతరం వాట్సాప్‌ను ఓపెన్‌ చేయాలి. అక్కడ సెట్టింగ్స్‌లో కనిపించిన పాస్‌కీపైన ట్యాప్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం పాస్‌కీని క్రియేట్‌ చేసుకోవాలి. అనంతరం అక్కడ వచ్చిన ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. తర్వాత కనిపించిన కొనసాగించండి బటన్‌పైన క్లిక్‌ చేయాలి. అప్పుడు మీ పాస్‌కీ క్రియేట్‌ అవుతుంది.

వినియోగదారుల భద్రత కోసం వాట్సాప్‌ మరో కీలక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్‌ కాల్‌ సమయంలో వినియోగదారుడి IP అడ్రస్‌ను ట్రాక్‌ చేయకుండా ఉండేలా చూస్తుంది. ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌, iOS వాట్సాప్‌ బీటా వినియోగదారులకు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కచ్చితంగా ఎప్పటి నుంచి ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తుందో తెలియకపోయినా.. త్వరలో రానుందని తెలుస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Whatsapp starts rolling out passkey feature for android users
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X