వాట్సాప్ వీడియో కాలింగ్ ఫీచర్ వచ్చేసింది

వాట్సాప్ తన వీడియో కాలింగ్ ఫీచర్‌ను భారత్‌లో విడదల చేసింది. ఈ ఫీచర్ కోసం వాట్సాప్ యూజర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ అప్‌డేట్ ప్రస్తుతానికి విండోస్ ఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

వాట్సాప్ వీడియో కాలింగ్ ఫీచర్ వచ్చేసింది

Read More : 5జీలో మనమే ముందుండాలి.. చైనా, జపాన్‌లతో పోటీకి సై

v2.16.260 వాట్సాప్ బేటా అప్‌డేట్‌లో భాగంగా ఈ ఫీచ‌ర్‌ను ఎనేబుల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అప్‌డేట్ పొందిన యూజర్లు యాప్‌లోని కాలింగ్ బటన్ పై క్లిక్ చేయటం ద్వారా 'Voice', 'Video' కాలింగ్ ఆప్షన్స్ కనిపిస్తాయి.

వాట్సాప్ వీడియో కాలింగ్ ఫీచర్ వచ్చేసింది

Read More : మోటో జీ4, మోటో జీ4 ప్లస్ ఫోన్‌లకు 'Nougat'

వాటిలో వీడియో కాలింగ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా వీడియో కాల్స్ చేసుకోగలుగుతారు. ఈ ఆప్షన్ ద్వారానే ఫ్రంట్ అలానే రేర్ కెమెరాలో మారొచ్చు. కాల్‌ను మ్యూట్‌లో కూడా ఉంచుకోవచ్చు. ప్రస్తుతం విండోస్ ఫోన్‌లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ అలానే ఐఓఎస్ యాప్స్‌కు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దాని పై ఇంకా స్పష్టత లేదు. త్వరలోనే ఈ అప్‌డేట్ ఉండొచ్చని తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

5 సరికొత్త కెమెరా ఫీచర్లు..

ఇటీవల వాట్సాప్ తన ఆండ్రాయిడ్ యూజర్ల కోసం 5 సరికొత్త కెమెరా ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్స్ ద్వారా యూజర్లు తామ వాట్సాప్ అకౌంట్ ద్వారా షేర్ చేయబోయే ఫోటోస్ అలానే వీడియోస్‌ను కావల్సిన విధంగా ఎడిట్ చేసుకునే అవకాశముంటుంది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి లేటెస్ట్ వర్షన్ వాట్సాప్ యాప్‌ను పొందటం ద్వారా కొత్త ఫీచర్లను ఆస్వాదించవచ్చు. వాట్సాప్ ఆఫర్ చేస్తున్న కొత్త ఫీచర్లను పరిశీలించినట్లయితే...

వీడియోస్ పై చ్చిన టెక్స్ట్‌

వాట్సాప్ తీసుకువచ్చిన తాజా అప్‌డేట్‌లో భాగంగా యూజర్లు షేర్ చేయబోయే ఫోటోస్ అలానే వీడియోస్ పై మీకు నచ్చిన టెక్స్ట్‌ను రాయటంతో పాటు బొమ్మలను కూడా గీసే అవకాశాన్ని కల్పించారు. వీటి పై emojis కూడా యాడ్ చేసుకోవచ్చు.

న్యూ జూమ్ ఫీచర్..

వాట్సాప్ తీసుకువచ్చిన తాజా అప్‌డేట్‌లో న్యూ జూమ్ ఫీచర్ కూడా ఒకటి. ఈ ఫీచర్ ద్వారా చాలా దూరంలో కనిపించే దృశ్యాలను వీడియో లేదా ఫోటో రూపంలో క్యాప్చర్ చేయవచ్చు. మీ వేలును పైకి క్రిందకు జరపటం ద్వారా జామ్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. డబల్ ట్యాప్ చేయటం ప్రంట్ర అలారే రేర్ ఫేసింగ్ కెమెరాల మధ్య స్విచ్ కావొచ్చు.

ఎడిటింగ్ టూల్స్..

వాట్సాప్ తీసుకువచ్చిన రీసెంట్ అప్‌డేట్స్‌లో ఎడిటింగ్ టూల్స్ ఒకటి. ఈ ఫీచర్ ద్వారా మీరు పంపే ఫోటోస్ అలానే వీడియోలకు అదనపు హంగులను జోడించవచ్చు. ఫోటల పై మీకు నచ్చిన టెక్స్ట్‌ను యాడ్ చేయటం, ఫాంట్ స్టైల్ మార్చటం, వివిధ రంగలను అప్లై చేయటం వంటి ఈ ఎడిటింగ్ టూల్ ద్వారా సాధ్యమవుతాయి.

GIF ఫోటోలను చాట్ conversations ద్వారా..

వాట్సాప్ తీసుకువచ్చిన తాజా అప్‌డేట్‌లో భాగంగా ఆండ్రాయిడ్ యూజర్లు ఇప్పుడు GIF ఫోటోలను చాట్ conversations ద్వారా పంపుకునే అవకాశం ఉంటుంది. టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే అటాచ్‌మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేయటం ద్వారా GIF ఫైల్ ను పంపుకునే అవకాశం ఉంటుంది.

Selfie flash

వాట్సాప్ తన ఆండ్రాయిడ్ యూజర్ల కోసం Selfie flash పేరుతో సరికొత్త అప్‌డేట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింటి. ఈ టూల్ ద్వారా యూజర్లు తక్కువ వెళుతరులోనూ నాణ్యమైన సెల్ఫీలను చిత్రీకరించుకోగలుగుతారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp starts rolling out video-calling feature. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot