Home
Apps

మెటా నుంచి యూజర్లకు గుడ్‌న్యూస్‌.. వాట్సాప్ స్టేటస్‌ ఆ యాప్స్‌లోనూ కనిపిస్తుంది..!

మెటా సంస్థ వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. మెటా అకౌంట్స్‌ సెంటర్‌ (Meta Account Center) నుంచి ఈ సోషల్‌ మీడియా అకౌంట్స్‌ ను లింక్‌ చేసుకొనేందుకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. దీని ద్వారా వాట్సాప్‌ స్టేటస్‌ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ షేర్‌ చేసుకొనేందుకు అవకాశం ఉందని తెలిపింది. ఈ కొత్త నిర్ణయం యూజర్‌ అనుభూతిని మరింత మెరుగుపరుస్తుందని మెటా చెబుతోంది. అయితే ఈ ఫీచర్‌ ఆప్షనల్‌గా ఉంటుందని మెటా తెలిపింది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను ఇంటిగ్రేట్‌ చేయాలా వద్దా అనేది యూజర్ల నిర్ణయమని పేర్కొంది.

ఒకే చోట సైన్‌ ఇన్‌, స్టిక్కర్స్‌ :
వాట్సాప్‌ స్టేటస్‌ అప్‌డేట్స్ (Whatsapp) ఏయే ప్లాట్‌ఫాంల ద్వారా షేర్‌ చేయాలో యూజర్ల నిర్ణయమని, ఇంటిగ్రేట్‌ చేయకుండా నేరుగా స్టేటస్‌ అప్‌డేట్‌ చేసుకొనేందుకు కూడా అవకాశం ఉందని పేర్కొంది. ఈ మూడు ప్లాట్‌ఫాంలను ఒకే చోట సైన్‌- ఇన్‌ చేసే విధంగా ఫీచర్‌ను తీసుకురానున్నారు. దీంతోపాటు స్టిక్కర్స్‌ సహా ఇతర ఇమేజ్‌లను ఈ మూడు యాప్స్‌ కోసం వినియోగించుకొనే అవకాశం కల్పించనున్నారు.

Whatsapp status can be shared

మూడు యాప్స్‌ను ఇంటిగ్రేట్‌ చేయవచ్చు :
మెటాకు చెందిన వాట్సాప్‌, ఇన్‌స్టా (instagram), ఫేస్‌బుక్‌ను (Facebook) ఇంటిగ్రేట్‌ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నట్లు చెబుతున్నా.. యూజర్ల ప్రైవసీకి ఎటువంటి ఇబ్బంది రాదని చెబుతోంది. వాట్సాప్‌ అకౌంట్‌ తో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ కనెక్ట్‌ చేసినా... మెసేజ్‌, కాల్స్‌కు ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్ భద్రత ఉంటుందని తెలిపింది.

ఇటీవలే కొత్త అప్‌డేట్‌ :
వాట్సాప్‌ స్టేటస్‌ను మరింత ఆకట్టుకొనేలా చేసేందుకు మ్యూజిక్‌ ట్రాక్‌ను జతచేసే ఫీచర్‌ను ప్రస్తుతం టెస్టింగ్ చేస్తోంది. వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ WABetainfo ఈ వివరాలను వెల్లడించింది. ఆండ్రాయిడ్‌ వాట్సాప్‌ బీటా 2.25.2.5 అప్‌డేట్‌లో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంటుంది. వాట్సాప్‌ Music for Status Updates పేరుతో కొత్త ఫీచర్‌ విడుదల కానుంది.

త్వరలో అందుబాటులోకి రానున్న ఈ కొత్త ఫీచర్‌.. ఓ ప్రత్యేకమైన బటన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీని ద్వారా మ్యూజిక్‌ ట్రాక్‌ను జతచేయవచ్చు. ఇందుకోసం వాట్సాప్‌ ట్రెండింగ్‌ మ్యూజిక్‌ ట్రాక్‌లతో ప్రత్యేక లైబ్రరీని అందుబాటులోకి తీసుకొస్తుందని తెలుస్తోంది. ఫోటో స్టోరీని కోసం గరిష్ఠంగా 15 సెకన్ల వరకు మ్యూజిక్‌ ట్రాక్‌ను యాడ్‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌, iOS యూజర్‌లకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లోనూ :
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ 'ఎడిట్స్‌' పేరుతో కొత్త వీడియో ఎడిటింగ్‌ యాప్‌ను పరిచయం చేసింది. క్రియేటర్‌లకు క్రియేటివ్‌ సూట్‌గా పనికొస్తుందని తెలిపింది. హై క్వాలిటీ కెమెరా, అడ్వాన్స్‌డ్‌ ఎడిటింగ్ టూల్స్‌ సహా క్రియేటర్‌లు తమ ఐడియాలను షేర్‌ చేసుకొనేందుకు ప్రత్యేక ట్యా్‌బ్‌ను కలిగి ఉంటుంది.

ఈ ఎడిట్‌ యాప్‌ ద్వారా ఎక్స్‌పోర్ట్‌ చేసుకొనే వీడియోలకు ఎటువంటి వాటర్‌మార్క్‌లు ఉండవని ఇన్‌స్టాగ్రామ్‌ తెలిపింది. ప్రస్తుతం iOS యూజర్‌లకు ప్రీ ఆర్డర్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. అయితే ఆండ్రాయిడ్‌ ఫోన్‌కు అందుబాటులో ఉండనుంది. స్మార్ట్‌ఫోన్స్‌లో వర్టికల్‌ వీడియోలను ఎడిట్‌ చేసుకొనేందుకు అనువుగా ఉంటుందని తెలిపింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Whatsapp status can be shared at facebook and instagram apps soon in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X