ఈ ఫోన్లకు వాట్సప్ సేవలు బంద్, మీ ఫోన్ చెక్ చేసుకోండి !

Written By:

ఇప్పుడు ఇన్‌స్టంట్ మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న యాప్ ఏది అంటే ఎవరైనా టక్కున చెప్పే సమాధానం వాట్సప్..ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తన వినియోగదారులకు అందిస్తూ తనకు పోటీ ఏదీ లేదని సగర్వంగా చాటి చెబుతూ ముందుకు దూసుకుపోతోంది. అయితే వాట్సప్ సేవలు కొన్ని ఫోన్లలో నిలిచిపోనున్నాయి. త్వరలో కొన్ని ఫోన్లలో మాత్రం వాట్సాప్ పనిచేయకుండా వాటికి సపోర్ట్‌ను నిలిపివేయనుందని తెలుస్తోంది.

LG సిగ్నేచర్ ఎడిషన్‌, వణుకుపుట్టిస్తోన్న స్మార్ట్‌ఫోన్ ధర !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిసెంబర్ 31, 2017 లాస్ట్..

డిసెంబర్ 31, 2017 దాటితే బ్లాక్‌బెర్రీ ఓఎస్, బ్లాక్‌బెర్రీ 10 ఓఎస్ ఉన్న ఫోన్లలో, విండోస్ ఫోన్ 8.0 ఓఎస్ ఉన్న ఫోన్లలో వాట్సప్ ఇక పనిచేయదు.

నోకియా ఎస్40 ..

అలాగే వచ్చే ఏడాది డిసెంబర్ 31 నాటికి నోకియా ఎస్40 ఓఎస్ ఉన్న ఫోన్లలో సేవలు ఆగిపోతున్నాయి.

ఆండ్రాయిడ్ 2.3.7 ఓఎస్..

2020 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ఆండ్రాయిడ్ 2.3.7 ఓఎస్ ఉన్న ఫోన్లలోనూ వాట్సప్ పనిచేయదు.

కొత్త ఫోన్లకు అప్‌గ్రేడ్ అయితే ..

కనుక ఈ ఓఎస్ ఉన్న ఫోన్లను వాడేవారు కొత్త ఫోన్లకు అప్‌గ్రేడ్ అయితే వాట్సప్ సేవలను ఎలాంటి ఆటంకం లేకుండా పొందేందుకు వీలుంటుంది.

బగ్స్ ఫిక్స్..

ఈ ఫోన్లకు ఎటువంటి అప్‌డేట్ కాని అలాగే బగ్స్ ఫిక్స్ చేయడం కాని జరగదని వాట్సప్ తెలిపింది. అలాగే కొత్త ఫీచర్ల అప్‌డేట్లు ఈ ఫోన్లకి పనిచేయవని తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp is about to STOP working on these phones - do YOU need to upgrade Read more News at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot