Home
Apps

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఫేస్‌బుక్‌ కవర్‌ ఫోటో తరహాలో.. ఎప్పుడు విడుదల కానుంది?

ప్రముఖ మెసేజింగ్‌ ప్లాట్‌ఫాం వాట్సాప్‌ (Whatsapp) ఇటీవల కాలంలో అనేక ఫీచర్‌లను యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో యూజర్ల సౌకర్యం కొన్ని కొన్ని ఫీచర్లు, భద్రత కోసం మరికొన్ని ఫీచర్లను తీసుకొస్తోంది. ఇటీవలే కొత్త నంబర్లతో వచ్చే మెసేజ్‌లకు లిమిట్‌ విధించే ఫీచర్‌ ను అభివృద్ధి చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతోపాటు ఇటీవలే వాట్సాప్ మెసేజ్‌ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ ను కూడా తీసుకొచ్చింది. వీటితోపాటు యూజర్‌ నేమ్‌ ఫీచర్‌ ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిసింది.

ఫేస్‌బుక్‌ తరహాలో వాట్సాప్‌ కొత్త ఫీచర్‌! :
అయితే తాజాగా మరో ఫీచర్‌ ను వాట్సాప్‌ టెస్టింగ్‌ చేస్తోందని తెలిసింది. దీని ద్వారా యూజర్‌ ను మరింత ఆకట్టుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ ఫోటో ఫీచర్‌ ఫేస్‌బుక్‌ లో ఉంది. ఈ ఫీచర్‌ యూజర్లకు ఎలా పనికొస్తుందో తెలుసుకుందాం.

Whatsapp testing cover photo feature

వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్ :
వాట్సాప్ ప్రస్తుతం టెస్టింగ్‌ చేస్తోన్న ఫోటో ఫీచర్‌ ద్వారా ఫేస్‌బుక్‌ తరహాలో వాట్సాప్‌ యూజర్లు ప్రొఫైల్‌ ఫోటోతోపాటు కవర్‌ ఫోటోను జతచేసేందుకు (Add) అవకాశం ఉంటుంది. వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ WABetainfo ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి.

ప్రస్తుతం టెస్టింగ్ దశలో :
ప్రస్తుతం ఈ ఫోటో ఫీచర్‌ వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌ బీటా 2.25.32.2 వెర్షన్‌ లో ఉంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఫీచర్‌ ను త్వరలోనే విడుదల కానుంది. అయితే ఇప్పటికే కొన్ని వాట్సాప్‌ బిజినెస్‌ అకౌంట్స్‌లో కొన్నింటికి ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్‌, లింక్డిన్‌ కవర్‌ ఫోటో తరహాలో ఉంటుంది.

ఈ కొత్త ఫీచర్‌లో :
ఈ కవర్‌ ఫోటో కూడా ఎవరికి కనిపించాలి, ఎవరికి కనిపించవద్దు అనే ఆప్షన్‌ లు ఉంటాయి. ప్రొఫైల్, స్టేటస్‌ అప్‌డేట్స్‌ తరహాలోనే మార్చుకొనేందుకు అవకాశం ఉంటుంది. Everyone, My Contacts, Nobody వంటి మూడు ఆప్షన్‌ లు ఉంటాయి. మీ ప్రాధాన్యతల ఆధారంగా సెలెక్ట్ చేసుకోవచ్చు.

ఇటీవలే కొత్త ఫీచర్‌ గురించి లీక్స్ :
వాట్సాప్‌లో స్పామ్‌ సహా ఇతర అవసరం లేని మెసేజ్‌లను కట్టడి చేసేందుకు వీలుగా కొత్త ఫీచర్‌ ను తీసుకొస్తున్నట్లు ఇటీవల లీక్స్‌ వచ్చాయి. కొత్త నంబర్‌ల నుంచి పరిమితికి మించే వచ్చే మెసేజ్‌లను ఈ ఫీచర్‌ నియంత్రిస్తుంది. వాట్సాప్ యూజర్‌ స్పందించేంత వరకు మెసేజ్‌లు ఆటోమేటిక్‌ గా బ్లాక్‌ అవుతాయి.

ఉదాహరణకు వాట్సాప్‌ లో కొత్త నంబర్‌ నుంచి మీకు మెసేజ్‌ వచ్చింది అనుకుందాం. ఆ మెసేజ్‌లను నిర్ణీత సమయంలోగా మీరు చూడకుంటే, ఆ నంబర్‌ నుంచి మరిన్ని మెసేజ్‌లు రాకుండా వాట్సాప్ లో త్వరలో రానున్న కొత్త ఫీచర్‌ కట్టడి చేస్తుంది.

దీంతో స్పామ్ లేదా ఇతర అవసరం లేని మెసేజ్‌లను నియంత్రించేందుకు యూజర్లకు అవకాశం ఉంటుంది. ఈ వివరాలు ఇటీవల TechCrunch ద్వారా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ ఫీచర్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే వివరాలు వెల్లడి కాలేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
Whatsapp testing cover photo feature, which is like in facebook full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X