వాట్సాప్‌లో సూపర్ ఫీచర్.. వాయిస్ నోట్‌ను టెక్ట్స్ రూపంలోకి మార్చుకోవచ్చు.!
మెటా నేతృత్వంలోని వాట్సాప్ సంస్థ (Whatsapp New Features) తన వినియోగదారుల సౌకర్యం, భద్రత కోసం ఇటీవల కాలంలో అనేక ఫీచర్లను విడుదల చేస్తోంది. తాజాగా కీలక ఫీచర్‌ను లాంచ్ చేస్తోంది. ఈ ఫీచర్ వాయిస్ నోట్‌ను టెక్ట్స్ ఫార్మాట్‌లో మార్చుకొనేందుకు సాయం చేస్తుంది. వాయిస్‌ను ప్లే చేయకుండానే టెక్స్ట్‌లోకి మార్చుకొనే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
ప్రస్తుతం iOS యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా వచ్చే అవకాశం ఉంది. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WAbetainfo ఆధారంగా ఇటీవలే ఈ ఫీచర్ లాంచ్ చేసినట్లు తెలిసింది. ఆడియో నోట్ ప్లే చేయలేదని సమయాలు సహా ఇతర సందర్భాల్లో ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.24.7.8 ప్రస్తుతం ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ వెర్షన్‌ను వినియోగిస్తున్నవారు వాయిస్ నోట్‌ను టెక్ట్స్ రూపంలో (whatsapp voice messages can be converted into text) మార్చుకోవచ్చు. ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్‌లో భాగంగా వినియోగదారుల ప్రైవసీ కాపాడేందుకు డివైస్‌లోనే ట్రాన్‌స్క్రిప్ట్‌ను రూపొందించనుంది.
ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వచ్చినప్పుడు సుమారు 150MB యాప్ డేటాను డౌన్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఫీచర్ కొన్నిసార్లు డిఫాల్ట్‌గా అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. లేకుంటే వినియోగదారులు స్వయంగా ఆన్ (ఎనేబుల్) చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ సమయంలో Read Before You Listen అనే నోటిఫికేషన్ కనిపిస్తుంది.
ప్రస్తుతం వాట్సాప్ వాయిస్ నోట్ నుంచి టెక్ట్స్‌గా మార్చే ఫీచర్.. టెస్టింగ్ దశలోనే ఉందని తెలుస్తోంది. మరియు కొంత మంది ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉందని సమాచారం. త్వరలోనే ఈ ఫీచర్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
* వాట్సాప్ చాట్ లిస్ట్ నుంచే యూపీఐ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ కొంతమంది ఆండ్రాయిడ్ బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంది. ఈ మేరకు వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ వెల్లడించింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక యూజర్లు సులభంగా పేమెంట్లు చేయగలుగుతారు.
అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ కొంత మంది ఆండ్రాయిడ్ బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉండగా.. త్వరలో వినియోగదారులు అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ UPI ను అధికంగా వినియోగించే భారత్‌లో ఉపయోగపడనుంది. ఫలితంగా స్మార్ట్‌ఫోన్ల ద్వారా యూపీఐ లావాదేవీల వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.
* దీంతోపాటు వినియోగదారులకు మరింత భద్రతను కల్పించేందుకు ఇటీవల వాట్సాప్ మరో ఫీచర్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా వాట్సాప్ ప్రొఫైల్‌లను స్క్రీన్‌షాట్ తీసే అవకాశం ఉండదు. ఎవరైనా వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోను స్క్రీన్‌షాట్ తీసేందుకు ప్రయత్నం చేస్తే.. వ్యక్తిగత సమాచారం కారణంగా స్క్రీన్‌షాట్ తీసేందుకు అనుమతి లేదనే పాప్‌అప్ వస్తోంది.
అనేక మంది వాట్సాప్ వినియోగదారులు ముఖ్యంగా మహిళలు తమ ఫొటోలను వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోలుగా పెట్టుకొనేందుకు ఆసక్తి ఉన్నా.. వివిధ భద్రతా కారణాల రీత్యా వెనక్కి తగ్గుతున్నారు. ఆయా ఫోటోలను స్క్రీన్‌షాట్ తీసి చెడు మార్గాల్లో వినియోగిస్తారనే ఆందోళనతో వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోలుగా (DP) తమ ఫొటోలను వినియోగించడం లేదు. తాజాగా విడుదలైన ఫీచర్‌తో ఆ ఆందోళనలకు చెక్ పెట్టినట్లు అయింది.


Click it and Unblock the Notifications








