వాట్సాప్‌లో Recently Online ఫీచర్.. ఎమర్జెన్సీ సమయంలో ఎలా పనిచేస్తుంది..?
మెటా నేతృత్వంలోని ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ (Whatsapp) ఇటీవల కాలంలో వినియోగదారుల సౌకర్యం కోసం మరియు మరింత మెరుగైన అనుభూతిని కలిగించేందుకు కీలక ఫీచర్లను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా వాట్సాప్ యూజర్ ఇంటర్‌ఫేస్‌లోనూ ఇటీవల మార్పులు చేసింది. మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ మెటా AI ను అందుబాటులోకి తీసుకొస్తోంది.
వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo ఆధారంగా వాట్సాప్ ఆసక్తికర ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. అయితే ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే.. ఏదైనా అత్యవసర సమయంలో వాట్సాప్‌లో ఉన్న తమ ఫ్రెండ్ లేదా సన్నిహితులు యాక్టివ్‌గా ఉన్నారా లేదా అని తనిఖీ చేసేందుకు ప్రతీ యూజర్ చాట్‌లోకి వెళ్లి Last seen ను పరిశీలిస్తాం. లేదా ఆన్‌లైన్‌లో ఉన్నారా లేదా అని తనిఖీ చేస్తాం.

అయితే ఎక్కువ మంది యూజర్ల వివరాల కోసం ప్రతి ఒక్కరి చాట్‌లోకి వెళ్లి ఇలాంటి తనిఖీలు చేయాలి. ఈ ప్రక్రియను మరింత సులభంగా చేసేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వాట్సాప్ వినియోగదారులు తాజాగా వాట్సాప్‌ను ఎవరు యాక్టివ్‌గా ఉన్నారో జాబితా రూపంలో చూడవచ్చు.
ఈ ఫీచర్ 'Recently online' పేరుతో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ ఫీచర్ ఎంపిక చేసుకున్న కొన్ని కాంటాక్ట్‌లను మాత్రమే ఈ జాబితాలో చూపిస్తుందని తెలుస్తోంది. అయితే వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని Last seen మరియు Online Status వివరాలను ఈ జాబితాలో చూపించదని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ Whatsapp Recently Online Feature కొంత మంది బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉందని తెలుస్తోంది. అయితే త్వరనే మిగిలిన వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఫీచర్ పనితీరుపై పూర్తి వివరాలు అందుబాటులోకి రావాల్సి ఉంది.
** వెబ్ వెర్షన్‌లోనూ (Whatsapp Web) ఇదే తరహా మార్పులు చేస్తోందని తెలుస్తోంది. కొత్తగా చేస్తున్న మార్పులతో నావిగేషన్ మెరుగుపడుతుందని తెలుస్తోంది. వెబ్ వెర్షన్‌లో నావిగేషన్ ఎడమ వైపున కనిపించనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ కొంత మంది బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ వెబ్ బీటా 2.3000.1012734542 అప్‌డేట్‌లో ఉంది.
ఈ ఫీచర్ త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గత సెప్టెంబర్ లోనూ ఇదే తరహా ఫీచర్‌ను వాట్సాప్ టెస్టింగ్ చేసింది. అయితే తాజాగా అందుబాటులోకి రానున్న డిజైన్ వాట్సాప్ వెబ్‌ను సులభంగా వినియోగించుకోవచ్చని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను WAbetainfo షేర్ చేసింది.
చాట్, కమ్యూనిటీ, ఛానల్స్, స్టేటస్ సహా ఇతర అన్ని ఐకాన్ పొజిషన్‌లో వచ్చిన మార్పును ఈ స్క్రీన్ షాట్‌లో గుర్తించవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉండగా.. త్వరలోనే అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. మరియు మెరుగైన అనుభూతిని కలిగిస్తుందని తెలుస్తోంది.
వాట్సాప్ లో కొత్తగా జనరేటివ్ AI ఫీచర్ విడుదల అవుతోంది. మెటా AI చాట్‌బాట్‌ను వాట్సాప్ వినియోగదారులు వినియోగించుకోవచ్చు. ఇప్పటికే కొంత మంది యూజర్లకు ఈ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ మెటా AI.. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆధారంగా రూపొందించారు.
మెటా కనెక్ట్ 2023 కార్యక్రమంలో మెటా సంస్థ ఈ ఏఐ మోడల్‌ను ప్రకటించింది. అప్పటి నుంచి ఈ మెటా AI ని వాట్సాప్‌లో ఇంటిగ్రేషన్ కోసం అనేక మంది యూజర్లు ఎదురుచూస్తున్నారు. వాట్సాప్‌లో చాట్ జాబితాకు కుడి వైపున కొత్త గుర్తు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంగ్లీష్‌కు మాత్రమే సపోర్టు చేస్తోంది.


Click it and Unblock the Notifications