వాట్సప్ నుంచి మరో రెండు కళ్లు చెదిరే ఫీచర్లు వస్తున్నాయ్ !
యాప్‌ల రారాజు వాట్సప్ మరో రెండు అద్భుత ఫీచర్లను వినియోగదారులకు కానుకగా ఇవ్వబోతోంది.
యాప్‌ల రారాజు వాట్సప్ మరో రెండు అద్భుత ఫీచర్లను వినియోగదారులకు కానుకగా ఇవ్వబోతోంది. ఇప్పటికే అనేక రకాల ఫీచర్లతో దూసుకుపోతున్న వాట్సప్ ఈ సారి కళ్లు చెదిరే ఫీచర్లతో దూసుకువస్తుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్లు అతి త్వరలో వినియోగదారులను అలరించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ రెండు కొత్త ఫీచర్లపై వాట్సప్ పనిచేస్తోందని వాట్సాప్ బీటా వాచర్ డబ్ల్యూఏబీటాఇన్ఫో రిపోర్టు చేసింది.

మొదటి ఫీచర్
ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ కాల్ మధ్యలో ఉండగానే అటు వీడియో కాల్‌కు కానీ, ఇటు వాయస్ కాల్‌కు కానీ స్విచ్ అవొచ్చు. మీరు వీడియో కాల్ చేసినా అది తరువాత వాయిస్ కాల్ కు మార్చుకునే అవకాశం ఉంది.

వీడియో-వాయిస్ కాల్ యాప్
అయితే వీడియో-వాయిస్ కాల్ యాప్ స్విచ్, తొలుత జూలైలోనే టెస్టింగ్‌కు వచ్చింది. కాగా ఇప్పుడు ఈ ఫీచర్‌ను అంతర్గతంగా మాత్రమే టెస్ట్ చేయడం ప్రారంభించారని డబ్ల్యూఏబీటాఇన్ఫో రిపోర్టు చేసింది.

రెండో ఫీచర్
మరింత తేలికగా వాయిస్ మెసేజ్‌ను రికార్డు చేయడం. ఎవరి కాల్స్ కి అయినా వాయిస్ మెసేజ్ పంపాలంటే ఈ ఫీచర్ ద్వారా అతి తేలికగా పంపవచ్చు.

వాయిస్ మెసేజ్‌ను రికార్డు చేయడం..
యూజర్లు వాయిస్ మెసేజ్‌ను రికార్డు చేయడం ప్రారంభించిన అనంతరం ఓ టోగుల్ కనిపిస్తుంది. ఈ టోగుల్ ద్వారా వాయిస్ మెసేజ్ రికార్డింగ్‌ను లాక్‌చేయొచ్చు. దీంతో మెసేజ్ రికార్డు చేసేటప్పుడు యూజర్ తమ హ్యాండ్‌ను ఫ్రీగా ఉంచుకోవచ్చు.



Click it and Unblock the Notifications








