వాట్సాప్ నుంచి మరో అద్భుత ఫీచర్
మెసేజింగ్ మాధ్యమంలో విపరీతంగా దూసుకుపోతున్న వాట్సాప్, ఎప్పడికప్పుడు సరికొత్త ఫీచర్లతో అలరిస్తూ ఉంది.‘ప్రివ్యూ’ పేరిట ఫీచర్ ను విడుదల చేయనుంది.
మెసేజింగ్ మాధ్యమంలో విపరీతంగా దూసుకుపోతున్న వాట్సాప్, ఎప్పడికప్పుడు సరికొత్త ఫీచర్లతో అలరిస్తూ ఉంది. ఇప్పుడు మరో సరికొత్త ఫీచరను అందుబాటులోకి తీసుకొని రానుంది.'ప్రివ్యూ' పేరిట ఫీచర్ ను విడుదల చేయనుంది.ప్రస్తుతం ఈ ఫీచర్ పరిశీలన ఉంది. త్వరలో ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. నేటి స్పెషల్ స్టోరీ లో భాగంగా 'ప్రివ్యూ' ఫీచర్ మరిన్ని విషయాలు మీకు తెలుపుతున్నాము.ఓ లుక్కేయండి

ఏదైనా మెసేజ్‌ని ఫార్వర్డ్ చేసేటప్పుడు....
మీరు ఏదైనా మెసేజ్‌ని ఫార్వర్డ్ చేసేటప్పుడు ఈ ఆఫ్షన్ ద్వారా మరోసారి దాన్ని ప్రివ్యూ చూసుకునే అవకాశం ఉంటుంది. మెసేజ్‌ని ప్రివ్యూ చేసే సమయంలో ఫార్వర్డ్ లిస్ట్ ను మార్చుకునే అవకాశం కూడా ఉంది. ఉన్నవారిలో ఎవరినైనా తొలగించే ఆప్షన్ కూడా ఇందులో ఉండనుంది. ఒకరికన్నా ఎక్కువ మందికి ఆ మెసేజ్‌ను పంపేటట్లయితే ఆ లిస్ట్లో నుంచి యూజర్లను తీసేయవచ్చు అవసరం అయితే మరికొందరికి యాడ్ చేయవచ్చు. కానీ, ఈ ఫీచర్ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందికి ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేసినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుందట.

మెసేజ్లు ,ఫొటోలు, వీడియోలు ఎలాంటి మెసేజ్‌నైనా పంపేముందు....
ఇక మెసేజ్లు ,ఫొటోలు, వీడియోలు, జిఫ్ ఇమేజ్‌లు, ఇలా ఎలాంటి మెసేజ్‌నైనా పంపేముందు ప్రివ్యూ చూసుకునే అవకాశాన్ని వాట్సాప్ కల్పించనుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పరిశీలిస్తున్నారు. త్వరలో యూజర్లకు అందుబాటులోకి తీసుకొని రానున్నారు .

‘ప్రైవేట్ రిప్లయి ’ ఫీచర్....
ఈ మధ్యనే వాట్సాప్ ‘ప్రైవేట్ రిప్లయి ' ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు ఇక పై ప్రైవేట్ రిప్లయి ఇచ్చుకోవచ్చు. ఇతరులు ఎవరూ దానిని చూడకుండా మీరు ప్రైవసీగా ఉంచుకోవచ్చు. ఈ బీటా వర్షన్ ఆండ్రాయిడ్ ఫోన్ లోని విండోస్లో లైవులోకి వచ్చింది. అయితే ఇది కేవలం కొద్ది సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఇది పూర్తి స్థాయిలో అతి త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

వాట్సప్ లీకులను అందించే సంస్థ...
వాట్సప్ లీకులను అందించే సంస్థ WABetaInfo ప్రకారం లేటెస్ట్ ఆండ్రాయిడ్ బీటా వర్షన్ 2.18.335 లో ఈ ప్రవేట్ రిప్లయి ఫీచర్ ఉంది . ఈ ఫీచర్ ద్వారా ఎవరైనా గ్రూపులోని వ్యక్తులకు గ్రూపులోనే ప్రైవేట్ మెసేజులు పంపుకునే అవకాశం ఉంది.

గ్రూపులో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది...
అయితే ఇప్పటికే గ్రూపులో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.అయితే ఈ కొత్త ఫీచర్ ద్వారా మీరు నేరుగాగ్రూపు నుంచే అతనికి పర్సనల్ ఛాట్ ద్వారా రిప్లయి ఇవ్వవచ్చు. ఇతరులకు ఏ మాత్రం అనుమానం రాకుండా గ్రూపులోనే మీరు అనుకున్నవారికి మెసేజులు పంపుకోవచ్చు. వచ్చినవాటికి రిప్లయి ఇవ్వవచ్చు.

ఫీచర్ చాలా లాంగ్ ప్రాసెస్ మీద ఉంటుంది...
ఈ ఫీచర్ చాలా లాంగ్ ప్రాసెస్ మీద ఉంటుంది. యూజర్లు ఏదైనా గ్రూపులో ఉన్నప్పుడు రైట్ కార్నర్ దగ్గర మూడు ఆప్షన్లు తో కూడిన విండో ఓపెన్ చేయాలి. అందులో ఓ ఆప్సన్ రిప్లయి ప్రైవేట్ ఫీచర్ అని ఉంటుంది. దాని ద్వారా నేరుగా మీరు ఇతరులకు మెసేజ్ పంపుకోవచ్చు.

చాటింగ్ మొత్తాన్ని మీరు నేరుగా చూసుకోవచ్చు...
ఈ చాటింగ్ మొత్తాన్ని మీరు నేరుగా చూసుకోవచ్చు. individual reply గ్రూపులోనే ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త private reply feature నేరుగా కాంటాక్ట్ లోకి మిమ్మలల్ని తీసుకువెళుతుంది.


Click it and Unblock the Notifications








