వాట్సప్‌లోకి అలర్ట్ ఐకాన్‌ పేరుతో మరో అద్భుత ఫీచర్

మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యప్ వాట్సప్‌లో మరో అద్భుతమైన ఫీచర్ రాబోతోంది.

|

మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యప్ వాట్సప్‌లో మరో అద్భుతమైన ఫీచర్ రాబోతోంది. సస్పిషియస్ లింక్ డిటెక్షన్ పేరిట ఈ ఫీచర్ వినియోగదారులను అలరించబోతోంది. ఆ ఫీచర్ సహాయంతో వాట్సప్ వినియోగదారులు తమకు వచ్చే మెసేజ్‌లలో ఉండే లింక్‌లు అసలువేనా, నకిలీవా, వాటిని ఓపెన్ చేయడం ప్రమాదకరమా, కాదా అనే వివరాలు తెలుసుకోవచ్చు. సదరు లింక్‌లు నిజంగా ప్రమాదకరమైనవే అయితే అవి ఉన్న ఆ మెసేజ్‌లపై వాట్సప్ అలర్ట్ ఐకాన్‌ను చూపిస్తుంది. దీంతో వాట్సాప్ యూజర్లు సదరు మెసేజ్‌లో ఉన్న లింక్‌ను ఓపెన్ చేయకుండా జాగ్రత్త పడవచ్చు.

 

వాట్సాప్ యూజర్లు...ఈ సీక్రెట్స్ తెలుసుకోవాల్సిందే!వాట్సాప్ యూజర్లు...ఈ సీక్రెట్స్ తెలుసుకోవాల్సిందే!

పుట్టలు పుట్టలుగా నకిలీ మెసేజ్‌లు..

పుట్టలు పుట్టలుగా నకిలీ మెసేజ్‌లు..

సోషల్ మీడియాలో పుట్టలు పుట్టలుగా నకిలీ మెసేజ్‌లు ఫార్వార్డ్ అవుతున్నాయి. వాటిల్లో ఉండే లింక్‌లు కూడా చాలా వరకు ప్రమాదకరమైనవే ఉంటున్నాయి. వాటి వల్ల యూజర్ల వ్యక్తిగత సమాచారానికి ముప్పు ఏర్పడుతున్నది. దీన్ని నివారించేందుకే వాట్సప్ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది.

సస్పిషియస్ లింక్ డిటెక్షన్

సస్పిషియస్ లింక్ డిటెక్షన్

వాట్సప్ విడుదల చేయనున్న సస్పిషియస్ లింక్ డిటెక్షన్ ఫీచర్‌ను ప్రస్తుతం అంతర్గతంగా పరిశీలిస్తున్నారు. పలు ఎంపిక చేసిన బీటా యూజర్లకు ఈ ఫీచర్ లభిస్తున్నది. త్వరలోనే వాట్సప్ యూజర్లందరికీ ఈ ఫీచర్ లభ్యం కానుంది.

స్ర్కీన్ ఆఫ్ సమయంలో నోటిఫికేషన్లు పాపప్ కావాలంటే..?
 

స్ర్కీన్ ఆఫ్ సమయంలో నోటిఫికేషన్లు పాపప్ కావాలంటే..?

వాట్సప్ మెసేజ్ అందిన ప్రతిసారి ఫోన్ ను అన్ లాక్ చేయవల్సి వస్తుందా..? ఈ సమస్యకు వాట్సాప్ చక్కటి పరిష్కారం చూపుతోంది. ఫోన్ లాక్ చేసిన ఉన్నప్పటికి వాట్సాప్ మెసేజ్లను చూసేందుకు ఇలా చేయండి. సెట్టింగ్స్ లోకి వెళ్లి Notifications > Popup Notifications > Only When Screen Off.

మెసేజ్ ను బుక్క్ మార్క్ చేయదలచినట్లయితే

మెసేజ్ ను బుక్క్ మార్క్ చేయదలచినట్లయితే

బుక్ మార్క్ చేయాలనుకుంటున్న మెసేజ్ పై టాప్ చేసి కొద్ది సేపు ఉంచండి. అప్పుడు, టాప్ బార్ పై delete, copy, forward అలానే star iconలు కనిపిస్తాయి. వాటిలో స్టార్ ఐకాన్ పై టాప్ చేసినట్లయితే మెసేజ్ బుక్ మార్క్ కాబడుతుంది.

ఈమెయిల్ కు పంపుకోవటం..

ఈమెయిల్ కు పంపుకోవటం..

మీ వాట్సాప్ సంభాషణలను అనేక రకాలుగా బ్యాకప్ చేసుకునే వీలుంది. ఉదాహరణకు మీ వాట్సప్ మేసేజ్‌లను ఈమెయిల్‌లో బ్యాకప్ చేసుకోవాలనుకుంటున్నారు..? అయితే ఇలా ట్రై చేయండి.. ముందుగా మీరు బ్యాకప్ చేయాలనుకుంటున్న పర్సనల్ లేదా గ్రూప్ చాట్ పై టాప్ చేయండి. ఇప్పుడు మీకు అనేక ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో email chat పై టాప్ చేయండి. ఇప్పుడు కోరుకుంటున్న conversation మొత్తం మీ ఈ మెయిల్ అడ్రస్ లోకి సెండ్ కాబడుతుంది.

డీఫాల్ట్‌ బ్యాక్‌గ్రౌండ్‌

డీఫాల్ట్‌ బ్యాక్‌గ్రౌండ్‌

మీ వాట్సాప్ అకౌంట్‌కు డీఫాల్ట్‌గా వచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ను చూసి బోర్‌గా ఫీలవుతున్నారా..? అయితే మీకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌తో వాట్సాప్‌ను తీర్చిదిద్దండి. ఇలా చేయాలంటే స్ర్కీన్ కుడివైపు పై భాగంలో కనిపించే మూడు నిలువు చుక్కల పై టాప్ చేయండి. ఇప్పుడు మీకు సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. సెట్టింగ్స్‌లోకి వెళ్లినట్లయితే మీకు వాల్ పేపర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ లోకి వెళ్లినట్లయితే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. వాటిలో మీకు నచ్చిన ఫోటోను బ్యాక్ గ్రౌండ్ గా సెట్ చేసుకోవచ్చు.

షార్ట్ కట్

షార్ట్ కట్

మీ వాట్సాప్ అకౌంట్ లోని కాంటాక్ట్స్ కు షార్ట్ కట్ లను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే, ఇలా చేయండి. షార్ట్ కట్ ను ఏర్పాటు చేయాలనుకుంటున్న కాంటాక్ట్ పై టాప్ చేయండి. ఇప్పుడు అనేక ఆప్షన్ప్ స్ర్కీన్ పై పాపప్ కాబడతాయి. వాటిలో మొదటి ఆప్షన్ అయిన ‘add chat shortcut'ను సెలక్ట్ చేసుకున్నట్లయితే మీ కాంటాక్ట్ కు షార్ట్ కట్ క్రియేట్ కాబడుతుంది.

Media auto-download

Media auto-download

వాట్సాప్ అకౌంట్‌లో నిత్యం అనేక మీడియా ఫైల్స్ షేర్ అవుతుంటాయి. వీటిని ఆటోమెటిక్‌గా మీ వాట్సాప్ అకౌంట్ డౌన్‌లోడ్ చేసుకుంటుంది.ఈ కారణంగా బోలెడంత మొబైల్ డేటా ఖర్చవుతుంటుంది. అయితే, ఈ డేటా ఖర్చును కంట్రోల్ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్ కల్పిస్తోంది. అకౌంట్ సెట్టింగ్స్ లో వెళ్లి Media auto-download ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవటం వల్ల మీకు నచ్చిన డేటాను మాత్రమే డౌన్ లోడ్ చేసుకునే వెసలబాటు ఉంటుంది.

వాట్సప్ వెబ్ ఫీచర్

వాట్సప్ వెబ్ ఫీచర్

వాట్సప్ వెబ్ ఫీచర్ అందుబాటులోకి రావటంతో వాట్సాప్ అకౌంట్‌లను డెస్క్‌టాప్ పీసీల పై హ్యాండిల్ చేయగలుగుతున్నాం. మీ వాట్సాప్ అకౌంట్, వాట్సాప్ వెబ్‌కు అనుసంధానించుకోవాలంటే ముందుగా మీ డెస్క్‌టాప్ వెబ్‌బ్రౌజర్‌లోని web.whatsapp.comలోకి వెళ్లండి. ఓ క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఇపుడు మీ ఫోన్ కుడి వైపు కార్నర్‌లో కనిపించే మూడు చుక్కలు పై క్లిక్ చేసి WhatsApp Web ఆప్షన్ ను సెలక్ట్ చేసుకుని క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేయండి. ఇలా చేయాలంటే తప్పనిసరిగా రెండు డివైజ్ లు ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉండాలి.

లాస్ట్ సీన్

లాస్ట్ సీన్

మీ వాట్సాప్ అకౌంట్‌లో లాస్ట్ సీన్ ఆప్షన్‌ను డిసేబుల్ చేయాలనుకుంటే Settings > Account > Privacy > Last Seen, and select ‘Nobody'

25 మంది మిత్రులకు ఒకేసారి బల్క్ సందేశాలను

25 మంది మిత్రులకు ఒకేసారి బల్క్ సందేశాలను

వాట్సాప్‌లో డీఫాల్ట్‌గా 25 మంది మిత్రులకు ఒకేసారి బల్క్ సందేశాలను పంపుకునే వీలుంది. మాన్యువల్‌గా కాపీ, పేస్ట్ చేసినట్లయితే 52 మందికి ఒకేసారి ఎస్ఎంఎస్‌ను షేర్ చేయవచ్చు.ముందుగా మీ వాట్సాప్ అప్లికేషన్‌లోని యాక్టివ్ చాట్స్ పేజీని ఓపెన్ చేయండి. ఆ తరువాత మెనూ సాఫ్ట్ ‘కీ'ని ప్రెస్ చేసి More option పై ట్యాప్ చేయండి.మోర్ ఆప్షన్ మెనూలోని Broadcast messageను సెలక్ట్ చేసుకోండి.తదుపరి చర్యలో భాగంగా మీరు ఎస్ఎంఎస్ పంపాలనకుంటున్న మిత్రల కాంటాక్ట్‌లను టిక్ మార్క్ చేయండి.ఇప్పుడు Broadcast message బాక్సులో ఎస్ఎంఎస్‌ను టైప్ చేసి సెండ్ బటన్ పై ప్రెస్ చేయండి. అవసరమనుకుంటే తరువాతి బ్యాచ్‌కు ఆ ఎస్ఎంఎస్‌ను పంపేందుకు కాపీ చేసుకోండి.వాట్సాప్ ద్వారా బల్క్ ఎస్ఎంఎస్‌లను పంపుకునే Broadcast message ఫీచర్ అన్ని ఫ్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేస్తుంది. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి చూడండి మరి.

బ్రౌజర్ క్లోజ్ చేసి ఉన్నప్పటికి

బ్రౌజర్ క్లోజ్ చేసి ఉన్నప్పటికి

వాట్సాప్ డెస్క్‌టాప్ నోటిఫికేషన్స్ క్రోమ్ ప్లగిన్‌ను ఇన్స్‌స్టాల్ చేసకోవటం ద్వారా మీ వాట్సాప్ అకౌంట్నో కు సంబంధించిన నోటిఫికేషన్‌‍లను డెస్క్‌టాప్ పై పొందవచ్చు. బ్రౌజర్ క్లోజ్ చేసి ఉన్నప్పటికి నోటిఫికేషన్ అలర్ట్స్ మీకు కనిపిస్తాయి.

Best Mobiles in India

English summary
WhatsApp tests ‘Suspicious Link Detection’ feature to curb fake news circulation: Report More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X