వాట్సప్‌లో ఈ ఫీచర్లు ఎలా వాడాలో తెలుసుకున్నారా ?

|

ఈ టెక్నాలజీ యుగంలో వాట్సప్ తెలియని జీవి ఉన్నాడంటే ఎవరూ నమ్మరు. చిన్న పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ వాట్సప్ కు ఎడిక్ట్ అయిపోతున్నారు. అయితే ఈ వాట్సప్ లో ఎన్నో వింతలు విశేషాలు దాగి ఉన్నాయి. కేవలం చాటింగ్, షేరింగ్ మాత్రమే కాదు మరెన్నో విషయాలు ఉన్నాయి. 2009లో మొదటి సారిగా వాట్సప్ ను ప్రవేశపెట్టారు. అయితే మొదట్లో ఇది ఒక సాధారణ చాటింగ్ యాప్ అయితే అది ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమై పోయింది. ముఖ్యంగా ఇందులోని సింపుల్ ఫీచర్స్ పెద్దగా టెక్నాలజీ పరిచయం లేని వాళ్లకు కూడా ఇట్టే అర్థమైపోతాయి. ఇఫ్పుడు వాట్సప్ కాల్స్, వీడియో కాల్స్ తో పాటు పేమెంట్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకునే ఫీచర్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసాయి. అయితే మీకు తెలియని మరెన్నో ఫీచర్లు కూడా వాట్సప్ లో ఉన్నాయి. అందులోని ఓ పది క్రేజీ ఫీచర్లు మీ చాట్ ను మరింత సౌకర్యవంతంగా చేస్తాయి. అవేంటో చూద్దాం.

 

Facebook డిలీట్ చేయండి, వాట్సప్ సహా వ్యవస్థాపకుడి పిలుపు, దెబ్బకు కుప్పకూలిన ఫేస్‌బుక్Facebook డిలీట్ చేయండి, వాట్సప్ సహా వ్యవస్థాపకుడి పిలుపు, దెబ్బకు కుప్పకూలిన ఫేస్‌బుక్

1. చాట్ గ్రూప్స్ మ్యూట్ చేయడం

1. చాట్ గ్రూప్స్ మ్యూట్ చేయడం

మీ వాట్సప్ లో గ్రూప్స్ ఎక్కువగా అయినప్పుడు పెద్ద ఎత్తున మెసేజెస్ వరదలా వచ్చి పడుతుంటాయి. అందులో చాలావరకూ వీడియో మేసేజెస్ లేదా ఇతర ఫోటోలు, పీడీఎఫ్ డాక్యూమెంట్స్ అవసరం ఉన్నా లేకున్నా డౌన్ లోడ్ అయిపోతుంటాయి. ఒక్కోసారి సదరు గ్రూప్స్ నుంచి బయటపడదామా అనేంతలా విసిగిపోతుంటాం. అలాంటప్పుడు మీరు గ్రూప్స్ నుంచి ఎగ్జిట్ కాకుండా 8 గంటల నుంచి ఏడాది వరకూ మ్యూట్ చేయవచ్చు. మ్యూట్ చేయడం వల్ల కంటిన్యూగా పింగ్ అయ్యే బాధ తప్పుతుంది. అంతేకాదు గ్రూప్ నుంచి ఎగ్జిట్ కావాల్సిన పనికూడా లేదు.

గ్రూప్ లో మీ మేసేజెస్ ఎవరు చదివారో తెలుసుకోవాలని ఉందా ?

గ్రూప్ లో మీ మేసేజెస్ ఎవరు చదివారో తెలుసుకోవాలని ఉందా ?

మీ సన్నిహితులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీకి చెందిన గ్రూప్స్ లో మీరు ఒక్కోసారి పోస్ట్స్ చేస్తుంటారు. ఆ పోస్ట్స్ వారు చదివారో లేదో తెలుసుకోవాలనే కుతూహలం ఉండటం సహజమే. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే, మీరు పంపిన మెసేజ్, ఫోటో, లేదా వీడియోను ప్రెస్ చేస్తే పై విండోలో ఆప్షన్స్ వస్తాయి

3. గ్రూప్ లో పోస్ట్ చేసిన మెసేజెస్ అందరికీ డిలీట్ చేస్తారా ?
 

3. గ్రూప్ లో పోస్ట్ చేసిన మెసేజెస్ అందరికీ డిలీట్ చేస్తారా ?

ఒక్కోసారి మనం యాక్సిడెంటల్ గా గ్రూప్స్ లో మెసేజెస్ పెట్టేస్తాం.. తర్వాత అది అందరూ చూడకముందే డిలీట్ చేయాలని అనుకుంటాం. ఎలా డిలీట్ చేయాలో తెలీక సతమతమవుతాం. ఈ సమస్యను గుర్తించిన వాట్సప్ తన కొత్త అప్ డేట్ లో పరిష్కారం కనుగొంది. మీరు పోస్ట్ చేసిన మెసేజ్ ను క్లిక్ చేసిన తర్వాత డిలీట్ ఫర్ ఎవిరీ వన్ ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే గ్రూప్ లో మరెవరికీ ఈ మెసేజ్ కనబడదు.

WhatsApp tips

WhatsApp tips

4. తక్కువ డేటా వాడకంతో వాట్సప్
వాట్సప్ లోని మీడియా ఫైల్స్ ఒక్కోసారి చాలా వరకూ డేటాను హరించేస్తాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు వాట్సప్ లో డేటా ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. దీనితో తక్కువ డేటాతో కేవలం టెక్స్ట్ మెసేజెస్ చదువుకునే వీలుంది.
5. టెక్ట్స్ కు సొబగులు అద్దండిలా..
మీ టెక్స్ట్ మెసేజెస్ కు సొబగులు అద్దేందుకు వాట్సప్ ఇప్పుడు పలు ఆప్షన్స్ ఇచ్చింది. అందులో ముఖ్యంగా టెక్స్ట్ ను బోల్డ్, ఇటాలిక్స్, అలాగే ఇతర స్మైలీలను మీ చాట్స్ లో వాడుకునే వీలుంది.
6. నోటిఫికేషన్స్ ను కస్టమైజ్ చేయడం
మీరు టచ్ చేయకుండానే వచ్చిన ఎంపిక చేసుకున్న కాంటాక్స్ నుంచి మెసేజెస్ చదువుకునే అవకాశం ఉంది. దీన్నే కస్టమైజ్ నోటిఫికేషన్ అంటారు. మీరు ఎంపిక చేసుకున్న కాంటాక్ట్స్ నుంచి వచ్చి టాప్ చేసి కస్టమైజ్ చేస్తే చాలు నోటిఫికేషన్ లోనే మెసేజ్ కనిపిస్తుంది.

WhatsApp tips

WhatsApp tips

7. మీ వాట్సప్ ను పర్సనలైజ్ చేసుకొండి
మీ వాట్సప్ బ్యాక్ గ్రౌండ్ ను ఎంపిక చేసుకున్న వాల్ పేపర్ తో మార్చుకునే వీలుంది. సెట్టింగ్స్ లోకి వెళ్లి మీ వాట్సప్ బ్యాక్ గ్రౌండ్ ను పర్సనలైజ్ చేసుకోవచ్చు.
8. మెసేజెస్ ను అన్ రీడ్ చేయండిలా..
బ్లూటిక్స్ వల్ల అవతలి వాళ్లు వారి మెసేజెస్ చదివారా లేదనేది తెలుస్తుంది. కానీ అలా తెలియకుండా బోల్తా కొట్టించవచ్చు. మార్క్ యాస్ అన్ రీడ్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా సదరు మెసేజ్ ను చదవనట్లు గుర్తించవచ్చు

WhatsApp tips

WhatsApp tips

9.చాట్ మొత్తం ఈమెయిల్ చేసే ఆప్షన్..
మీరు చేసిన చాట్ మొత్తం ఏక మొత్తంలో మీరు ఎంపిక చేసుకున్న మెయిల్ ఐడీకి ఈమెయిల్ చేసుకునే సదుపాయం వాట్సప్ కల్పించింది. తద్వారా చాట్ డిలీట్ అయినప్పటికీ ఈ మెయిల్ లో మొత్తం చాట్ డేటా నోట్ పాడ్ రూపంలో స్టోర్ అవుతుంది.
10.కన్వర్జేషన్ ను పిన్ చేసుకోండిలా ..
మీ వాట్సప్ కాంటాక్ట్స్ లిస్టు చాంతాడంత పొడుగు అయిపోయి, మీ అత్యంత సన్నిహితులను ప్రతి సారి సెర్చ్ లిస్ట్ లో టైప్ చేస్తూ వెతకాల్సి వస్తుందా. అయితే మీరు ఎంపిక చేసుకున్న కాంటాక్ట్స్ ను పిన్ చేసుకోవడం ద్వారా ఈ ఇబ్బంది నుంచి తప్పించుకునే వీలుంది. ఏవైనా మూడు కాంటాక్ట్స్ ను పిన్ చేసుకుంటే అవి పిన్ అవుతాయి. అప్పుడు సులభంగా గుర్తించవచ్చు.

Best Mobiles in India

English summary
WhatsApp tips: 10 tricks that will make you chat app expert More news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X