వాట్సప్ వాడేవారికి శుభవార్త, కొత్తగా గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ !

|

ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్లతో వినియోగదారులను అలరిస్తున్న మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ మరో సరికొత్త ఫీచర్ తో వినియోగదారులను అలరించడానికి రెడీ అయింది. ఈ మెసెజింగ్‌ ఆప్‌తో గ్రూప్‌ వీడియో కాల్స్‌ చేసుకునే అవకాశాన్ని త్వరలోనే కల్పించనున్నట్లు వాట్సప్‌ మాతృ సంస్థ ఫేస్‌బుక్‌ ప్రకటించింది. కాలిఫోర్నియాలోని సాన్‌ జోస్‌లో జరిగిన ఎఫ్‌8 సమావేశం సందర్భంగా ఫేస్‌బుక్‌ కంపెనీ ఈ విషయాన్ని ఆమోదించినట్లు తెలిపింది. దీంతో పాటు యూజర్లకోసం స్టిక్కర్స్ ని కూడా తీసుకురానుందని సమాాచారం. వీటి ద్వారా యూజర్లు తమ భావాలను టైప్ చేయకుండానే స్టిక్కర్ ద్వారా వెల్లడించే అవకాశం ఉంది.

 

మీ వీడియోను యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమ్ చేయటం ఎలా..?మీ వీడియోను యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమ్ చేయటం ఎలా..?

గ్రూప్‌ వీడియో కాలింగ్‌...

గ్రూప్‌ వీడియో కాలింగ్‌...

ఈ గ్రూప్‌ వీడియో కాలింగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని వాట్సాప్‌ ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే, కానీ ఇంతవరకూ దీని గురించి ఎటువంటి అధికారిక సమచారాన్ని తెలియజేయలేదు.

ఎఫ్‌8 సమావేశం అనంతరం..

ఎఫ్‌8 సమావేశం అనంతరం..

కానీ ఎఫ్‌8 సమావేశం అనంతరం త్వరలోనే వాట్సాప్‌లో గ్రూప్‌ వీడియో కాలింగ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. అయితే ఎప్పటి నుంచి ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుందనే విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు.

గ్రూపు వీడియో కాలింగ్‌ ఫీచర్‌ను

గ్రూపు వీడియో కాలింగ్‌ ఫీచర్‌ను

ప్రస్తుతం ఫేస్‌బుక్‌ ఈ గ్రూపు వీడియో కాలింగ్‌ ఫీచర్‌ను తన ఫోటో షేరింగ్‌ ఆప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పరీక్షించింది. ఇది మంచి ఫలితాన్ని ఇస్తే త్వరలోనే ఈ గ్రూప్‌ వీడియో కాలింగ్‌ ఫీచర్‌ను వాట్సప్‌లో కూడా అందుబాటులోకి తేనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

స్టిక్కర్స్
 

స్టిక్కర్స్

దీంతో పాటు ఛాటింగ్ సమయంలో మీరు పంపుకునే విధంగా కొన్ని స్టిక్కర్స్ ని కూాడా అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. వీటి ద్వారా యూజర్లు మరింత షార్ట్ కట్ లో తమ భావాలను వెల్లడించే అవకాశం కూడా ఉంది. 

దాదాపు 1.5 బిలియన్ల మంది..

దాదాపు 1.5 బిలియన్ల మంది..

ప్రస్తుతం వాట్సప్‌ ద్వారా వన్‌ టూ వన్‌ వాయిస్‌, వీడియో కాల్‌ చేసుకునే అవకాశం ఉంది. ఈ ఫీచర్‌ను నెలకు దాదాపు 1.5 బిలియన్ల మంది వినియోగిస్తున్నారు. అలానే ఫేస్‌బుక్‌ నూతనంగా ప్రవేశపెట్టిన వాట్సప్‌ స్టేటస్‌ ఫీచర్‌ను 450 మిలియన్ల మంది యూజర్లు రోజూ వాడుతున్నట్లు కంపెనీ ప్రకటించింది.

యూజర్లు రోజుకు 2 బిలియన్ల నిమిషాల సమయాన్ని ..

యూజర్లు రోజుకు 2 బిలియన్ల నిమిషాల సమయాన్ని ..

అంతేకాక యూజర్లు రోజుకు 2 బిలియన్ల నిమిషాల సమయాన్ని వాట్సప్‌ వాయిస్‌ కాలింగ్‌, వీడియో కాలింగ్‌ కోసం వాడుతున్నట్లు తెలిపింది. వాట్సప్‌ ఫిబ్రవరిలో అందుబాటులోకి తెచ్చిన వాట్సప్‌ పేమెంట్స్‌ ఫీచర్‌ను రోజుకు 200 మిలియన్ల మంది భారతీయ యూజర్లు వాడుతున్నట్లు ప్రకటించింది.

ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లలో

ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లలో

ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లలో సపోర్టు చేసే ఈ వాట్సప్‌ పేమెంట్స్‌ ఫీచర్‌ ద్వారా బాంక్‌ అకౌంట్‌కి ప్రత్యక్షంగా ఫండ్స్‌ ట్రాన్సఫర్‌ చేసుకునే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
WhatsApp to get new group video calling feature, stickers soon More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X