వాట్సప్‌లోకి మరో అదిరిపోయే ఫీచర్

ఇన్‌స్టంట్ మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న ఫేస్‌బుక్ సొంత యాప్ రోజు రోజుకు సరికొత్త ఫీచర్లతో యూజర్లను అలరిస్తూపోతోంది. ఇన్‌స్టాగ్రమ్ ఫీచర్ మాదిరిగా వాట్సప్‌లో కూడా సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.

|

ఇన్‌స్టంట్ మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న ఫేస్‌బుక్ సొంత యాప్ రోజు రోజుకు సరికొత్త ఫీచర్లతో యూజర్లను అలరిస్తూపోతోంది. ఇన్‌స్టాగ్రమ్ ఫీచర్ మాదిరిగా వాట్సప్‌లో కూడా సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు చాలా ఈజీగా తమ కాంటాక్ట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ పేరే Share Contact Info via QR.ఈ ఫీచర్ సహాయంతో వాట్సప్ యూజర్లు తమ తమ ఫోన్లలో నూతన కాంటాక్ట్‌లను మరింత సులభంగా యాడ్ చేసుకోవచ్చు.

వినియోగదారులను నిరాశపర్చిన ఆపిల్ iPad Proవినియోగదారులను నిరాశపర్చిన ఆపిల్ iPad Pro

 వాట్సప్ యాప్‌లోనే....

వాట్సప్ యాప్‌లోనే....

ఇందుకు గాను యూజర్ వాట్సప్ యాప్‌లోనే యాడ్ కాంటాక్ట్ ఆప్షన్‌ను ఎంచుకుని అందులో తాను కాంటాక్ట్స్‌లో ఎంట్రీ చేయాలనుకున్న ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. అనంతరం ఆ ఫోన్ నంబర్ గనక వాట్సప్‌లో ఉండి ఉంటే వెంటనే డిటెక్ట్ అయి క్యూ ఆర్ కోడ్ జనరేట్ అవుతుంది.

అవతలి యూజర్‌కు చెందిన పేరు, ఇతర వివరాలన్నీ కాంటాక్ట్‌లో ఆటోమేటిక్‌గా యాడ్ అవుతాయి....

అవతలి యూజర్‌కు చెందిన పేరు, ఇతర వివరాలన్నీ కాంటాక్ట్‌లో ఆటోమేటిక్‌గా యాడ్ అవుతాయి....

దాంతో అవతలి యూజర్‌కు చెందిన పేరు, ఇతర వివరాలన్నీ కాంటాక్ట్‌లో ఆటోమేటిక్‌గా యాడ్ అవుతాయి. అనంతరం ఆ కాంటాక్ట్‌ను సేవ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సప్ అంతర్గతంగా పరిశీలిస్తున్నది.

త్వరలోనే యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది....
 

త్వరలోనే యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది....

త్వరలోనే యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.ఈ విషయాన్ని వాట్సప్ ఫీచర్లను లీక్ చేసే WaBetaInfo తెలిపింది. ఇదిలా ఉంటేవాట్సప్‌ గత వారం మరో కొత్త ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది.

ప్రివ్యూ పేరిట రానున్న ఈ ఫీచర్...

ప్రివ్యూ పేరిట రానున్న ఈ ఫీచర్...

ప్రివ్యూ పేరిట రానున్న ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తాము వాట్సప్ పంపుకునే ఏ మెసేజ్‌నైనా ముందుగా ప్రివ్యూ చూడవచ్చు. అవసరం అనుకుంటే అందులో మార్పులు చేర్పులు చేయవచ్చు. అంతేకాకుండా ఒకరికన్నా ఎక్కువ మందికి ఆ మెసేజ్‌ను పంపేటట్లయితే ఆ జాబితాలోంచి యూజర్లను తీసేయవచ్చు లేదా మరికొందరికి యాడ్ చేయవచ్చు.

ఇక ఫొటోలు, వీడియోలు, జిఫ్ ఇమేజ్‌లు, టెక్ట్స్ సందేశాలు...

ఇక ఫొటోలు, వీడియోలు, జిఫ్ ఇమేజ్‌లు, టెక్ట్స్ సందేశాలు...

ఇక ఫొటోలు, వీడియోలు, జిఫ్ ఇమేజ్‌లు, టెక్ట్స్ సందేశాలు... ఇలా ఏ తరహా మెసేజ్‌నైనా పంపేముందు ప్రివ్యూ చూసుకునే అవకాశాన్ని వాట్సప్ కల్పించనుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్‌ను అంతర్గతంగా పరిశీలిస్తున్నారు. త్వరలో యూజర్లకు అందుబాటులోకి తేనున్నారు. గ్రూప్ మెసేజ్‌లను ఎక్కువగా పంపుకునే యూజర్లకు ఈ ఫీచర్ బాగా పనికొస్తుందని వాట్సప్ చెబుతున్నది.

 

 

Best Mobiles in India

English summary
WhatsApp to get this Instagram-like feature soon more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X