Home
Apps

వాట్సాప్‌లో సూపర్‌ ఫీచర్‌.. మీరు పంపిన ఫోటోలు, వీడియోలను ఎవరూ సేవ్‌ చేయలేరు..!

వాట్సాప్‌ (Whatsapp) ప్రస్తుతం ప్రపంచంలోనే ప్రముఖ మెసేజింగ్ యాప్స్‌లో ఒకటిగా ఉంది. భారత్‌లోనూ సుమారు 50 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. దీంతోపాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్‌ ప్రైవసీ యాప్స్‌లో వాట్సాప్ ఒకటిగా ఉంది. యూజర్ల అవసరాలు, సౌకర్యం, భద్రత ఇప్పటికే అనేక ఫీచర్‌లను కలిగి ఉన్న వాట్సాప్‌ తాజాగా మరిన్ని ఫీచర్‌లను విడుదల చేయనుందని ఫీచర్‌ ట్రాకర్‌ WABetainfo తెలిపింది.

ఇప్పటికే అనేక భద్రతా ఫీచర్లు :
ఇప్పటికే వాట్సాప్‌ అనేక ప్రైవసీ ఫీచర్‌లు ఉన్నాయి. ముఖ్యమైన ఛాట్‌లను లాక్‌ చేసుకోవడం సహా ఛాట్‌ను Hide చేసుకొనే అవకాశం కూడా ఉంది. మరియు వాట్సాప్‌ ఇతరులు వినియోగించకుండా పిన్‌, బయోమెట్రిక్‌ ఆప్షన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. మరియు వన్‌టైం ‌వ్యూ వంటి ఫీచర్‌లను కూడా అందుబాటులో తీసుకొచ్చింది.

whatsapp

వాట్సాప్‌లో మరింత ప్రైవసీ కోరుకొనే యూజర్‌లకు మరో బెస్ట్ ఫీచర్‌ రానుంది. వాట్సాప్‌లో తరచూ ఇతరులకు ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటారు. వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను ఇతరులకు షేర్‌ చేస్తున్న సమయంలో వన్‌టైం వ్యూ ఫీచర్‌ ను ఉపయోగిస్తాం.

కొత్త ఫీచర్‌ :
అయితే తాజాగా ఫోటోలు, వీడియోలను షేర్‌ చేస్తున్న సమయంలో అవతలి వ్యక్తులు వాటిని సేవ్‌ చేయకుండా ఉండేలా సరికొత్త ఫీచ‌ర్‌ను వాట్సాప్‌ అభివృద్ధి చేస్తోందని ఫీచర్‌ ట్రాకర్‌ తెలిపింది. వాట్సాప్‌ ఆండ్రాయిడ్ వెర్షన్‌లోని ప్రైవసీ సెట్టింగ్స్‌లో ఈ ఆప్షన్‌ ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫీచర్‌ను ఆన్‌ చేసుకుంటే.. మీరు పంపిన ఫోటోలు, వీడియోలను ఇతరులు సేవ్‌ చేసేందుకు అవకాశం ఉండదు.

ప్రత్యేకంగా ఓ మెసేజ్‌ కనిపిస్తుంది :
ఎవరైనా సేవ్‌ చేసేందుకు ప్రయత్నం చేసినప్పుడు ప్రత్యేకంగా ఓ మెసేజ్‌ కనిపిస్తుంది. ఫోటో, వీడియో సేవ్‌ చేయడం కుదరదు అని కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ తొలుత ఆండ్రాయిడ్ యూజర్‌లకు మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. iOS యూజర్‌లకు ఈ ఫీచర్‌ ఎప్పుడు విడుదల కానుందో తెలియాల్సి ఉంది.

ఇప్పటికే వాట్సాప్‌ ప్రొఫైల్‌ ఫొటోలను ఎవరూ సేవ్‌ చేయకుండా, స్క్రీన్‌షాట్‌ తీయకుండా ఉండేలా గతంలోనే వాట్సాప్‌ మార్పులు చేసింది. ఎక్స్‌పోర్ట్‌ చాట్‌ హిస్టరీ ఫీచర్‌ను కూడా తీసుకురానుందని తెలుస్తోంది. ఈ ఫీచర్‌ ద్వారా మీరు పంపిన మెసేజ్‌లను అవతలి వ్యక్తులు ఎక్స్‌పోర్టు చేసేందుకు అవకాశం ఉంది. అయితే ఈ ఫీచర్‌ ప్రస్తుతం ఏ దశలో ఉందో వెల్లడి కాలేదు.

ఇటీవలే వచ్చిన ఫీచర్‌లు :
ఇటీవలే వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌ విడుదల అయింది. ఇన్‌స్టాగ్రామ్ తరహాలో వాట్సాప్‌ స్టేటస్‌లోనూ మ్యూజక్‌ను జతచేసుకోవచ్చు. వాట్సాప్‌ మ్యూజిక్‌ లైబ్రరీ నుంచి మీకు నచ్చిన పాటను ఎంచుకోవచ్చు. మరియు పాటలో అందులో మీకు నచ్చిన భాగాన్ని స్టేటస్‌కు యాడ్‌ చేసుకోవచ్చు.

దీంతోపాటు మెటా AI తో ప్రొఫైల్‌ ఫొటోను క్రియేట్‌ చేసుకోవచ్చు. ప్రొఫైల్‌, గ్రూప్‌ ఐకాన్‌ను క్రియేట్‌ చేయవచ్చు. ఇందుకోసం Create AI Image అనే ఆప్షన్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తోపాటు గ్రూప్‌ చాట్స్‌లోనే అందుబాటులో ఉన్న ఈవెంట్స్‌ ఆప్షన్‌ను పర్సనల్‌ ఛాటింగ్‌ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
whatsapp to launch new feature to restrict to save shared images and videos
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X