Home
Apps

కేంద్రం దెబ్బకి యూజర్లకి దిమ్మతిరిగే షాకిచ్చిన వాట్సప్

ఈ మధ్య ఫేక్ మెసేజ్ లు విపరీతంగా సర్క్యులేట్ అవుతుండటంతో ఇన్ స్టంట్ మేసెజింగ్ దిగ్గజం వాట్సప్‌కు భారత ప్రభుత్వం గట్టివార్నింగ్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.

By Hazarath Aiah

ఈ మధ్య ఫేక్ మెసేజ్ లు విపరీతంగా సర్క్యులేట్ అవుతుండటంతో ఇన్ స్టంట్ మేసెజింగ్ దిగ్గజం వాట్సప్‌కు భారత ప్రభుత్వం గట్టివార్నింగ్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. వాట్సప్‌లో అసత్య వార్తలు ప్రచారం కావడం వల్ల పలువురు అమాయకులపై కొందరు దాడులకు దిగుతున్నారని.. అటువంటి తప్పుడు సందేశాలు వైరల్‌ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కేంద్రం వాట్సప్‌ను హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో వాట్సప్‌ సైతం నకిలీ వార్తలు విజృంభించకుండా చూస్తున్నాయి. దానికి కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటున్నాయి.

వాట్సప్ జారీ చేసిన ప్రకటనలో

వాట్సప్ జారీ చేసిన ప్రకటనలో

వాట్సప్‌ మెసేజ్‌లు, ఇమేజ్‌లు, వీడియోలు పెద్ద మొత్తంలో ప్రచారం కాకుండా ఉండేందుకు వాట్సప్‌ గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వాట్సప్ జారీ చేసిన ప్రకటనలో.. వాట్సప్‌లో ఫార్వర్డ్‌ అ‍య్యే టెస్ట్‌పై పరిమితి విధించినట్టు వాట్సప్‌ ప్రకటించింది.

ఐదు చాట్లకు మాత్రమే

ఐదు చాట్లకు మాత్రమే

కేవలం ఐదు చాట్లకు మాత్రమే మెసేజ్‌ ఫార్వర్డ్‌ అయ్యేలా నిర్దేశించింది. అదేవిధంగా మీడియా మెసేజ్‌లకు క్విక్‌ ఫార్వర్డ్‌ బటన్‌ను తీసేసింది.

భారత్‌లోనే మెసేజ్‌లు, వీడియోలు, ఫోటోలు

భారత్‌లోనే మెసేజ్‌లు, వీడియోలు, ఫోటోలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల కంటే, భారత్‌లోనే మెసేజ్‌లు, వీడియోలు, ఫోటోలు ఎక్కువగా ఫార్వర్డ్‌ అవుతున్నాయని వాట్సప్‌ తెలిపింది. ఒకేసారి మల్టిపుల్‌ చాట్లకు మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేసుకునేలా వాట్సప్‌ ఫీచర్‌ను కొన్నేళ్ల క్రితమే తీసుకొచ్చింది.

పెద్ద ఎత్తున్న మెసేజ్‌లు

పెద్ద ఎత్తున్న మెసేజ్‌లు

ప్రస్తుతం పెద్ద ఎత్తున్న మెసేజ్‌లు ఫార్వర్డ్‌ అవుతూ... అనాగరిక ధోరణులు పెరుగుతుండటంతో, ఐదు చాట్లకు మాత్రమే మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేసుకునేలా అవకాశం కల్పిస్తోంది.

ఓరిజినల్‌ ఏదో గుర్తించేందుకు

ఓరిజినల్‌ ఏదో గుర్తించేందుకు

ఈ ఫార్వర్డ్‌ మెసేజ్‌లో ఓరిజినల్‌ ఏదో గుర్తించేందుకు వాట్సప్‌ గత నెలలోనే ఫార్వర్డ్‌ లేబుల్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది.

 దాడులు పెరుగుతుండటంతో

దాడులు పెరుగుతుండటంతో

వాట్సప్‌ ఫార్వర్డ్‌ మెసేజ్‌లతో దేశంలో భారీ ఎత్తున దాడులు పెరుగుతుండటంతో, వాట్సప్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

కేంద్ర నోటీసులకు స్పందించిన వాట్సప్‌

కేంద్ర నోటీసులకు స్పందించిన వాట్సప్‌

కేంద్ర నోటీసులకు స్పందించిన వాట్సప్‌, టెక్నాలజీని వాడుకుని, కొత్త ఫీచర్లతో ఫార్వర్డ్‌ మెసేజ్‌లను గుర్తిస్తామని, ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది.

More from GizBot

Best Mobiles in India

English summary
WhatsApp to limit message forwarding to five chats in India More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X