వాట్సాప్‌లో సూపర్ ఫీచర్.. Search On Web ఫీచర్ మీకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి..?
ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ (Whatsapp) వినియోగదారుల సౌకర్యం, భద్రత కోసం అనేక ఫీచర్‌లను తీసుకొచ్చింది. అయితే సోషల్ మీడియా ద్వారా జరిగే నకిలీ సమాచారం వ్యాప్తికి చెక్ పెట్టేలా కీలక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ అప్‌డేట్‌పై వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo కీలక వివరాలను వెల్లడించింది. దీంతోపాటు వాట్సాప్ ద్వారా మోసాలకు పాల్పడడం మరియు వాట్సాప్‌ను దుర్వినియోగం చేయడం, భారత ఐటీ నిబంధనలను పాటించకపోవడంతో సెప్టెంబర్ నెలలో 85 లక్షల అకౌంట్‌లను వాట్సాప్ బ్యాన్ చేసినట్లు పేర్కొంది.
వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ సమాచారం ఆధారంగా త్వరలో సెర్చ్ ఆన్ వెబ్ (Search On Web) పేరుతో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయవచ్చు. నేరుగా యాప్ నుంచే ఈ ఇమేజ్ సెర్చ్ సాధ్యమవుతుంది. వాట్సాప్ బీటా యూజర్లకు తొలుత ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

ప్రస్తుతం వాట్సాప్ ద్వారా అనేక ఫోటోలు వైరల్ అవుతుంటాయి. అయితే వాటిలో నకిలీ ఫోటోలు కూడా అధికంగానే ఉంటాయి. ఎడిట్ చేయడం లేదా ఇతరులకు కించపరిచే విధంగా మార్పులు చేసి, వైరల్ చేస్తుంటారు. ఈ ఫీచర్‌తో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ కంటెంట్ మరింత మెరుగుపడుతుందని భావిస్తోంది.
వాట్సాప్‌లో మీకు వచ్చిన ఫోటోలను ఈ ఫీచర్ ద్వారా తనిఖీ చేయవచ్చు. ఈ ఫోటోను ఎడిట్ చేశారా.. ఫోటో మూలం ఎక్కడ ఉంది. వంటి వివరాలను గుర్తించవచ్చు. ఇతర సెర్చ్ యాప్‌లు, బ్రౌజర్‌లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా వాట్సాప్ నుంచే సెర్చ్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
📝 WhatsApp beta for Android 2.24.23.13: what's new?
— WABetaInfo (@WABetaInfo) November 5, 2024
WhatsApp is rolling out a feature to search shared images on the web, and it's available to some beta testers!
Some users can experiment with this feature by installing certain previous updates.https://t.co/FatAbFYHTA pic.twitter.com/FEjzeB7dwO
ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
వాట్సాప్‌లో కొన్నిసార్లు వివధ ఫొటోలు వస్తుంటాయి. వాటి మూలాలు తెలుసుకొనేందుకు వాట్సాప్ చాట్‌లో ఫొటోను ఓపెన్ చేయాలి. అనంతరం యాప్ పైభాగంలో కుడివైపున (Top Right) త్రీ డాట్స్ కనిపిస్తాయి. దానిని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అనేక ఆప్షన్‌లు ఉంటాయి. వాటిలో నుంచి సెర్చ్ ఆన్ వెబ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
Search on Web ఫీచర్ ద్వారా రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను ప్రారంభించవచ్చు. ఆ తర్వాత ఆ ఫోటో తొలిసారిగా ఎక్కడ అప్‌లోడ్ అయింది?.. ఆ ఫోటోను ఎడిట్ చేశారా?.. ఎక్కడెక్కడ వినియోగించారు?.. వంటి అనేక వివరాలు వెల్లడవుతాయి. ఫలితంగా మీకు వచ్చిన ఫోటో నిజమైనదా లేదా అనే అంచనాకు రావచ్చు.
అయితే వాట్సాప్ సెర్చ్ ఆన్ వెబ్ నుంచి... ప్రామాణికతను గుర్తించేందుకు సెర్చ్ కోసం పంపించే ఫోటోలు మెటాతో షేర్ కావని వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ తెలిపింది. సెర్చ్ కోసం మాత్రమే ఉపయోగపడతాయని, ఇతర ప్రాంతాల్లో సేవ్ చేసేందుకు అవకాశం లేదని Wabetainfo తెలిపింది.
ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ కోసం మాత్రమే తొలుత విడుదల కానుంది.
కొన్ని వారాల తర్వాత వినియోగదారులు అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈ ఫీచర్‌ను ఆప్షనల్‌గా విడుదల చేయనున్నారని తెలుస్తోంది. కావాల్సిన వినియోగదారులు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ తరహా తనిఖీల కోసం థర్డ్ పార్టీ యాప్‌లను వినియోగిస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున నకిలీ సమాచారం చలామణి అవుతుంటుంది. వ్యక్తులు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని కొందరు నకిలీ ఫోటోలతో ప్రచారం చేస్తారు. వాట్సాప్ ద్వారా ఈ తరహా సమాచారం వ్యాప్తి జరిగిన ఘటనలు కూడా అధికంగానే ఉన్నాయి. సెర్చ్ ఆన్ వెబ్ ఫీచర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, నకిలీ ఫోటోలను కొంతవరకైన కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








